Brahmamudi, June 20th Episode: ఇంట్లో అనామిక పంచాయతీ.. రఫ్ఫాడించిన కనకం.. దొరికేసిన మాయ!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. హోటల్‌లో అప్పూ, కళ్యాణ్‌లు దొరకడంతో ఇంట్లో పంచాయితీ మొదలవుతుంది. ఇప్పుడు చెప్పండి.. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ బాగోతం? ఎప్పటి నుంచి ఇలా రహస్యంగా కలుసుకుంటున్నారు? ఇంట్లో ఉన్న భార్యని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది స్నేహమా? ప్రేమా? ఇంకా ఏదన్నా ఉందా? దీనికి ఏం పేరు పెట్టాలి? వీళ్లిద్దరూ హోటల్‌ ముందు మీడియాకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆ దృశ్యానికి మా అత్తయ్యగారే..

Brahmamudi, June 20th Episode: ఇంట్లో అనామిక పంచాయతీ.. రఫ్ఫాడించిన కనకం.. దొరికేసిన మాయ!
Brahmamudi

Updated on: Jun 20, 2024 | 12:54 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. హోటల్‌లో అప్పూ, కళ్యాణ్‌లు దొరకడంతో ఇంట్లో పంచాయితీ మొదలవుతుంది. ఇప్పుడు చెప్పండి.. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ బాగోతం? ఎప్పటి నుంచి ఇలా రహస్యంగా కలుసుకుంటున్నారు? ఇంట్లో ఉన్న భార్యని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది స్నేహమా? ప్రేమా? ఇంకా ఏదన్నా ఉందా? దీనికి ఏం పేరు పెట్టాలి? వీళ్లిద్దరూ హోటల్‌ ముందు మీడియాకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆ దృశ్యానికి మా అత్తయ్యగారే ప్రత్యక్ష సాక్ష్యం. ఇందులో నేను కల్పించి చెప్పింది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా కాపురాన్ని నిలబెట్టమని ఈ ఇంటి పెద్దరికాన్ని, నా భర్త కాళ్లు పట్టుకుని వేడుకోవాలా? నా కాపురంలో చిచ్చు పెట్టొద్దని ఈ అప్పూ చేతులు పట్టుకుని బ్రతిమలాడుకోవాలా? చెప్పండి నన్ను ఏం చేయమంటారు? అని పెద్ద రాద్దాంతం చేస్తుంది అనామిక.

ఎన్నాళ్ల నుంచి సాగుతుంది ఇది..

ఎందుకు రా ఇలాంటి పని చేశావ్? ఎన్నాళ్ల నుంచి ఇలా కలుసుకుంటున్నారు? ఇంతగా బరి తెగించి ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అని ధాన్య లక్ష్మి అంటే.. ధాన్య లక్ష్మి తొందర పడకు మన పెంపకాన్ని నమ్మకపోతే బిడ్డలు ఎలా నలిగి పోతారో నీకు తెలీదు. నాకు తెలుసు… నా కొడుకుకూడా ఇలాంటి స్థితిలో ఇలా నిలబడ్డప్పుడు ఇలానే ఆవేశ పడ్డాను . అందుకే ఇప్పుడు బాధ పడుతున్నా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆవేశ పడి నిందలు వేయకు. అసలు ఏం జరిగిందో ఆ పిల్లల్ని అడుగు. ధాన్యం.. మన కళ్యాణ్ అలాంటి వాడు కాదు.. ఇలా ప్రవర్తించడు ఏదో జరిగిందని ప్రకాశం అంటే.. మా అప్పూ కూడా అలాంటిది కాదు.. ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. స్నేహం చేస్తే ప్రాణం అయినా ఇస్తుంది. తప్పు చేయకపోతే ఎవ్వరికీ తలవంచింది. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామని స్వప్న అంటుంది.

నీ పుట్టింటి గురించి బటయ పెట్టనా..

నువ్వు మధ్యలో తల దూర్చకు.. నువ్వు, ఈ కావ్య ఎలా ఈ ఇంటికి కోడళ్లు అయ్యారో.. అప్పూని కూడా నా భర్తకు కట్టబెట్టాలని మీ అమ్మ ఎన్ని పన్నాగాలు పన్నిందో అన్నీ తెలుసని అనామిక అంటే.. చాలా తెలుసు నీకు. మరి నువ్వు మాత్రం ఏమన్నా తక్కువా? మా కవి గారెని నీ వెంట తిప్పుకుంటూ.. వెంటపడి మరీ ప్రేమించావ్ అన్నావ్. నీ తల్లిదండ్రులకు అంతా తెలిసినా కవి గారి దగ్గరికి ఎలా పంపించారు? నీ కన్నా పెద్దవాళ్ల ముందు కాస్త మర్యాదగా మాట్లాడటం నేర్చుకో కావ్య వార్నింగ్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

నా ఇద్దరు అక్కలు ఈ ఇంట్లోనే ఉన్నారు..

