
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌కి శ్వేత కాల్ చేస్తుంది. ఏంటి అత్తారింటికి వెళ్లాక నన్ను మర్చిపోయావా అని శ్వేత అంటే.. అంత లేదు ఇక్కడ వీళ్లు నాకు నరకం చూపిస్తున్నారు అని రాజ్ అంటాడు. మరి ఎందుకు అంత కష్టపడి అక్కడ ఉండటం దేనికి అని శ్వేత అంటే.. వచ్చేయాలనే అనుకున్నా.. కానీ వీళ్లు నన్ను వదిలి పెట్టడం లేదు. వెళ్లొద్దు అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. రాజ్ కవర్ చేస్తాడు. అంత బాగా చూసుకుంటుంటే.. నరకం అంటున్నావేంటి? అని శ్వేత అంటే.. ఆ బావ తల నొప్పి ఉన్నాడు కదా అందుకే అని నసుగుతూ అంటాడు రాజ్. అర్థమైంది.. వాళ్లు నిన్ను పిలవలేదు. జెలసీతో నువ్వే అక్కడికి వెళ్లావ్.. అని శ్వేత అంటుంది. హలో ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావ్? అని రాజ్ అంటే.. ఒకప్పటి రాజ్ ఇలా మాట్లాడొచ్చు.. కానీ మారిపోయిన రాజ్ ఇలా మాట్లాడకూడదు.
రెస్టారెంట్‌లో నిన్ను చూశాను రాజ్.. కావ్యకు తన బావ ఎక్కడ ప్రపోజ్ చేస్తాడో అని కంగారు పడిపోయావ్.. ఇప్పుడు కావ్య తన పుట్టింటికి వెళ్తే.. నువ్వు కూడా వెళ్లిపోయావ్ అని అంటుంది శ్వేత. అంత లేదు అని రాజ్ అంటాడు. లేదు రాజ్.. నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వు ఇగోతో కావ్యని వదిలేద్దాం అనుకుంటున్నావ్.. కానీ తన మీద నీ మనసులో చాలా ప్రేమ ఉందని శ్వేత అంటుంటే.. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.. తన మీద నాకు ఎప్పటికీ ఒకటే ఫీలింగ్.. తను నా లైఫ్ లోనుంచి వెళ్లిపోతుంది అంతే అని రాజ్ అంటాడు. అలా అనుకుంటే పర్వాలేదు కానీ.. అబద్ధం అయితేనే అసలు సమస్య అని శ్వేత అంటుంది. దీంతో రాజ్ మౌనంగా ఉండిపోతాడు. సరే కానీ.. అసలు కావ్య బావ ఎందుకు వచ్చాడు? కావ్య నీతో విడిపోతున్నట్లు తెలుసుకుని వచ్చాడా? లేక గతంలో ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వచ్చాడా? అది ఎందుకో నువ్వే తేల్చుకో. కావ్య లాంటి మంచి అమ్మాయి ఒక్కాసారి వెళ్లిపోతే మళ్లీ రాదు అని శ్వేత చెప్తుంది. శ్వేత మాటలతో ఆలోచనలో పడతాడు రాజ్.
మరోవైపు బయట కావ్య, భాస్కర్, అప్పూ, కృష్ణమూర్తిలు అంతా చలి మంట వేసి కూర్చుంటారు. అల్లుడు గారు ఎక్కడమ్మా అని కృష్ణ మూర్తి అడిగితే.. కావాలనే లోపల ఆ శ్వేతతో ఫోన్ మాట్లాడుతున్నారు నాన్నా అని కావ్య అంటుంది. కావ్య జీవితం నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు అని భాస్కర్‌కి చెప్తాడు కృష్ణ మూర్తి.
