Brahmamudi, June 10th Episode: అయ్యయ్యో.. కళావతి ఎంత పని జరిగిపోయింది.. పెళ్లి ఫిక్స్ ఇక!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. గదిలో కూర్చొన్న ఇందిరా దేవి, సీతా రామయ్యలను ఇంకా రెడీ అవ్వలేదా అని అపర్ణ అడిగితే.. ఎందుకు అని పెద్దావిడ అంటుంది. ఈ పెళ్లి మీ చేతుల మీదుగానే జరిపించాలి కదా అని అపర్ణ అంటుంది. మా చేతుల మీదుగా కన్యాదానం చేయాలా.. ఆమె ఏమైనా కన్యానా.. వాడేమో ఓ బిడ్డకు తండ్రి.. అలాంటి వాళ్లకు పెళ్లికి మేము వస్తే ఎంత? రాకపోతే ఎంత? అని పెద్దావిడ అంటుంది. మావయ్యా మీరు కూడా నేను తప్పు చేస్తున్నా అనుకుంటున్నారా? అని అపర్ణ అడిగితే..

Brahmamudi, June 10th Episode: అయ్యయ్యో.. కళావతి ఎంత పని జరిగిపోయింది.. పెళ్లి ఫిక్స్ ఇక!
Brahmamudi
Follow us

|

Updated on: Jun 10, 2024 | 12:49 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. గదిలో కూర్చొన్న ఇందిరా దేవి, సీతా రామయ్యలను ఇంకా రెడీ అవ్వలేదా అని అపర్ణ అడిగితే.. ఎందుకు అని పెద్దావిడ అంటుంది. ఈ పెళ్లి మీ చేతుల మీదుగానే జరిపించాలి కదా అని అపర్ణ అంటుంది. మా చేతుల మీదుగా కన్యాదానం చేయాలా.. ఆమె ఏమైనా కన్యానా.. వాడేమో ఓ బిడ్డకు తండ్రి.. అలాంటి వాళ్లకు పెళ్లికి మేము వస్తే ఎంత? రాకపోతే ఎంత? అని పెద్దావిడ అంటుంది. మావయ్యా మీరు కూడా నేను తప్పు చేస్తున్నా అనుకుంటున్నారా? అని అపర్ణ అడిగితే.. నీకు తప్పు ఒప్పుల గురించి చెప్పేవాడిని కాదమ్మా.. కానీ ఈతరం నిర్ణయం.. మా తరానికి నచ్చలేదు. కావ్య జీవితాన్ని సరిదిద్దగలవా? ఏం చేయగలవు అమ్మా.. అని సీతా రామయ్య అంటాడు. ఎవర్ని తప్పు పట్టి ఏం లాభం బావా.. ఈ అనర్థానికి బీజం ఎప్పుడో పడిందని ఇందిరా దేవి అంటే.. అలాగని పెళ్లి పెద్దలుగా నిలబడతామా? అని పెద్దాయన అంటాడు. నాకు మాత్రం నా కొడుక్కి రెండో పెళ్లి చేయడం ఆనందంగా ఉందా? మావయ్యా? ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నా మనసుకి కూడా కష్టంగానే ఉంది. కావ్య అనుమతి పత్రాలపై సంతకం చేసింది. కాబట్టి కాస్త అయినా ఊరటగా ఉందని అపర్ణ అంటుంది.

అపర్ణకు.. పెద్దాయన చివాట్లు..

కావ్య గురించి మాకెందుకు చెప్పడం అమ్మా.. తన మనసు చంపుకుని ఈ పెళ్లికి ఒప్పుకుంది. అది ఆమె అమాయకత్వం అనుకోవాలో.. లేక ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది అనుకోవాలో అర్థం కావడం లేదని సీతా రామయ్య అంటాడు. సరే నువ్వు వెళ్లు అపర్ణా.. మేము ఇద్దరం కలిసి మౌనంగా వస్తామని పెద్దావిడ అంటుంది. మరోవైపు అసలు మాయకు డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తుంది. దీంతో అప్పూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు పెళ్లికి అంతా సిద్ధమవుతుంది. రుద్రాణి, రాహుల్‌, చిత్రలు ఎంతో సంతోషంగా ఉంటారు. అందర్నీ అక్షింతలు వేసి ఆశీర్వదించమని పంతులు చెప్తే.. ఎవరూ వెళ్లరు. కేవలం రుద్రాణి, రాహుల్‌, ధాన్యలక్ష్మిలు ఆశీర్వదిస్తారు.

