Brahmamudi, August 12th Episode: రాజ్‌ని చూసి అత్తా కోడళ్ల నవ్వులు.. ఇంటికి రానన్న కళ్యాణ్..

|

Aug 12, 2024 | 1:10 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రా‌జ్‌కి బాగా ఆకలిగా ఉంటుంది. కావ్య వండిన భోజనం తినడం ఇష్టం లేక.. వేరే ఏమన్నా తినాలని అనుకుంటాడు. కానీ ఫ్రిడ్జ్‌లో తెరిచి చూస్తే ఏమీ ఉండవు. పాలు ఉంటే మరగబెడతాడు. అప్పుడు పాలు గ్లాసులో వేస్తుండగా గిన్నె చేయి జారి కింద పడి పోతుంది. అప్పుడే కావ్య ఎంట్రీ ఇస్తుంది. కాలిందా చేయి అని కావ్య అడుగుతుంది. నీకెందుకు అని రాజ్ అడుగుతాడు. వీధుల్లో పాచి పని చేసుకునే రాపాయమ్మని పిలవనా? అని కావ్య అంటే..

Brahmamudi, August 12th Episode: రాజ్‌ని చూసి అత్తా కోడళ్ల నవ్వులు.. ఇంటికి రానన్న కళ్యాణ్..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రా‌జ్‌కి బాగా ఆకలిగా ఉంటుంది. కావ్య వండిన భోజనం తినడం ఇష్టం లేక.. వేరే ఏమన్నా తినాలని అనుకుంటాడు. కానీ ఫ్రిడ్జ్‌లో తెరిచి చూస్తే ఏమీ ఉండవు. పాలు ఉంటే మరగబెడతాడు. అప్పుడు పాలు గ్లాసులో వేస్తుండగా గిన్నె చేయి జారి కింద పడి పోతుంది. అప్పుడే కావ్య ఎంట్రీ ఇస్తుంది. కాలిందా చేయి అని కావ్య అడుగుతుంది. నీకెందుకు అని రాజ్ అడుగుతాడు. వీధుల్లో పాచి పని చేసుకునే రాపాయమ్మని పిలవనా? అని కావ్య అంటే.. ఎందుకు అని రాజ్ అడుగుతాడు. నాకెందుకు అన్నారు కదా.. ఆవిడకు చెప్పుకుంటారని కావ్య అంటుంది. వెటకారంగా ఉందా? నీకెందుకు అని రాజ్ అంటే.. సరే ఉండండి ఆ రాపాయమ్మని పిలుస్తాను అని కావ్య అంటుంది. మధ్యలో ఆ రాపాయమ్మ ఎందుకు వస్తుందని రాజ్ అంటే.. మీరు అస్తమానూ నాకెందుకు.. నాకెందుకు అంటున్నారు కదా అందుకే.. సరే రండి భోజనం వడ్డిస్తాను అని కావ్య పిలుస్తుంది.

అమాయకపు రాజ్..

నీకు చెప్పాను కదా.. నువ్వు చేసిన భోజనం తినను అని.. అందుకే పని మనిషి శాంతతో వండించాను. ఆ విషయం చెబుదాము అంటే. అస్సలు చెప్పనివ్వ లేదని వడ్డిస్తుంది కావ్య. ఇంకా నువ్వు ఎందుకు వడ్డిస్తున్నావ్? నేనే వడ్డించుకుంటానని రాజ్ వడ్డించుకుని తింటూ ఉంటాడు. అప్పుడు అపర్ణ బయటకు వస్తుంది. ఏంటీ మొత్తానికి దిగి వచ్చాడా? అని అడుగుతుంది. హా దిగి వచ్చారు మెట్లు అని అంటుంది కావ్య. ఇందాక ఎవరో కావ్య చేతి వంట తినను అని వెళ్లిపోయారు. ఇప్పుడు చూస్తే రాక్షసుడిలా అర్థరాత్రి కూర్చుని తింటున్నారని అపర్ణ అంటుంది. హలో మమ్మీ ఇది నీ కోడలు చేసిన వంట కాదు. పని మనిషి శాంత చేసిన వంట. చాలా బావుంది మమ్మీ.. రేపటి నుంచి ఆ పని మనిషికి మెనూ ఇస్తాను. నా కోసం స్పెషల్‌గా వంట చేయమని ఆవురుమని తింటూ ఉంటాడు రాజ్.