మరోవైపు కళ్యాణ్ ఇంటికి వస్తాడు. ఏమైందిరా అని ప్రకాశం అడుగుతాడు. ఇదేమన్నా సినిమానా వెంటనే అవడానికి.. మెల్లగా ప్రయత్నిస్తా అని కళ్యాణ్ అంటే.. నీ లైఫ్ అంతా ట్రై చేసినా.. ఆ టైమ్ ఎప్పటికీ రాదు కళ్యాణ్ అని అనామిక అంటుంది. ఏంటమ్మా అలా అనుకుంటున్నావ్.. ఇలా హేళన చేయకూడదని ప్రకాష్ అంటాడు. ఆ విషయం నాకు తెలుసు అంకుల్. కానీ మీ అబ్బాయి మాత్రం ఇంకా కవితలు.. పద్యాల దగ్గరే ఆగిపోయారు అని అనామిక అంటుంది. చాలా థాంక్స్ బాగా అర్థం చేసుకున్నావ్ అని కళ్యాణ్ అంటాడు. ఇలా అనామిక, కళ్యాణ్‌ల పంచాయితీ సాగుతుంది.
ఇంతలో రాజ్ వస్తాడు. అల్లుడు గారు వస్తున్నారు.. డ్రామా మొదలు పెడదాం అని కనకం అంటుంది. దీంతో కావాలనే కావ్య, భాస్కర్‌లు నవ్వుతూ ఉంటారు. అది చూసి రాజ్ లోలోపల రగిలిపోతూ ఉంటాడు. స్కూల్ పిల్లల్లా భలే నవ్వుకుంటున్నారు కదండీ.. అని కనకం అంటుంది. ఎంతైనా మన అల్లుడు చిన్నప్పటి జ్ఞాపకాలు మర్చిపోలేదని కృష్ణ మూర్తి అంటాడు. మన అల్లుడు కాదు.. మేనల్లుడు అని గట్టిగా అరుస్తాడు రాజ్. దీంతో ఒక్కసారి షాక్ అయిన కృష్ణ మూర్తి.. అయ్యయ్యో ఏదో పొరపాటు అయిపోయింది బాబూ అని అంటాడవు. ఈ లోపు బావా, కావ్యలను డ్యాన్స్ చేయమని అప్పూ అంటుంది. దీంతో కావ్య, భాస్కర్‌లు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే అవుతుంది వాళ్లను చూస్తూ రాజ్.. ఉడుక్కుంటాడు. ఇలా డ్యాన్స్ చేస్తూ ఉండగా.. కావ్య కాలు నిప్పుపై పడబొతుంది. వెంటనే రాజ్ వెళ్లి చేతితో నిప్పు తీసేస్తాడు. మరోవైపు భాస్కర్ కాలికి కూడా కాలుతుంది. రాజ్ ప్రేమ బయట పడుతూ ఉండటంతో భాస్కర్ సంతోషిస్తాడు.
ఇక తెల్లారుతుంది. స్వప్న బయటకు వచ్చి.. ఫోన్ చూస్తే రూ.50 వేలు క్రెడిట్ కార్డ్ బిల్ వస్తుంది. దీంతో అత్తని అడగటానికి వస్తుంది. అప్పటికే రాహుల్.. రుద్రాణిని డబ్బులు అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత నా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి.. రూ.50 వేలు ఇవ్వమని అడిగితే.. నా దగ్గర లేవు అని రుద్రాణి అంటుంది. మరోవైపు రాజ్‌కి వెళ్లి కాపీ ఇస్తుంది కావ్య. అప్పుడే భాస్కర్ బయట నుంచి వస్తాడు. బావను చూసి కనకం గట్టిగా అరుస్తుంది. దానికి అందరూ షాక్ అవుతాడు. అప్పుడు రాజ్ ఓ సీన్ గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇక్కడో సీన్ నిజంగానే నవ్వులు పుట్టిస్తుంది. ఇప్పుడు ఇంట్లోని అందరికీ క్లాస్ పీకుతాడు రాజ్. అసలు నువ్వు ఎందుకు బయటకు వచ్చావ్ బావా అని అప్పూ అంటే.. స్నానమే కదా.. నేను చేయిస్తాను అని కావ్య అంటే.. నో అని గట్టిగా అరుస్తాడు రాజ్. స్నానమే కదా నేను చేయిస్తాను అని తీసుకెళ్తాడు రాజ్. భాస్కర్ బరువును మోయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇలా ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.