బండరాయి తీసుకొచ్చి దాని నెత్తిన వేస్తాను..

ఎవరికి నచ్చినా నచ్చకపోయినా.. నేను ఒక పసి బిడ్డకు న్యాయం చేయడానికి ఈ పెళ్లి జరిపిస్తున్నా అని అపర్ణ అక్షింతలు వేస్తుంది. అదేంటి? అలాగే నిలబడి పోయావ్? వచ్చి అక్షింతలు వేయి.. ఇంకొద్ది గంటల్లో నీ మొగుడు ఈ పిల్ల తల్లి మెడలో మూడు ముళ్లు వేస్తాడు. అప్పుడు నువ్వు హారతి ఇచ్చి పక్కకు జరుగుతావు. ఈ మాయలాడి మీ బెడ్ రూమ్‌లో అడుగు పెడుతుంది. ఏదీ ఆగదు. సిగ్గు లేని వాళ్లందరూ అక్షింతలు వేసి దీవిస్తున్నారని స్వప్న అంటుంది. స్వప్నా పెళ్లిలో గొడవలు వద్దు.. ఇది దుగ్గిరాల ఇంట్లో జరిగే పెళ్లి. మీ ఏరియాలో జరిగే పెళ్లి కాదు. అక్షింతు వేస్తే వేయి లేదంటే మానేయ్ అని అపర్ణ అంటుంది. అయ్యో ఇది మా ఏరియాలో జరిగే పెళ్లి అయితే.. బిందెలు పట్టుకుని అమ్మలక్కలు అందరూ దీని బుర్ర బద్దలు కొట్టేవాళ్లు. నేను చూస్తూ ఉండలేక ఇలా నోరు పారేసుకుంటున్నా. దీని మీద నేను అక్షింతలు వేయాలా.. నేను చస్తే వెయ్యా.. మా కావ్య చెప్తే.. ఓ బండరాయి మోసి తీసుకొచ్చి దీని నెత్తిన వేస్తాను అని స్వప్న అంటుంది.

ఇవి కూడా చదవండి

నువ్వు చెప్పు.. నేను ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి ఆపేస్తా..

కట్ చేస్తే.. బయటకు వచ్చి కావ్య బాధ పడుతూ ఉంటుంది. అప్పుడే పెద్దావిడ వచ్చి.. కన్నీళ్లను దాచుకోగలవు కానీ.. రాబోయే కష్టాన్ని ఆపుకోలేవు కావ్య అని అనగానే.. కళావతి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మొదటి సారి నేనే ఓడిపోతున్నా. నేను ఏం తప్పు చేశాను. నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు ఎదురవుతున్నాయని కావ్య అంటుంది. ఆ అనుమతి పత్రాలపై సంతకం చేసినప్పుడే నీ హక్కులన్నీ వదిలేసుకున్నావ్. నువ్వు అంత సులువుగా వాటిపై సంతకం పెట్టావంటే.. నీకు ఏదో దారి దొరికి ఉంది. అదేంటో చెప్పు. ఏ దారీ లేకపోయినా.. నీకు ఇంకో దారి ఉందని పెద్దావిడ ఉందని అంటుంది. ఏంటని కావ్య అడిగితే.. ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదని మీ అత్తగారికి చెప్పు. నువ్వు ఒక్క మాట చెప్పు.. నేను ఎలాగోలా ఆపించేస్తానని పెద్దావిడ అంటుంది. నేను ఏం చేయలేనని క్షమించండి అని కావ్య వెళ్లిపోతుంది.

మెలకువలోకి వచ్చిన మాయ..