అమ్మ నా కోడలా.. గడుసు దానివే..

నీ మీద నేను విజయం సాధించాను. మమ్మీ పని మనిషికి చెప్పు.. బాబు నీ వంటను లొట్టలేసుకుంటూ తిన్నాడని అంటాడు రాజ్. సరే రేపటి నుంచి శాంత వారం రోజుల పాటు సెలవు పెట్టింది. వచ్చాక చెప్తానని అపర్ణ అంటుంది. కావ్య పక్క నుంచి తెగ నవ్వుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి రాజ్ వెళ్లిపోతాడు. వాడు అసలే ఆకలిగి ఆగలేడు. చాలా తెలివిగా నువ్వు చేసిన వంటను శాంత చేసిన వంటగా చెప్పి భలే తినిపించావు అని అపర్ణ అంటుంది. ఇదే ట్రిక్‌ని మీ మీద కూడా ట్రై చేశాను అత్తయ్యా అని కావ్య అంటుంది. ఏంటీ.. అమ్మ నా కోడలా.. ఎంత గడుసు పిల్లవే అని అపర్ణ అంటుంది. ఆయనకు అన్నం విలువ తెలిసి రావాలని ఇలా చేశాను. కానీ మీరెందుకు తినిపించలేక పోయారని కావ్య అంటే.. నువ్వు ఉన్నావనే ధైర్యం ఉందని అపర్ణ అంటుంది. ఆయన కడుపు నిండింది.. ఇప్పుడు నా మనసు నిండిందని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య అక్కడి నుంచి వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

మళ్లీ మొదటికి వచ్చిన రాజ్..

కట్ చేస్తే.. రాజ్, కావ్యలు బెడ్‌ రూమ్‌లో పడుకుని ఉంటారు. ఒక్కసారిగా లేచిన రాజ్ కూర్చుని.. మా తమ్ముడిని పిలవమంటే పిలవలేదు. వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో.. నాకు నిద్ర పట్టడం లేదు. ఇది మాత్రం దున్నపోతులా నిద్ర పోతుందని రాజ్ అంటాడు. నేనేమీ నిద్ర పోలేదని కావ్య అంటుంది. ఇక మళ్లీ వీళ్లిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. వాడిని ఎందుకు పిలవలేదని రాజ్ అంటే.. అబ్బా ఇంకా ఎన్ని రోజులు, ఎన్నాళ్లు ఇలా నాన్ను సాధిస్తారు. అక్కడ అంతమంది ఉన్నారు.. అంత మంది ఆప లేనిది ఒక దున్నపోతు ఎలా ఆపుతుంది? అని కావ్య అంటుంది. నువ్వు పిలిస్తే వస్తాడని.. నువ్వు ఉండమంటే ఉంటాడని రాజ్ అంటాడు. నేను ఉండమంటే ఉంటాడు. రమ్మంటే వస్తాడు.. కానీ నన్ను ఈ ఇంట్లో ప్రశాంతంగా బ్రతకనిస్తారా? మన శాంతిగా అని.. మా ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఓ ఆట ఆడుకునేవారు.

అంతా మీరు చేసి.. నన్ను అంటారే?

