Brahmamudi, December 16th Episode: ఇంటి ఖర్చులతో కావ్యకు చుక్కలు.. దొంగను కనిపెట్టిన రాజ్!

|

Dec 16, 2024 | 1:40 PM

రుద్రాణి, ధాన్యలక్ష్మి వచ్చి ఇంటి ఖర్చుల విషయంలో వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. దీంతో కావ్య కంగారు పడుతూ ఉంటుంది. ఈ ఇంట్లో నీళ్లలా డబ్బును ఖర్చు పెడుతున్నారని అనుకుంటుంది. మరోవైపు చేతి దాకా వచ్చిన దొంగను పట్టుకోవడంలో రాజ్ మిస్ అవుతాడు..

Brahmamudi, December 16th Episode: ఇంటి ఖర్చులతో కావ్యకు చుక్కలు.. దొంగను కనిపెట్టిన రాజ్!
Brahmamudi
Image Credit source: Disney Hotstar
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. వంద కోట్లను ఎక్కడి నుంచి తీసుకు రావాలో తెలీక రాజ్ ఆలోచనలో పడతాడు. ఆఫీస్ నుంచి అలానే నడుచుకుంటూ వెళ్తాడు. డ్రైవర్ వచ్చి ఏంటి సార్.. ఎంత పిలిచినా నడుచుకుంటూ వెళ్తున్నారు. కారు ఎక్కమని అంటాడు. ఆ తర్వాత రాజ్ అప్పుడే పోలీస్‌కి ఫోన్ చేసి.. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఈఎండీ చిట్ ఫండ్ కంపెనీ ఎండీ నందగోపాల్. తన ఇంటి అడ్రెస్ కూడా కావాలని రాజ్ చెప్తాడు. సరేనని పోలీస్ అంటాడు. ఇక డ్రైవర్‌కి చెప్పి ఆ అడ్రెస్‌కి వెళ్లమని అంటాడు. ఆ తర్వాత కిచెన్‌లో ఉన్న కావ్య దగగరకు వచ్చిన రుద్రాణి.. ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. వంట చేస్తున్నా అని కావ్య అంటే.. నువ్వు ఏదీ స్ట్రెయిట్‌గా చెప్పవా.. అన్నీ వంకరగానే చెప్తావా.. వంట అంటే ఏం కూర వండుతున్నావని అడుగుతున్నానని అంటుంది రుద్రాణి. పప్పు దోసకాయ అని అంటుంది. అబ్బా అన్నీ అలాంటి కూరలేనా.. అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది రుద్రాణి. ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఏంటి ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది. ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయా అని అంటుంది. అయిపోయాయి.. తీసుకు రావాలని కావ్య అంటే.. ముందు ఫ్రూట్స్ తెప్పించు.. ఏంటి పాలు కూడా లేవా అని రుద్రాణి అడిగితే.. అవి ఒలికిపోయాయని కావ్య అంటుంది.

కావ్యకు ధాన్యలక్ష్మి వార్నింగ్..

అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి.. ఒలికిపోయాయో.. మేము తాగడం ఇష్టం లేక ఒలికిపోయేలా చేశావో ఎవరికి తెలుసు అని అంటుంది. మీరు తాగడం నాకు ఎందుకు ఇష్టం ఉండదని కావ్య అడిగితే.. మాకు అలానే అనిపిస్తుంది. నువ్వు చేసే పనులన్నీ కూడా అలాగే కనిపిస్తున్నాయి. ముందు పాలు, పండ్లు గురించి చూడు అని ఆర్డర్ వేస్తుంది ధాన్యలక్ష్మి. చూడదు ధాన్యలక్ష్మి.. అలా కాలక్షేపం చేస్తుంది. మా నాన్న గారి ఆస్తి నీ పేరు రాయగానే నీ కళ్లు నెత్తికి ఎక్కాయి. కొపం తీసి ఈ ఆస్తి అంతా అమ్మేసి.. చంద్రమండలం మీద ఇల్లు కొందాం అనుకుంటున్నావా ఏంటి అని రుద్రాణి అంటుంది. అంత తెలివి నాకు ఉంటే ఎందుకు మీతో మాటలు పడతానని కావ్య అంటుంది. అయినా ధాన్యలక్ష్మి తగ్గకుండా కావ్యకి వార్నింగ్ ఇస్తుంది. ఎవరికి ఏం కావాలో అన్నీ ముందే తెప్పించమని ధాన్యలక్ష్మి అంటుంది. అలాగే నా రూమ్‌లో ఏసీ పని చేయడం లేదు. షవర్ కూడా సరిగా రావడం లేదు. సబ్బులు అన్నీ సగానికి అరిగిపోయాయని లిస్ట్ చెబుతుంది రుద్రాణి. సరే అన్నీ చేస్తానని కావ్య అంటుంది.

ఇంట్లో ఖర్చులు చూసి కావ్య బెంబేలు..

