
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అనామిక అన్న మాటలకు అపర్ణ కోపంగా ఉంటుంది. అప్పుడే సుభాష్ వచ్చి.. అనామిక అన్నా మాటలకు బాధ పడుతున్నావా.. తనేదో చిన్న పిల్ల దానికి నువ్వు ఇలా మాట్లాడితే ఎలా అపర్ణా అని సుభాస్ అంటాడు. బాధ పడకుండా ఏం చేయమంటారు? సంతోషంగా తల ఎత్తుకుంటూ తిరగమంటారా? ఒకప్పుడు నా మాటకు ఎదురు చెప్పేవారు కాదు. ధాన్య లక్ష్మి నాతో మాట్లాడాలి అన్నా ఆగి ఆలోచించేది. అలాంటిది తన కోడలు నా వైపు వేలు ఎత్తి చూపే విధంగా నా స్థాయిని దిగ జార్చేశారు. దీనికి కారణం ఎవరు మీరు కాదా? అని అపర్ణ అంటే.. తప్పు చేశానని ఒప్పుకుంటున్నా కదా.. ఇంకా ఎన్ని రోజులు నాకు శిక్ష వేస్తావు? అని సుభాష్ అంటే.. మీరు వదిలేసినంత మాత్రాన ఇంట్లో వాళ్లు ఊరుకుంటారు. అవకాశం దొరికిన ప్రతీ సారి వేలెత్తి చూపిస్తూనే ఉంటారు. కళ్యాణ్ ఏ తప్పూ చేయాలేదని అందరి ముందూ చెప్పాలి అనుకున్నా.. కానీ మీరు నాకు ఆ అవకాశం లేకుండా చేసేశారు. నా చేతులతో ఎత్తుకుని పెంచాను. వాడి క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. మాట్లాడితే.. ఆ వేలుతో నన్నే చూపిస్తారు అని అంటారు. మీతో పాటే నన్ను కూడా నిందిస్తారని అపర్ణ అంటుంది.
మరోవైపు రాజ్ సీరియస్‌గా కావ్యపై విరుచుకు పడతాడు రాజ్. ఈలోపు కావ్య రాజ్‌ని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. మాయ మాయ అంటూ తిరిగి లంకకు నిప్పు ఎట్టినట్టు.. నా ఇంటికి నిప్పు పెట్టావ్ కదే అని రాజ్ అంటూ ఉంటాడు. కానీ కావ్య రొమాంటిక్‌గా మాట్లాడుతూ.. టాపిక్ డైవర్ట్ చేస్తుంది. కౌగిలోకి రండి.. అని రాజ్‌ని శృంగారంలోకి లాగుతుంది. ఓసేయ్ నేనేం మాట్లాడున్నా.. నువ్వేం చేస్తున్నావ్. అంతా నీ వల్లే జరిగిందని రాజ్ అంటూ చిరాకు పడతాడు. నేను చాలా మంచి దాన్ని, నేను ఎవరికీ ద్రోహం చేయను అండి. అన్నీ నా వల్లేనా? అని బుంగ మూతి పెట్టుకుని ఇంకా ఎన్ని రోజులు నన్ను దూరం పెడతారండి అని రాజ్‌ని మూడ్‌లోకి లాగుతుంది కావ్య. రాజ్ కూడా కావ్య డైరెక్షన్‌లోకి వెళ్తాడు.
రాజ్ కూడా క్యూట్‌గా స్వీట్‌గా మాట్లాడుతూ ఒక్కసారిగా ఉలిక్కి పడి.. నువ్వు మాయ గురించి వెతకడం ఆపు అని రాజ్ అంటుంది. నేను ఆపను.. ఎందుకంటే మాయ నాకు ఓ వీడియో పంపించిందని.. అందులో నిజం అంతా చెప్పిందని రాజ్‌తో కావ్య చెబుతుంది. మరి ఈ నిజం బయట చెప్పొచ్చు కదా అని రాజ్ అంటే.. చెప్పే దాన్నే కానీ ఆ రౌడీలు నా ఫోన్ లాక్కుని వెళ్లిపోయారు. ఇప్పుడు సాక్ష్యం లేకుండా ఎలా చెప్పును అని కావ్య అడుగుతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అని రాజ్ అడుగుతాడు. మాయని మనం వెతికించి.. ఇంటికి తీసుకొచ్చి.. నిజం చెప్పించాలని కావ్య అంటుంది. సరే మనం వెళ్లి మాయని వెతికి తీసుకొచ్చి.. మా అమ్మానాన్నలను కలుపుదామని రాజ్ అంటాడు. ఏవండీ మరి ఇంత మంచి ఐడియా ఇచ్చాను కదా.. మరి నాకేం లేదా? అని కావ్య అడిగితే.. ఎప్పుడు చూడు అదే గోల అని సీరియస్‌గా వెళ్లిపోతాడు రాజ్. ఒక ముద్దూ లేదు. ఒక ముచ్చటా లేదు ఏం మనిషో అని కావ్య తిట్టుకుంటుంది.