ఇది నా జీవితం.. నా కాపురం.. నా సమస్య.. నాకు అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకుంటున్నా. నాకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే అధికారం నాకు లేదా? అని అనామిక అంటే.. ఉంది నీకు ఆ అధికారం ఉంది. కానీ అడ్డమైన ఆరోపణలకు జవాబు చెప్పాల్సిన పని నాకు లేదని కళ్యాణ్ అంటాడు. నువ్వేంటే అలా నిలబడ్డావ్? మాట్లాడు అని స్వప్న అంటే.. నేనేంటో నాకు తెలుసు. కళ్యాణ్ స్నేహాన్ని ప్రేమ అని భ్రమపడ్డాను. పెళ్లి చేసుకోవాలని ఆశ పడ్డా. కానీ అది గతం. దాన్ని అప్పుడే మర్చిపోయా. కానీ ప్రతీ సారి ఈ అనామిక మాకు సంబంధం అంటగడుతుంటే.. రక్తం సలసలా మరిగిపోతుంది. అయినా నోరు విప్పకుండా ఎందుకు నిలబడ్డానంటే.. ఈ ఇంట్లో ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్ల జీవితం బాగుండాలి. నేను తొందర పడితే మా అక్కలకు మాట ఇస్తుందని అప్పూ అంటే.. నీకేం ఖర్మ పట్టిందే.. నువ్వెందుకు తల వంచాలని స్వప్న అంటుంది.

మీకంటే తక్కువగా ఇంకా నీచమైన నిందలు వేయగలను.

నేనూ చాలా సార్లు చూశాను. నడి బజారులో చూశాను. మీ ఇంటికి వెళ్లి వార్నింగ్ కూడా ఇచ్చాను. ఇది నీ చెల్లెలి తప్పు. తన హద్దుల్లో తను ఉండాలి. కానీ లేదు. తను మూలంగా ఈ ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. అది తెలిసి కూడా ఇంకా హోటల్ కి వెళ్లింది అనుకుంటే ఏం అనుకోవాలి అని ధాన్య లక్ష్మి అంటే.. అదే అనుకోవాలి. ఒక అమ్మాయి.. అబ్బాయి కలిసి తిరుగుతుంటే.. ఇంకేదో కారణం ఉందని ఎందుకు అనుకోవాలి. ఆ సంబంధమే ఉందని అనుకోవాలి. మీరు చదువుకున్న చదువులు మీకు ఇలాంటి పాఠాలు, సంస్కారమే నేర్పాయి. మరి నేనేమీ చదువుకోలేదు కదా.. కాబట్టి మీకంటే ఇంకా తక్కువ స్థాయిలో మాట్లాడగలను. నీచమైన నిందలు వేయగలను. అందరి ముందే నీ నాలుక కూడా చీరి పారేస్తాను ఖబడ్దార్ అని కనకం అంటుంది.

రఫ్ఫాడించేసిన కనకం..

కనకం మర్యాదగా మాట్లాడు అని ధాన్య లక్ష్మి అంటే.. ఎవరికి ఇవ్వాలి మర్యాద? నీకా, నీ కోడలికా.. మీరు ఇలాగే మాట్లాడతారని.. ఇంతకంటే ఎదగేరని నా కూతురితో స్నేహం మాను కొమ్మని నేను చెప్పినా.. అదే చెప్పినా.. మా పవిత్రమైన స్నేహానికి మట్టి, మశానం ఏమీ అంటదని దాని జీవితాన్ని ఇక్కడి వరకూ దిగజార్చిన నీ కొడుక్కి ఇవ్వాలా మర్యాదా? అసలు దాని భవిష్యత్తు ఏం కావాలి అనుకుంటున్నారు? ఇలాంటి నిందలు వేస్తే రేపు దానికి పెళ్లి ఎలా అవుతుంది? అనుకుంటున్నారు? ఇంకా ఎన్ని సార్లు దాని శీలం మీద మచ్చ వేస్తారు? ఏయ్ అనామిక నీకు ఎంత సేపూ గొడవలేనా? అసలు కట్టుకున్న భర్తతో ప్రేమగా అసలు ఉంటున్నావా? అసలు కాపురం సరిగ్గా చేస్తున్నావా? ఏం పుట్టుకమ్మా నీది? అని రఫ్ఫాడించేస్తుంది కనకం.

నీ భర్త, అప్పూలు తప్పు చేశారంటే నేను నమ్మను..

