Brahmamudi, December 14th Episode: కంపెనీకి వంద కోట్ల నష్టం.. కొత్త విలన్ ఎంట్రీ.. రోడ్డుపై రాజ్!

|

Dec 14, 2024 | 11:39 AM

అవసరం కోసం సుభాష్‌ని డబ్బులు అడుగుతుంది రుద్రాణి. డబ్బుల విషయం నాకు సంబంధం లేదు వెళ్లి.. కావ్యని అడగమని అంటాడు సుభాష్. దీంతో కావ్యని వెళ్లి అడుగుతుంది రుద్రాణి.. ఎందుకు అని కావ్య అడిగితే.. మధ్యలో ధాన్యలక్ష్మి ఎంట్రీ ఇచ్చి.. మా ఇష్టం అంటుంది. మరోవైపు కంపెనీకి వంద కోట్ల నష్టం వస్తుంది..

Brahmamudi, December 14th Episode: కంపెనీకి వంద కోట్ల నష్టం.. కొత్త విలన్ ఎంట్రీ.. రోడ్డుపై రాజ్!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కనకం ఇంటికి వస్తే రుద్రాణి అవమానించేలా మాట్లడుతుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటాయనే నేను ఇంటికి రాలేదు. కానీ ఈ విషయం తెలిశాక రాకుండా ఉండలేక పోయాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అంటుంది కనకం. ఇంట్లో పరిస్థితులే ఇలా ఉన్నాయి కనకం. నా మాటలు నిన్ను ఇబ్బంది పెడితే నువ్వే మమ్మల్ని క్షమించాలి.. కావాల్సినంత ఆస్తి ఉన్నా.. పిడికిడంత ప్రశాంతత కూడా లేకుండా పోయింది. ఈ ఇంట్లో మనవాళ్లు ఎవరో బయట వాళ్లు ఎవరో అర్థం కావడం లేదు. బయట వాళ్లు అనుకున్న మీరు.. మా మంచి కోరుకుంటే.. మా వాళ్లు అనుకున్న వీళ్లు నా బావ చావు కోరుకుంటున్నారు. చివరి రోజుల్లో మాకు ఈ శోకం ఎందుకో.. పోయిన జన్మలో మేము ఏం పాపం చేశామో అనుకుంటూ బాధ పడుతుంది ఇందిరా దేవి. మరోవైపు ఆఫీసులో పనులు చూసుకుంటూ ఉంటాడు రాజ్. అప్పుడే ఒక ఇద్దరు నేరుగా లోపలికి వచ్చేస్తారు. ఏయ్ ఎవరు మీరు? మేము బ్యాంక్ నుంచి వచ్చాము.. రాజ్ అంటే మీరేనా అని అడుగుతారు. అవును.. బ్యాంక్ నుంచి వస్తే పర్మిషన్ తీసుకోకుండా వచ్చేస్తారా అని రాజ్ అడిగితే.. సారీ మేము మీ తాతయ్య గారి కోసం వచ్చాం. కానీ ఆయన కోమాలో ఉన్నారని తెలిసింది. ఆయన వంద కోట్లకు శూరిటీ పెట్టారని బ్యాంక్ వాళ్లు అంటే.. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు అనుకుని ఎవరి దగ్గరకు వచ్చారో కనుక్కోమని రాజ్ అంటాడు.

వంద కోట్లకు శూరిటీ పెట్టారు..

సీతారామయ్య గారు అంటే మీ తాతయ్యే కదా.. ఆయన మనవడు స్వరాజ్ మీరే కదా అని వాళ్లు అడిగితే.. అవును అని రాజ్ అంటాడు. అయితే మేము రైట్ ప్లేస్‌కే వచ్చాం. మీకు ఎండీ చిట్ ఫండ్ కంపెనీ తెలుసు కదా.. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయాక కొంత కాలం ఆయన కొడుకు నడిపించాడు. ఆ కంపెనీ ఇప్పుడు సడెన్‌గా బోర్డు తిప్పేసింది. సుమార్ 1000 మందికి పైగా నష్టపోయారు. కంపెనీ స్టార్ట్ చేసే టైమ్‌లో మీ తాతయ్య గారు మా బ్యాంక్‌లో 100 కోట్లకు పైగా శూరిటీ సంతకం పెట్టారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. కాబట్టి ఆ వంద కోట్లు మీరే కట్టాలి. సో ఈ కంపెనీ ఎండీగా మీరే ఈ వంద కోట్లు కట్టేస్తారా లేక కంపెనీ, ఇంటిని జప్తు చేయమంటారా అని బ్యాంక్ వాళ్లు అడుగుతారు. చూడండి ఇది షాకింగ్ న్యూస్.. కొంచెం టైమ్ కావాలి.. ఆలోచించుకుని చెబుతామని రాజ్ అంటాడు. సారీ సర్ ఇప్పుడు అంత టైమ్ లేదు.. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఈ పేపర్స్ మీద సంతకం పెడితే.. మీకు డబ్బు కట్టేందుకు పది రోజుల టైమ్ ఇస్తామని బ్యాంక్ వాళ్లు.. రాజ్‌ని ఇబ్బంది పెట్టేస్తారు.

వంద కోట్లపై సంతకం పెట్టిన రాజ్..

