Brahmamudi, March 1st episode: కవి అయ్యే ప్రయత్నంలో కళ్యాణ్.. ఇందిరా దేవి మాస్టర్ ప్లాన్!

|

Mar 01, 2024 | 1:02 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌కి ఒక బ్రాంచ్ అప్పగించి చూసుకోమని అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తాడు రాజ్. కానీ కళ్యాణ్ నాకు నచ్చని పని చేయను. అయినా నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా అన్నయ్యా అని అంటాడు కళ్యాణ్. కవితలతో పాటు ఈ పని కూడా చేయవచ్చు కవి గారూ అని కావ్య అంటుంది. అందేంటి వదినా.. మీరే కదా.. మనసుకు నచ్చిన పని చేయమన్నారు. మళ్లీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? అని కళ్యాణ్ అంటే.. అవును నిజమే.. కానీ మీ కాపురం కోసం ఇది..

Brahmamudi, March 1st episode: కవి అయ్యే ప్రయత్నంలో కళ్యాణ్.. ఇందిరా దేవి మాస్టర్ ప్లాన్!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌కి ఒక బ్రాంచ్ అప్పగించి చూసుకోమని అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తాడు రాజ్. కానీ కళ్యాణ్ నాకు నచ్చని పని చేయను. అయినా నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా అన్నయ్యా అని అంటాడు కళ్యాణ్. కవితలతో పాటు ఈ పని కూడా చేయవచ్చు కవి గారూ అని కావ్య అంటుంది. అందేంటి వదినా.. మీరే కదా.. మనసుకు నచ్చిన పని చేయమన్నారు. మళ్లీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? అని కళ్యాణ్ అంటే.. అవును నిజమే.. కానీ మీ కాపురం కోసం ఇది కూడా చేయవచ్చు అని కావ్య అంటుంది. ఇక నేను నటించింది చాలు. ఇక నేను అలసిపోయాను. ఈ రోజు నుంచి నాకు నచ్చిన పనే చేస్తాను అని కళ్యాణ్ అంటే.. అంటే ఏంటి నీ ఉద్దేశం.. ఏం చేయబోతున్నావ్.. అంటే నన్ను బాధ పెట్టాలి అనుకుంటున్నారా అని అనామిక అంటే.. నువ్వు నా మనసును ముక్కల్ని చేసేశావ్ అని కళ్యాణ్ అంటాడు.

కళ్యాణ్‌కు సపోర్ట్‌గా నిలిచిన ప్రకాశం..

శభాష్‌ రా.. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావ్‌రా.. నీకు నేను సపోర్ట్ చేస్తాను అని ప్రకాష్ అంటాడు. అదేంటి బాబాయ్ నువ్వు కూడా అని రాజ్ అంటే.. అవును రాజ్ అందరూ ఏదో అంటున్నారని.. నీ తమ్ముడిని దారిలో పెట్టాలి అని చూస్తున్నావ్ అది కరెక్ట్ కాదు. కానీ మీ పిన్ని బాధ పడుతుందని ఇలా చేస్తున్నావ్.. వద్దు రాజ్ నువ్వు నీలానే ఉండు. రాముడికి లక్షణుడి మీద ఉన్న ప్రేమను రామాయణంలో రాముడు ఎక్కడా నిరూపించుకోవాలేదు. కానీ అన్నదమ్ములు అంటే వాళ్లలా ఉండాలి అని చెబుతారు. మీరిద్దరు కూడా అలానే ఉండాలి అని ప్రకాష్ అంటాడు. మీ పిన్ని గురించి వదిలేసేయ్.. నేను చూసుకుంటాను. కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ అని సుభాష్ అడుగుతాడు. నా కవితల్ని.. ఎవరైనా పబ్లిష్ చేస్తారేమో అని వెళ్తున్నా అని కళ్యాణ్ అంటాడు. అంటే నువ్వు పెద్ద కవి అయిపోదాం అనుకుంటున్నావా అని అనామిక అంటుంది. రేయ్ వేరే ఎవరి దగ్గరకో ఎందుకురా.. నేనే ఆ కవితల్ని పబ్లిష్ చేయిస్తాను అని రాజ్ అంటాడు. నా టాలెంట్‌తో నేను రైటర్ అవ్వాలి కానీ.. డబ్బు ఉంది కదా అని కాదు అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత అందరూ ఆల్ ది బెస్ట్ అని చెప్తారు.