నీ కూతురు నా భర్తతో కలిసి హోటల్ గదిలో దొరికింది. అది తెలుసుకుని వచ్చావా? అని అనామిక అంటే.. తెలుసుకోను.. ఎందుకు తెలుసుకోవాలి? నీ మొగుడు అలాంటి వాడు కాదు? నా కూతురు కూడా అలాంటి ఆడ పిల్ల కాదు. నమ్మకం ఉండాలి అని కనకం అంటుంది. ఆపండి అని రాజ్ అంటాడు. ఏది ఏమైనా వీళ్లిద్దరూ హోటల్ గదిలో దొరకడం నిజం. అసలు ఏం జరిగింది రా? ఆ కారణం ఏంటి? మీరిద్దరూ అక్కడికి ఎందుకు వెళ్లారు? అని రాజ్ అడుగుతాడు. దీంతో కళ్యాణ్, అప్పూలు సైలెంట్‌గా నిలబడి ఉంటారు.

నా వల్లే వాళ్లు ఇరుక్కున్నారు..

నేను చెప్తాను.. వాళ్లిద్దరూ లోకం తీరు తెలీక ఇరుక్కున్నారు. ఒక్క నిమిషం తేడాతో నేనూ వాళ్ల వెనుకే వెళ్లాను అని కావ్య అంటే.. మాయ కోసం అని కావ్య అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. వాళ్లు అక్కడికి వెళ్లిందే నా వల్ల.. నేను చెప్పడం వల్ల.. దీంతో జరిగింది అంతా చెప్తుంది కావ్య. ఓసేయ్ పిచ్చి ముఖం దానా.. మెదడు లేని దానా? నువ్వు ఇంకా ఆ మాయలాడి మయాని వదలవా? దాన్ని పట్టుకోవడానికి వెళ్లి.. దరిద్రాన్ని మోసుకొచ్చావేంటే? అని స్వప్న.. నీకు ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోవు.. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అని రాజ్ అడుగుతాడు. ఆ దొంగ మాయతో మీ పెళ్లి జరుగుతున్న రోజే.. నాకు అసలు మాయ దొరికింది. నన్ను చూడగానే ఆ మాయ పారిపోవడం మొదలు పెట్టే లోపు.. ఆ మాయకు యాక్సిడెంట్ అయ్యింది. వెంటనే కోమాలోకి వెళ్లిపోయింది. ఈ పెళ్లి ఆపొచ్చని.. నేను ఆస్పత్రికి వెళ్లాను. కానీ మాయ మళ్లీ కోమాలోకి వెళ్లిపోయింది. ఇక నా వల్ల కాదని.. మావయ్య గారు నిజం చెప్పేశారు.

కళ్యాణ్‌ని ఇంటికి రానివ్వను..

ఇన్ని రోజులుగా ఆ మాయ ఆస్పత్రిలోనే ఉంది. మళ్లీ ఆ మాయకి స్పృహ వచ్చిందని డాక్టర్ చెబితే మేమందరం ఆస్పత్రికి వెళ్లాం. మళ్లీ ఆ మాయని కిడ్నాప్ చేశారు. దీంతో ఆ కిడ్నాప్ చేసిన కారు ఓ హోటల్ ముందు ఉంటే.. ఈ లోపు అనామిక, మీడియా వచ్చి రచ్చ రచ్చ చేశారు. అసలు మాయ దొరికితే.. మావయ్య గారు నిర్దోషి అని బయట పెడదామని అనుకున్నా. ఇదీ జరిగిందని కావ్య చెప్తుంటే.. అనామిక చప్పట్లు కొడుతుంది. శభాష్.. మీ కుటుంబానికి నాటకాలు ఆడటమే అనుకున్నా.. ఇలాంటి దిక్కుమాలిన కథలు కూడా బాగానే రాస్తున్నావ్ అని అనామిక అంటుంది. నేను ఒక్కటే చెప్తున్నా.. ఇక నుంచి కళ్యాణ్, అప్పూ కలవడానికి వీల్లేదని అనామిక అంటే.. నువ్వు కండీషన్ పెట్టేది ఏంటే.. కళ్యాణ్‌ని మా ఇంటికి రానివ్వను. ఒకవేళ వస్తే మొహం మీదనే తలుపు వేస్తాను. దీంతో అప్పూని తిట్టి లాక్కెళ్తుంది కనకం. ఒక భార్య ఉండగా.. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది కళ్యాణ్? నీకు అసలు ఎవరి బుద్ధులు వచ్చాయో.. ఏంటో అని అనామిక అంటుంది.

ఈడ్చికొడితే వెళ్లి పుట్టింటిలో పడతావు.. పెద్దావిడ వార్నింగ్..

అనామికా.. నోరు మూయ్. నువ్వెంత? నీ బతుకెంత? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇక్కడ ఈడ్చికొడితే వెళ్లి పుట్టింటిలో పడతావ్? నీ ముఖం నాకు చూపించకు వెళ్లూ.. ధాన్య లక్ష్మి నీ కోడలికి కాస్త బుద్ధి నేర్పించు. ఎవరితో ఎలా మాట్లాడాలో అని పెద్దావిడ వార్నింగ్ ఇస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో రాజ్, కావ్యలకు మాయ దొరుకుతుంది. మాయని తీసుకొచ్చి.. అందరి ముందూ నిజం చెప్పిస్తారు.