తాళి చేతికి ఇచ్చి కట్టరా అన్నా.. మీ జోలికి ఎవరూ రారు. దూరం నుంచి చూసిన పాపానికే ఏకి పాకి పాకం పెడుతున్నారు. అదీ ఇదీ అంటూ ఇక కావ్య రెచ్చిపోతుంది. ఫోన్ చేసి రమ్మను చెప్పు.. అని రాజ్ ఫోన్ ఇస్తాడు. నేను చేయను అని కావ్య అంటుంది. దీంతో రాజ్.. కళ్యాణ్‌కి ఫోన్ చేస్తాడు. నా మాట వెంటాడని రాజ్ ధీమాగా ఉంటాడు. ఎక్కడ ఉన్నావురా? ఏదో ఆవేశంగా వెళ్లి పోయావు. నువ్వు సంతోషంగా ఉండాలని అప్పూని పెళ్లి చేసుకోమన్నా.. కానీ ఇలా ఇంట్లో నుంచి వెళ్లి పోతావని అనుకోలేదని రాజ్ అంటాడు. నాకు తెలుసు అన్నయ్యా.. నువ్వేం బాధ పడకు. ఒక ఫ్రెండ్ నాకు షెల్టర్ ఇచ్చాడు. నువ్వేం టెన్షన్ పడకని కళ్యాణ్ అంటాడు. ఇవన్నీ ఎందుకు? ఇంటికి తిరిగి వచ్చేయమని రాజ్ అంటే.. తిరిగి రావడం ఇష్టం లేకనే వెళ్లిపోయానని కళ్యాణ్ అంటాడు.

ఇంటికి రానన్న కళ్యాణ్..

అరేయ్ నీకు నేను ఉన్నాను కదరా.. నేను చూసుకుంటానని రాజ్ అంటే.. సంవత్సరం అయ్యింది వదినకు పెళ్లి అయి.. వదినను ఇంట్లో ఇప్పటికీ ఎలా చూస్తున్నారో తెలుసు. అప్పూని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టలేను. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నన్ను ఇబ్బంది పెట్టకు అన్నయ్యా ఉంటానని కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత కావ్య కావాలనే రాజ్‌ని ఆడుకుంటుంది. ఇప్పుడు అర్థం అయ్యింది కదా.. నేను దున్నపోతులా పడుకుంటానని కావ్య అంటుంది. ఇప్పుడు కాకపోయినా.. ఆ తర్వాత అయినా వస్తాడు.. తీసుకొస్తానని రాజ్ అంటాడు.

అప్పూ ఫ్రెండ్స్ తిప్పలు చూసి.. కళ్యాణ్ బాధ..

ఆ తర్వాత కళ్యాణ్ ఆలోచిస్తూ కిటికీ దగ్గర నిలబడతాడు. అప్పూ ఫ్రెండ్స్ బయట పడుకోవడం చూసి.. బాధ పడతాడు. మనం ఇక్కడ ఉంటే వాళ్లను ఇబ్బంది పెట్టిన వాళ్లం అవుతాం. రేపే మనం ఇక్కడి నుంచి వెళ్లాలి అని కళ్యాణ్ అంటే.. ఎక్కడికి వెళ్తాము? చేతిలో డబ్బు లేదు. నేను ఎక్కడైనా ఉంటాను. కానీ నువ్వు ఎలా ఉంటావో అని అప్పూ అంటుంది. ఇప్పుడు అంటే సరే. ఆ తర్వాత అయినా వీళ్లకు కష్టమే కదా.. వీళ్లను ఇక ఇబ్బంది పెట్టలేము. ఏదో ఒకటి చేసి బయటకు వెళ్దామని కళ్యాణ్ అంటాడు. ఇక తెల్లవారుతుంది.. అప్పూ ఫ్రెండ్స్ కూడా లేస్తారు. మనం ఫ్రెండ్ రూమ్ నుంచి వచ్చామని అబద్ధం చెబుదామని అనుకుని డోర్ కొడతారు.

బయటకు వెళ్లిపోతున్న కళ్యాణ్, అప్పూలు..

కళ్యాణ్ డోర్ తీసి.. రండి మీ కోసమే ఎదురు చూస్తున్నా.. ఏంటి? రాత్రి ఇంటికి రాలేదని? అడుగుతాడు. సినిమా చూడటం లేట్ అయింది. అందుకే ఫ్రెండ్ రూమ్‌లో పడుకున్నామని చెబుతారు అప్పూ ఫ్రెండ్స్. మీ కోసమే చూస్తున్నాం.. మేము వెళ్తున్నామని అప్పూ అంటుంది. అదేంటి? ఎక్కడికి అని అప్పూ ఫ్రెండ్స్ అడుగుతారు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.