ఆ తర్వాత రాజ్, మాయలు పెళ్లి పీటల మీద కూర్చొంటారు. అప్పుడే కావ్యకి దగ్గరకు పెద్దావిడ, సుభాష్, కళ్యాణ్‌, స్వప్నలు వచ్చి అడుగుతూ ఉంటారు. అసలు నువ్వు ఏం చేసి ఆ పెళ్లి ఆపేస్తావ్? అని అడుగుతూ ఉంటారు. అప్పూ కాల్ చేసి.. మాయకి వెలకువ వచ్చిందని చెప్తుంది. దీంతో వెంటనే బయలు దేరుతూ నేను ఎలాగైనా ఈ పెళ్లి ఆపించేస్తాను అని చెప్పి వెళ్తుంది. హడావిడిగా ఆస్పత్రికి వచ్చిన కావ్య.. వెంటనే మాయ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనే పరిస్థితుల్లో కూడా నేను లేను. ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం నా జీవితం మీద ఆధార పడి ఉంది. దయచేసి నాకు నిజం చెప్పు. ఆ బిడ్డకు, మా మావయ్య గారికి, నీకు ఏంటి? సంబంధం? ఇందులో ఏదో నిజం దాగి ఉంది? అదేంటో చెప్పు.. ప్లీజ్ నీకు దణ్ణం పెడతాను చెప్పు అని కావ్య అడుగుతుంది. కానీ మాయ అప్పటికే స్పృహ కోల్పోయి.. కోమాలోకి వెళ్తుంది. దీంతో కళావతి ఏం చేయలేని పరిస్థితిల్లో ఉండిపోతుంది.

రాజ్, మాయల పెళ్లి ఆపేసిన సుభాష్..

ఇక వచ్చే ఎపిసోడ్‌లో కావ్య ఏమీ చేయలేకుండా ఇంటికి వస్తుంది. రాజ్ ఏంటి అని సైగ చేస్తాడు. కావ్య దణ్ణం పెడుతుంది. దీంతో రుద్రాణి, రాహుల్, చిత్రలు హ్యాపీగా ఫీల్ అవ్వగా.. రాజ్‌తో పాటు అందరూ షాక్ అవుతారు. ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో రాజ్ తాళి కట్టబోతాడు. అప్పుడే సుభాష్ ఆగు రాజ్ అని అరుస్తాడు. దీంతో రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా? అని ఉత్కంఠగా మారుతుంది.

Latest Articles
మీ మొబైల్‌లో నెట్‌ స్లో అవుతుందా? ఇలా చేస్తే సూపర్‌ఫాస్ట్ అవుతుంద
మీ మొబైల్‌లో నెట్‌ స్లో అవుతుందా? ఇలా చేస్తే సూపర్‌ఫాస్ట్ అవుతుంద
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
'జబర్దస్త్' కారు కొన్న రీతూ చౌదరి.. ధర ఏకంగా ఎన్ని లక్షలో తెలుసా?
'జబర్దస్త్' కారు కొన్న రీతూ చౌదరి.. ధర ఏకంగా ఎన్ని లక్షలో తెలుసా?
చందమామ ఈమె వెంట పడుతుందేమో.. తన వెన్నలను తిరిగి ఇవ్వమని..
చందమామ ఈమె వెంట పడుతుందేమో.. తన వెన్నలను తిరిగి ఇవ్వమని..
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్
వంటింట్లో టమాట మంటలు.. మరో వారంలో కేజీ టమాట రూ.200కు చేరే ఛాన్స్!
వంటింట్లో టమాట మంటలు.. మరో వారంలో కేజీ టమాట రూ.200కు చేరే ఛాన్స్!
వారణాసి స్టేడియాన్ని ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ..!
వారణాసి స్టేడియాన్ని ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ..!
తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం...
తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం...
గంటల తరబడి ఏసీలో కూర్చొని నేరుగా బయటకు వెళ్తున్నారా? డేంజరే..!
గంటల తరబడి ఏసీలో కూర్చొని నేరుగా బయటకు వెళ్తున్నారా? డేంజరే..!
దర్శన్‌కు మద్దతుగా టాలీవుడ్ నటి.. రేణుకా స్వామిదే తప్పు అంటూ..
దర్శన్‌కు మద్దతుగా టాలీవుడ్ నటి.. రేణుకా స్వామిదే తప్పు అంటూ..