కవి ప్రయత్నంలో కళ్యాణ్..

కళ్యాణ్ రాసిన కవితల్ని.. ఓ పబ్లిషర్ దగ్గరకు తీసుకెళ్తాడు. అతను ఆ కవితల్ని చదివి.. బావున్నాయి అని అంటాడు. అయితే పబ్లిష్ చేస్తారా అని కళ్యాణ్ అడుగుతాడు. కవితలు బావున్నాయి అన్నాను కానీ.. పబ్లిష్ చేస్తాను అని చెప్పలేదు కదా.. ఈ రోజుల్లో కవితల్ని ఎవరూ చదవరు అని చెప్తాడు పబ్లిషర్ చెప్తాడు. దీంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. కానీ మీ రైటింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది.. కాబట్టి ఓ లవ్ స్టోరీ ఏమన్నా రాయండి అని పబ్లిషర్ అంటాడు. నేను కవితల్ని రాయడం సర్.. కథలు రాయడం ఇష్టం లేదు.. నాకు నచ్చని పని చేయమంటేనే.. ఇంట్లో వాళ్లను కూడా ఎదురించి వచ్చాను. నా కవితల్ని ఇష్ట పడే పబ్లిషర్ ఎవరో ఒకరు దొరుకుతారు. తప్పకుండా వెతుకుతాను అని కళ్యాణ్ వెళ్తాడు. ఈ లోపు కళ్యాణ్ గురించి తలుచుకుని బాధ పడుతూ ఉంటాడు రాజ్. ఏంటి ఆయన అంతలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు బావా అని కావ్య అంటే.. నిన్ను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు అని భాస్కర్ అంటాడు. నా గురించి కాదు బావా.. నిన్ను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నారు అని కావ్య అంటుంది. ఇప్పుడు పాస్ పోర్ట్ ఫిలప్ చేయమని అంటే ఏం చేస్తారో అని కావ్య అంటే.. ఏం చేస్తాడు.. అదిరి పడి.. ఆ పేపర్స్‌ని చింపి పడేస్తాడు అని భాస్కర్ అంటాడు.

ఇవి కూడా చదవండి

కావ్యకు షాక్ ఇచ్చిన రాజ్..

వెంటనే రాజ్ దగ్గరకు వెళ్లిన కావ్య.. పాస్ పోర్ట్ పేపర్స్ చూపించి.. ఫిల్ చేయమంటుంది. కానీ రాజ్ అసలు ఏమీ పట్టనట్టుగా ఉంటాడు. నాకు ఫిల్ చేయడం రాదు అని చెప్తే.. సరే ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు మేనేజర్‌కి ఇస్తాను ఫిల్ చేసేయవచ్చు అని అంటాడు. ఎందుకు అలా ఉన్నారు అని కావ్య అంటే.. ఈ ఇంట్లో అందరూ స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెట్టారు. నీ స్వతంత్రాన్ని ఎందుకు ఆలోచించాలి అని రాజ్ అని వెళ్లిపోతాడు. దీంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు.

కళ్యాణ్‌కు సపోర్టుగా నిలిచిన అప్పూ..