ఇంతలో రాజ్ పీఏ.. సర్ మీతో కాస్త పర్సనల్‌గా మాట్లాడాలని అంటాడు. సరే అని రాజ్ బయటకు వెళ్లి ఏంటి? అని అడుగుతాడు. సర్ అది మీ తాతయ్య గారు సంతకం పెట్టారు కదా.. ఆయన ఇప్పుడు కోమాలో ఉన్నారు. అయినా ఇప్పుడు ఆస్తి అంతా కావ్య గారి పేరు మీద ఉంది కాబట్టి.. నాకు ఏం సంబంధం లేదని చెప్పమని పీఏ అంటాడు. రేయ్ నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఆస్తి కోసం ఆయన ఇచ్చిన మాటను గాలికి వదిలేసి.. ఆయన పరువును రోడ్డున పెట్టమంటావా.. అలా చేస్తే ఆయన మా తాతయ్య గురించి తప్పుగా మాట్లాడతారు. ఆయన గురించి ఎవరు చెడుగా మాట్లాడినా అది మంచిగానే మాట్లాడాలని రాజ్ అంటాడు. ఇక లోపలికి వెళ్లిన రాజ్‌.. ఫైల్స్ మీద సంతకం పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత రాజ్ ఆలోచనలో ఉంటాడు. వంద కోట్లు ఎలా కట్టాలి? ఎక్కడి నుంచి తీసుకు రావాలని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు.

ఇవి కూడా చదవండి

నాకు డబ్బు కావాలి..

మరోవైపు సుభాష్ దగ్గరకు వచ్చిన రుద్రాణి.. దొంగ నాటకాలు ఆడుతూ.. డబ్బు కావాలి అని అడుగుతుంది. ఎంత కావాలి అని సుభాష్ అడిగితే.. రెండు లక్షలు అని రుద్రాణి అంటుంది. అంత డబ్బు ఎందుకు? అని సుభాష్ అడిగితే.. మరీ ముఖ్యం అయితే తప్ప అడగనని రుద్రాణి అంటుంది. ఇప్పుడు ఇంటి బాధ్యత అంతా కావ్యే చూసుకుంటుంది. వెళ్లి కావ్యని అడగమని సుభాష్ అంటాడు. నేను వెళ్లి కావ్యని అడగాలా అని రుద్రాణి అంటే.. సరైన కారణం చెప్పి కావ్యని అడిగి తీసుకోమని సుభాష్ అంటాడు. అప్పుడే రాహుల్ వచ్చి.. మావయ్య నేను చూసుకుంటానని చెప్తాడు. కావ్యకి ఎలాంటి కారణాలు చెప్పకుండా బెదిరించి డబ్బు తీసుకోవచ్చని రాహుల్ అంటాడు. ఇక రాహుల్ అన్నట్టుగానే వెళ్లి రుద్రాణి కావ్య దగ్గరకు వెళ్లి సైగలు చేస్తుంది. కానీ కావ్య పట్టించుకోదు. దీంతో ఏయ్ అని పిలుస్తుంది రుద్రాణి. నన్నేనా రుద్రాణి గారు అని కావ్య అడిగితే.. లేదు ఈ మొక్కల్ని అని రుద్రాణి అంటే.. సరే పిలిచికోమని కావ్య అంటుంది. ఏయ్ ఏంటి నేను పిలిచేది నిన్నే.. నాకు రెండు లక్షలు కావాలని రుద్రాణి అడిగితే.. కావ్య ఆలోచనలో పడి మీకు అంత అవసరం ఎందుకు? అని అడుగుతుంది.

కావ్యని బెదిరించి డబ్బులు తీసుకున్న ధాన్యలక్ష్మి, రుద్రాణి..

అవన్నీ నీకు అనవసరం.. నాకు డబ్బు కావాలి ఇవ్వు అని రుద్రాణి అంటే.. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి.. అన్నీ నీకు చెప్పాల్సిన పని లేదు. అయినా రుద్రాణి బయట మనిషా.. తనకి కూడా సొంత ఖర్చులు ఉంటాయి కదా.. ప్రతీదీ నీకు చెప్పి తీరాలా? ఎంతలో ఉండాలో నువ్వు అంతలోనే ఉండాలి. మేము డబ్బు అడిగితే.. ఎందుకు అని తిరిగి అడిగితే.. మమ్మల్ని అవమానించినట్టే.. వెళ్లి డబ్బు తీసుకురమ్మని ధాన్యలక్ష్మి అంటే.. సరే ఎందుకు ఖర్చు పెడుతున్నారో చెబితే నేను రాసుకుంటాను. రేపు డబ్బు ఏమైందని నన్ను అడిగితే నేను సమాధానం చెప్పాలి కదా అని కావ్య అంటే.. అలా ఎవరైనా అడిగితే మాకు ఇచ్చానని చెప్పు. అప్పుడు ఎందుకో వాళ్లకు మేము చెబుతాం. దీన్ని అడక్కూడదు రుద్రాణి.. ఆర్డర్ వేయాలని ధాన్యలక్ష్మి అంటుంది. దీంతో రుద్రాణి.. ధాన్యలక్ష్మిని తెగ పొగిడేస్తుంది. ఆ తర్వాత కావ్య డబ్బులు తీసుకొచ్చి రుద్రాణికి ఇస్తుంది.

రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న రాజ్..

ఆ తర్వాత రాజ్ క్యాబిన్‌లోకి శ్రుతి వచ్చి కొత్త ప్రాజెక్ట్ ఫైల్స్ మీద సంతకం పెట్టాలని అడిగితే.. రాజ్ కోప్పడతాడు. ఇది చాలా అర్జెంట్ సర్.. క్లయింట్స్‌కి పంపించాలని అంటుంది. ఇప్పుడు అంత అర్జెంట్‌గా పంపించకపోతే నష్టం ఏమీ రాదులే అని రాజ్ అరుస్తాడు. దీంతో శ్రుతి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాజ్ బ్యాంక్ వాళ్లు అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే సీతారామయ్య చెప్పిన మాటలు కూడా గుర్తుకు వస్తాయి. ఏం చేయాలో తెలియక రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రాజ్ దాని గురించి ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లిపోతాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..