ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ గదికి వచ్చి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నానని రాజ్ అంటే.. కావ్య సిగ్గు పడుతూ మీరు ఏం చెబుతారో నాకు తెలుసని అంటుంది. కావ్య చేతులు పట్టుకుని ఈ విషయం ఎవరికీ తెలీకూడదు.. ఎవరికీ చెప్పకూడదని రాజ్ అంటాడు. భార్యాభర్తల విషయాలు ఎవరైనా బయటకు చెబుతారా అని కావ్య అంటుంది. నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నాను. నువ్వే నాకు సహాయం చేయాలని రాజ్ అంటాడు. అది విని కావ్య షాక్ అవుతుంది. ఏమైందండి.. ఎవ్వరూ ఊహించలేనిది.. ఎవరూ అనుకోనిది జరిగింది. దుగ్గిరాల వంశ ప్రతిష్టకు ఇది ఒక సమస్యగా మారబోతుందని రాజ్ అంటే.. కావ్య టెన్షన్ పడుతూ అసలు ఏం జరిగిందండి? అని అడుగుతుంది. దీంతో రాజ్ రూ.100 కోట్ల గురించి జరిగిన విషయం అంతా చెబుతాడు. ఏం అంటున్నారేంటి? అని కావ్య అంటే.. తాతాయ్య మాట నిలబెట్టాలి. వంశ ప్రతిష్ట, పరువు, దృష్టిలో పెట్టుకోవాలి. ఆస్తులన్నీ అలాగే ఉండాలి.. మన కుటుంబం రోడ్డున పడకూడదు. జప్తు దాకా రానివ్వకూడదు. రేపే బ్యాంక్ ఆఫీసర్స్ ఆఫీస్‌కి వస్తారు. వాళ్లు ఇచ్చిన గడుపు పూర్తి అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదని రాజ్ అంటాడు.
మీలో ఇంత సంఘర్షణ జరుగుతుందా? ఇంత పెద్ద సమస్యను మీలో దాచుకుని ఎవరికీ తెలీకుండా మీలో మీరే నలిగిపోతున్నారా? ఎలా భరించారండి ఇన్ని రోజులు.. ముందే ఈ విషయం మీరు నాతో ఎందుకు చెప్పలేదని కావ్య నిలదీస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలీకూడదని నిర్ణయించుకున్నా.. కానీ తాతయ్య ఇచ్చిన మాట నిలబడానికి ఇన్ని రోజులు ప్రయత్నించా.. నీకు తోచిన సలహా ఏమన్నా ఉంటే చెప్పవా అని రాజ్ అడుగుతాడు. నాకు అంతా శూన్యంగా ఉంది. అసలు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి తీసుకు రావాలని కావ్య అంటుంది. తెలుసు.. ఇప్పటికే డబ్బు కోసం అత్త, పిన్ని ఆస్తి కోసం గొడవ పడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా పెద్ద గొడవ చేస్తారు. ఈ ఇల్లు ముక్కలు కాకూడదని తాతయ్య ఆశ అని రాజ్ అంటాడు. ఏమైనా పర్వాలేదు.. ఏదో ఒకటి చేద్దాం. రేపు నేను కూడా ఆఫీస్‌కి వచ్చి బ్యాంక్ వాళ్లతో మాట్లాడతాను. మీరు అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండమని కావ్య అంటే.. రాజ్ కావ్యని హత్తుకుని థాంక్స్ చెబుతాడు రాజ్.
ఇక తెల్లవారుతుంది. రాజ్, కావ్యలు ఆఫీస్‌కి బయలు దేరతారు. ఇవి మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్.. ఇవి మీ బ్యాగ్‌లో పెట్టుకోండి. వీటితో కొంచెం పని ఉందని కావ్య అంటుంది. తాతయ్య ఇవన్నీ నా పేరు మీద రాశారు కదా.. ఒక వేళ బ్యాంక్ వాళ్లకు ఎదురు తిరిగి ఆస్తి అంతా నీదేనని, తాతయ్యకు ఏం సంబంధం లేదని అనవు కదా అని రాజ్ అంటే.. ఛీ ఛీ ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు? అందరం కలిసి ఉండాలనే తాతయ్య నా పేరు మీద ఆస్తి రాశారు. వీటితో మనకు పని ఉంది. అంతే తప్పప.. తాతయ్య గారు ఇచ్చిన మాట పోయేలా నేను ఎందుకు ఎదురు తిరుగుతాను అని కావ్య అంటుంది. సారీ కళావతి నేను అలా అనకుండా ఉండాల్సిందని రాజ్ అంటాడు. రాజ్, కావ్యలు కలిసి ఆఫీస్‌కి వెళ్తారు. అది చూసి సుభాష్.. ఇది కళా నిజమా.. అసలు వీళ్లిద్దరూ కలిసి రావడం ఏంటి? అని సుభాష్ అంటే.. కలిసి వచ్చినంత మాత్రాన కలిసిపోయినట్టు కాదు కదా అని ధాన్యలక్ష్మి అంటే.. కాస్త మంచి మాటలు మాట్లాడొచ్చు కదా ధాన్యలక్ష్మి అని అపర్ణ అంటుంది.