మరోవైపు నంద గోపాల్ ఇంటికి వెళ్తాడు రాజ్. సర్ ఇక్కడికి రావడం లేదు. మీరు పేరు, నెంబర్ చెప్పండి. సర్ రాగానే చెప్తానని సెక్యూరిటీ అంటాడు. దీంతో రాజ్ రూట్ మార్చి.. మీ సార్‌ని నేను రూ.50 లక్షలు ఇవ్వాలని చెప్తాడు. నిజంగానే మీరు డబ్బులు ఇవ్వడానికి వచ్చారా.. ఫామ్ హౌస్‌లో ఉన్నారని సెక్యూరిటీ చెప్తాడు. సరేనని అంటాడు రాజ్. మరోవైపు డిజైనర్ సారీస్ అన్నీ చూస్తుంది ధాన్యలక్ష్మి. అవన్నీ చూసి ధాన్యలక్ష్మి మురిసిపోతుంది. ఈ సారీ చాలా బావుంటుందని డిజైనర్ అంటుంది. సరే ఈ సారి డిజైన్ చేయమని ధాన్యలక్ష్మి చెబుతుంది. ఈలోపు కావ్యని పిలిచి మూడు లక్షలు తీసుకు రమ్మని చెబుతుంది. ఆ మాట విని కావ్య షాక్ అవుతుంది. మూడు లక్షలే తీసుకు రమ్మని ధాన్యలక్ష్మి ఆర్డర్ వేస్తుంది. ఇక కావ్య సరే అని తీసుకొచ్చి ఇస్తుంది. డిజైనర్ వెళ్లిపోయాక.. కావ్యకి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఏంటో వీళ్ల ఖర్చులు.. ఇది చూస్తుంటే నాకు దిమ్మతిరుగుతుందని అనుకుంటుంది కావ్య.

ఇవి కూడా చదవండి

ఎస్కేప్ అయిన నంద గోపాల్..

మరోవైపు పోలీస్ రాజ్‌కి ఫోన్ చేసి.. ఎక్కడ ఉన్నావని అడుగుతాడు. వెళ్లి కాసేపట్లో పట్టుకుంటానని రాజ్ అంటే.. అస్సలు వదలొద్దు వాడిని.. ఎంతో మందిని అమాయకుల్ని చేసి డబ్బు అంతా గుంజుతున్నాడని పోలీస్ అంటాడు. సరే అని రాజ్ అంటాడు. ఈలోపు నందగోపాల్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ.. పోలీస్ ఫోన్ చేస్తాడు. అతను వస్తున్నాడు.. నువ్వు వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోమని చెప్తాడు. రాజ్ వచ్చేలోపు.. సెక్యూరిటీ గేటుకు తాళం వేస్తాడు. మీ సార్ నందగోపాల్ ఎక్కడ అని అడుగుతాడు. రెండు గంటల ముందే ఫారిన్ వెళ్లిపోయాడని సెక్యూరిటీ చెప్తాడు. అప్పుడే పోలీస్ ఫోన్ చేసి దొరికాడా వాడు అని అని అడుగుతాడు. పారిపోయాడని రాజ్ అంటాడు. వాడు కంపెనీ సీజ్ చేసినందుకు బ్యాంక్ వాళ్లు మా కంపెనీకి వచ్చారని అంటాడు.

పెద్దింటికి వచ్చాక అంతా మారాలి..

ఆ తర్వాత కావ్య దగ్గరకు వెళ్లిన స్వప్న.. నేను ఆన్‌లైన్‌లో డ్రెస్ బుక్ చేసుకున్నా.. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా.. ఆన్ లైన్ డెలివరీ పెట్టనా.. అంత డబ్బు నీ అకౌంట్‌లో ఏం ఉంటుందిలే.. క్యాష్ ఆన్ డెలివరీ పెడతానని అంటుంది. పర్వేలేదు అక్కా.. అప్పుడప్పుడు నేను చేసిన సేవింగ్స్ ఉన్నాయిలే. ఎంత చెప్పు అని కావ్య అడిగితే.. స్వప్న లక్షన్నర అని అంటుంది. ఇంట్లో అందరికీ కొంటున్నావా అని కావ్య అడుగుతుంది. ఇంట్లో అందరికీ నేను ఎందుకు కొంటాను. నాకే అని స్వప్న అంటుంది. అదేంటి అక్కా మనం మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాం కదా.. నీకేమైంది నువ్వు కూడా ఈ ఇంట్లో వాళ్లలా ఖర్చు పెడుతున్నావ్ ఏంటి? అని కావ్య అంటుంది. మారిపోవాలి.. ఎక్కడి వాతావరణం బట్టి మారిపోవాలి. వెళ్లి డబ్బులు తీసుకురమ్మని స్వప్న అంటే.. సరేనని కావ్య వెళ్లి డబ్బులు తీసుకొస్తుంది.

రుద్రాణికి ఇచ్చి పడేసిన స్వప్న.. రాజ్ ఫ్రస్ట్రేషన్..

అప్పుడే రుద్రాణి వచ్చి చప్పట్లు కొడుతుంది. అక్కాచెళ్లెల అనుబంధం ఇలా ఉంటుందని మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. మేము అడిగితే ఎందుకు అని ఆరాలు తీస్తున్నావ్? అదే మీ అక్క అడిగితే క్షణం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నావ్ అంటూ రెచ్చిపోతుంది రుద్రాణి. దీంతో రుద్రాణి ఇచ్చి పడేస్తుంది స్వప్న. అదంతా చూసి అమ్మో బాధ్యతల నుంచి తప్పుకుని తాళాలు ఇచ్చేయాలని కావ్య అనుకుంటుంది. ఇక నంద గోపాల్ ఎయిర్ పోర్టులో కూడా లేడని పోలీస్ చేస్తే.. వాడు ఎక్కడున్నా నాకు తెలియాలని రాజ్ అంటాడు. నాకు కొంచెం టైమ్ ఇవ్వమని పోలీస్ అంటే.. ఒక వారం రోజులే కావాలి. దీంతో 100 కోట్ల గురించి చెబుతాడు రాజ్. అది విని షాక్ అవుతాడు రాజ్. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..