ఈలోపు కళ్యాణ్ వెళ్తూ ఉంటాడు.. కొబ్బరి బొండాల దగ్గర ఆగి తాగుతాడు. తాగిన తర్వాత స్కానర్ ఎక్కడ అని అడుగుతాడు. లేదు సర్.. డబ్బులు ఇవ్వండి అని చెప్తాడు. అందేంటి స్కానర్ లేదా.. నా దగ్గర డబ్బులు లేవు అని కళ్యాణ్ అంటాడు. డబ్బులు లేకుండా ఎలా తాగారు.. నా డబ్బులు నాకు ఇవ్వండి అని బోండాల అతను అంటే.. అప్పుడే అప్పూ ఇచ్చి ఇస్తుంది. ఇక అప్పూకి జరిగిన స్టోరీ అంతా చెప్తాడు కళ్యాణ్. దీంతో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి రోడ్డు ఎక్కావ్ అన్నమాట అని అప్పూ అంటే.. అనామికను బాధ పెట్టిన సంగతి ఒకవైపు.. అంతే కాకుండా నన్ను అర్థం చేసుకోవడం లేదని మరోవైపు బాధగా ఉందని కళ్యాణ్ అంటాడు. దానికి ఎంతుకు అంత బాధ పడుతున్నావ్.. ప్రయత్నం మొదలు పెట్టావ్ కదా.. ఆ తర్వాత తనే నిన్ను అర్థం చేసుకుంటుందని అప్పూ అంటే.. నువ్వు కూడా నన్ను ప్రేమించావ్ కదా అప్పూ.. కానీ నువ్వు ఎప్పుడూ అలా ఎందుకు అనుకోలేదు. సరేలే నువ్వేం చేస్తున్నావ్ అని అంటే.. నేను పోలీస్ అవ్వడానికి ట్రై చేస్తున్నా.. అని అంటుంది. వావ్ సూపర్.. కంగ్రాట్స్ బ్రో.. నువ్వు తప్పకుండా సాధిస్తావ్.. నాకు ఆ నమ్మకం ఉంది అంటాడు కళ్యాణ్.

ఇందిరా దేవి మాస్టర్ ప్లాన్..

ఈ సీన్ కట్ చేస్తే.. పెద్దావిడ, కావ్యా, భాస్కర్ మీటింగ్ పెడతారు. ఇందాక పాస్ పోర్టు గురించి మాట్లాడితే.. అసలు ఏమీ పట్టించు కోవడం లేదని కావ్య అంటుంది. అమెరికా వెళ్లడానికి.. మా బావ రమ్మన్నాడు అని చెప్పావా అని ఇందిరా దేవి అడిగితే.. లేదని కావ్య అంటుంది. అందుకే వాడు పట్టించుకోలేదని పెద్దావిడ అంటుంది. ఇంట్లో జరుగుతున్న డిస్టెబెన్స్ వల్ల అలా ఉంటున్నాడు అనుకుంట బుజ్జీ అని భాస్కర్ అంటాడు. ఉంటున్నాడు కాదు.. కళ్యాణ్ లైఫ్ వల్ల డిస్టెబెన్స్ అవుతున్నాడు. వాడు ఇక్కడ ఉంటే ఇలానే ఉంటాడు. వాటి గురించి ఆలోచిస్తూ.. మీ గురించి పట్టించుకోవడం ఆపేస్తాడు. కాబట్టి వాడిని బయటకు ఎక్కడికైనా తీసుకెళ్లాలి అని ప్లాన్ చేస్తారు. అప్పుడే వాళ్లకు ఓ ఐడియా వస్తుంది. ఇక ప్లాన్‌ను అమలు పరుస్తారు కావ్య, బావ, ఇందిరా దేవిలు.

బిత్తరపోయిన రాజ్.. కావ్య, రాజ్‌ల ప్లాన్ సూపర్..

రాజ్ ఇక హాలులో కూర్చంటాడు. అప్పుడే కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక భాస్కర్, కావ్యలు డ్రామా మొదలు పెట్టారు. మీకు వారం రోజులకు సరిపడా బట్టలు అన్నీ సర్దేశాను అని చెప్తుంది. ఏంటి విషయం అని రాజ్ అంటే.. మా అమ్మ ఇంటికి రమ్మందని అంటుంది. ఇలాంటి శుభవార్త ఇప్పుడా చెప్పడం.. నా గురించి నువ్వేం బాధ పడకు. నేను చాలా ప్రశాంతంగా ఉంటాను అని రాజ్ అంటే.. చూశావా నేనే గెలిచాను బుజ్జీ అని అంటాడు భాస్కర్. ఏంటి అని రాజ్ అంటాడు. కనకం అత్త.. కావ్యని రమ్మని చెప్తే.. మీరు పంపించరని చెప్పింది. కాదు మా అన్నయ్య అంత కర్కోటకుడు కాదు పంపిస్తాడు అని చెప్పాను. రాజ్ లోలోపల సంతోష పడతాడు. ఈలోపు కావ్య, భాస్కర్‌లు బ్యాగులు సర్దుకోమంటారు. ఎందుకు అని రాజ్ అంటే.. మా బావని తీసుకోమని రమ్మని మా అమ్మ చెప్పింది అందుకే వెళ్తున్నాం అని కావ్య అంటుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.