ఆఫీస్‌కి వెళ్తున్నామని చెబుతారు. ఇదే కదా మాకు కూడా కావాలి అని అపర్ణ వాళ్లు అంటారు. కావ్యని కూడా తీసుకెళ్లేంత పని ఏంటో అని ధాన్యలక్ష్మి అంటే.. తను రాకపోతే ఎలా కుదురుతుంది పిన్నీ.. తనే కదా అంతా చేయాలని రాజ్ అంటాడు. దీంతో కావ్య రాజ్ చేయి పట్టుకుని.. అదే కొన్ని డిజైన్స్ వేయాల్సి ఉందట. అందుకే వెళ్తున్నామని కావ్య అంటుంది. ఇక ఇద్దరూ వెళ్తారు. రాజ్‌లో చాలా మార్పు వచ్చిందని సుభాష్ అంటాడు. నేను పడ్డ శ్రమ ఫలించింది.. ఈ విషయం కనకానికి చెప్పాలని అపర్ణ అంటుంది. బయటకు వెళ్లగానే.. స్వప్న ఎదురు పడి ఏంటి ఇద్దరూ కలిసి లాంగ్ డ్రైవ్‌కి వెళ్తున్నారా? అని అడుగుతుంది. కాఫీ ఆఫీస్‌కి అని అంటుంది కావ్య. ఇక స్వప్నకు ఇంటి తాళాలు, బాధ్యతలు అప్పజెప్పుతుంది కావ్య. అదంతా చూసి రాజ్ నవ్వుతాడు. ఇక రాజ్, కావ్యలు వెళ్లడం చూసి రుద్రాణి షాక్ అవుతుంది. మరోవైపు కనకానికి ఫోన్ చేసి రాజ్, కావ్యలు కలిసిపోయారని అంటుంది అపర్ణ. దీంతో సంతోష పడుతుంది కనకం. ఈ విషయం కృష్ణమూర్తికి చెబుతుంది కనకం. వాళ్లిద్దరూ అర్థం చేసుకుని కలిసారా లేక అవసరానికి కలిసారో అని కృష్ణమూర్తి అంటాడు.
ఇక కావ్య, రాజ్‌లు ఆఫీస్‌కి వెళ్తారు. బ్యాంక్ వాళ్లకు కావ్యని మై వైఫ్ అని పరిచయం చేస్తాడు రాజ్. సర్ మేము డబ్బులు కట్టాలనే డిసైడ్ అయ్యాం. కానీ 100 కోట్లు ఒకటే సారి కాదు.. ఇన్‌స్టాల్మెంట్స్‌లో క్లియర్ చేస్తామని కావ్య అంటుంది. ఇన్‌స్టాల్మెంట్స్‌లో కుదరదు కావ్య గారు అని బ్యాంక్ వాళ్లు అంటే.. మా తాతయ్య గారు శూరిటీ పెట్టిన మాట నిజమే.. వాళ్లు బోర్డు తిప్పేసింది నిజమే.. మేము డబ్బులు ఇస్తామన్నది వాస్తవమే.. ఇలా అవుతుందని డబ్బు రెడీగా పెట్టుకోం కదా.. అందుకే ఆ అమౌంట్ ఇన్‌స్టాల్మెంట్స్‌లో క్లియర్ చేస్తాం. మీ దగ్గర లోన్ తీసుకున్న కస్టమర్లకు.. ఈజీగా తిరిగి చెల్లించడానికి ఇన్‌స్టాల్మెంట్స్ ఆఫర్స్ ఉంటాయి కదా.. మేము కూడా అదే కావాలి అంటున్నామని కావ్య అంటుంది. అందుకు బ్యాంక్ వాళ్లు కూడా ఒప్పుకుంటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌లో డబ్బు ఖర్చు పెట్టినందుకు అందరూ లెక్కలు ఇవ్వాలని కావ్య ఆర్డర్ వేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..