ఆ తర్వాత కళ్యాణ్, అప్పూలను విడగొట్టినందుకు అనామికను పొగుడుతుంది రుద్రాణి. ఇది నా ఒక్క దాని వల్లనే కాలేదు కదా ఆంటీ. మీ సహాయం కూడా ఉది కదా.. వాళ్లు అక్కడికి వెళ్తున్నారని చెప్తే తెలిసేది కాదు కదా అని అనామిక అంటే.. ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తారు. కానీ వాళ్ల మీద నిందలు వేసి.. మీడియాని పిలిచి ఇంత రచ్చ చేసే ధైర్యం ఉండాలి కదా అని రుద్రాణి అంటుంది. లేకపోతే నా ముందే నా మొగుడితో ఫ్రెండ్ షిప్ చేస్తే నాకు మండదా… అందుకే చేయని తప్పును చేశారని అందరిముందూ నిరూపించా అని అనామిక అంటుంది. అనామిక నువ్వు ఏమైనా చెయ్యి కానీ.. కళ్యాణ్‌తో మాత్రం మంచిగానే ఉండమని రుద్రాణి అంటే.. వీళ్లను బెదిరిస్తేనే మన కంట్రోల్‌లోకి వస్తారని అనామిక అంటుంది.
ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుంది కనకం. ఇంకోసారి ఇళ్లు కదిలి బయటకు వెళ్లావంటే కాళ్లు ఇరగొడతాను అని వార్నింగ్ ఇస్తుంది. ఏంటమ్మా ఇది వాళ్ల మీద కోపం నా మీద చూపిస్తావేంటి? అని అప్పూ అంటే.. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావ్ ఏంటే.. నిన్నూ అని కొట్టడానికి కనకం చేయి ఎత్తుతుంది. కనకం దాన్ని చంపేస్తావా ఏంటి? అదేం చేసిందని కృష్ణ మూర్తి అంటాడు. నువ్వు మాట్లాడకయ్యా.. ఇదంతా నీ వల్లే. నా కూతురు ఏం తప్పు చేయలేనప్పుడు ఎందుకు తగ్గాలి అని పంపించావ్.. చూడు ఇప్పుడు ఏమయ్యిందో.. ఈ డబ్బు ఉన్నవాళ్లు అందరూ ఇంతే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఎంత గొడవ జరిగినా పోయేది ఏమీ లేదు. కానీ నా కూతురు నష్ట పోతుందని కనకం బాధ పడుతుంది.
ఆ నెక్ట్స్.. కళ్యాణ్ గదిలోకి వస్తాడు. కళ్యాణ్ నీకోసమే వెయిట్ చేస్తున్నా అని పిలుస్తుంది అనామిక. ఏంటి ఇంకా ఏమైనా మిగిలిపోయిందా అని కళ్యాణ్ అంటాడు. నీతో నేనే మాట్లాడాలి అనుకుంటున్నా అని అనామిక అంటే.. నేనే నీతో మాట్లాడాలి అనుకోవడం లేదని కళ్యాణ్ అంటాడు. ఇలా మాట్లాడే ఇంత వరకూ తీసుకొచ్చావ్. చూడు కళ్యాణ్ అన్నీ మర్చిపోయి ఇక నుంచి హ్యాపీగా ఉందామని అనామిక అంటే.. గాయం చేసి ఇప్పుడు మర్చిపొమ్మని అంటున్నావా.. తప్పు చేయకపోయినా చేశావు అని నిందిస్తున్నావ్. నువ్వు అనుకున్నది నిజం కాదని నిరూపిస్తా. నేనూ అప్పూ ఆ హోటల్‌కి వెళ్తున్నాం అన్న విషయం మాకు తప్ప ఎవరికీ తెలీదు. కానీ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా మీడియా వాళ్లు ఎలా అక్కడికి వచ్చారు? అదే సమయానికి మేము వెళ్లిన గదికి తలుపు ఎవరు వేశారు? మళ్లీ ఎవరు తీశారు? ఇదంతా కావాలనే మిమ్మల్ని ఇరికించాలని చేశారు. వాళ్లను బయటకు లాగుతానని అంటాడు కళ్యాణ్. దీంతో అనామిక కంగారు పడుతుంది.
ఆ తర్వాత కావ్య, రాజ్‌లు మాయ కోసం వెతుకుతూ ఉంటారు. పోలీస్ కమిషనర్‌ని కలిసి ఈ విషయం గురించి చెప్తాం. అక్కడ నువ్వు తిక్కతిక్కగా మాట్లాడకు అని రాజ్ చెప్తాడు. ఆ మాయని ఈ రోజు ఎలాగైనా పట్టుకోవాలి అని ఇద్దరూ అనుకుంటారు. ఈలోపు మాయ తప్పించుకుందని రుద్రాణికి ఫోన్ వస్తుంది. ఏదో ఒకటి చేసి దాన్ని పట్టుకొమ్మని చెప్తుంది రుద్రాణి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో మాయని వెతికి పట్టుకుంటారు రాజ్, కావ్యలు. ఇంటికి తీసుకొస్తారు. కానీ అక్కడ మాయ ఏం చెప్పిందో అన్నది సస్పెన్స్‌గా మారుతుంది. మళ్లీ రాజ్, కావ్యలు ఇరుక్కుంటారా లేక బయట పడతారో లేదో చూడాలి.