ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్‌లో.. అపర్ణ, సుభాష్‌ల మ్యారేజ్ యానివర్సరీ అని రాజ్ ఫోన్‌కి రిమైండర్ వస్తుంది. అరే నేను మర్చిపోయాను కదా.. ఇదే మంచి ఐడియా అని రాజ్ అనే సరికి.. కావ్య కూడా అవును అని అంటుంది. ఏంటి నీకూ అదే ఐడియా వచ్చిందా.. ఈ దెబ్బతో కళ్యాణ్ మనసు కూడా మారుతుంది. మావయ్య, అపర్ణలను కూడా దగ్గర చేయవచ్చని కావ్య అంటుంది. అమ్మ, నాన్నల పెళ్లి రోజును ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం. గేమ్స్ అన్నీ పెట్టి.. అందులో కళ్యాణ్ పార్టిస్పేట్ చేసేల చేద్దాం. అవును అని ఇద్దరూ సరే అని అనుకుంటారు. సరే పడుకుందాం పదా అని రాజ్ అంటే.. ఆ.. అంతకన్నా మనం చేయాల్సిన పని ఇంకేం ఉందని కావ్య సెటైర్లు వేస్తుంది.
మరోవైపు కనకం బాధ పడుతూ.. చట్టు ప్రక్కల వారు అన్న మాటలను తలుచుకుంటూ ఉంటుంది. కనకం బాధను చూసిన కృష్ణ మూర్తి నచ్చజెప్తాడు. ఒక మంచి సంబంధం చూసి అప్పూకి పెళ్లి చేసేద్దాం. నేను ఆవేశంతో మాట్లాడటం లేదు. ఆలోచించే మాట్లాడుతున్నాని కనకం అంటే.. తను పోలీస్ అవడానికి కష్ట పడుతుంది కదా.. అలా లేట్ చేస్తే దాని జీవితం ప్రశ్నార్థకంగా మారుతుందని కృష్ణ మూర్తి అంటాడు. అందుకే పెళ్లి చేసేద్దాం. అప్పూని నేను ఒప్పిస్తాను. నువ్వు పెళ్లిళ్ల పేరయ్యను కలిసి సంబంధం మాట్లాడమని కనకం అంటుంది. సరే అని కృష్ణ మూర్తి అంటాడు.
ఈ సీన్ కట్ చేస్తే.. తెల్లవారుతుంది. సుభాష్ బయటకు వస్తాడు. అప్పటికే కావ్య, రాజ్‌లు అక్కడ ఉంటారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు. అవును అసలు విషయమే మర్చిపోయాను కదా.. ఉండు ఇప్పుడే వెళ్లి అపర్ణకు మ్యారేజ్ డే విషెస్ చెప్తాను అని అంటాడు. ఆగండి మావయ్య.. ఒట్టి చేతులతో అలాగే వెళ్తారా.. ఇదిగోండి అని కావ్య గిఫ్ట్ ఇస్తుంది. అపర్ణ మాటలను గుర్తు చేసుకుంటాడు సుభాష్. మీరు ఏమీ ఆలోచించకుండా.. ఈ గిఫ్ట్ తీసుకెళ్లి ఇవ్వండి అని అంటాడు రాజ్. చాలా థాంక్స్ అమ్మా అని సుభాష్ సంతోషంగా గిఫ్ట్ తీసుకుని వెళ్తాడు సుభాష్.
ఈ క్రెడిట్ అంతా నాదే అని రాజ్, కావ్యలు దెబ్బలాడుకుంటూ ఉంటారు. అప్పుడే పెద్దావిడ వచ్చి ఇక ఆపుతారా.. రెండు గండు పిల్లుల్లా కొట్టుకుంటున్నారు. అడ్డ గాడిదల్లా పెరిగారు. ఇక ఎప్పుడు బుద్ధి వస్తుంది. ఎప్పుడు మీరు కాపురం చేస్తారు. నా చేతిలో మనవడిని ఎప్పుడు పెడతారు? అని పెద్దావిడ అంటుంది. ఆ.. అది మీ మనవడిని అడగండి అని కావ్య వెళ్లిపోతుంది. చూశావా నానమ్మా తిప్పుకుని వెళ్లిపోతుందని.. రాజ్ అంటే.. నువ్వు ఏమన్నా తక్కువా? అని ఇందిరా దేవి అంటుంది. మరి ఎలా నాన్నమ్మా అని రాజ్ అంటే.. నువ్వు, తాతయ్య కూడా ఇలానే చేసేవారా అని రాజ్ అంటే.. నీకు తెలుసా.. మీ తాతయ్య కూడా నన్ను బుజ్జగించేవాడు. అన్నీ చేసేవాడని పెద్దావిడ అంటే.. నేను నమ్మను అని అంటాడు రాజ్. ఒరేయ్ శ్రీ కృష్ణుడే సత్య భామ కాళ్లు పట్టుకున్నాడు. నీ ఇగోను పక్కన పెట్టి నువ్వు వెళ్లు మీ ఆవిడను బుజ్జగించు. నీ మనసులో మాట చెప్పేయ్ అని పెద్దావిడ అంటే.. సరే ఇవాళ ఎలాగైనా చెప్పేస్తాను అని రాజ్ అంటాడు.
ఆ తర్వాత సుభాష్ సంతోషంగా వచ్చి రాజ్‌ని హగ్ చేసుకుంటాడు. ఇప్పటి వరకూ అపర్ణకు నా మీద కోపంగా ఉందని కొంచెం అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు పర్వాలేదు. చాలా సంతోషంగా ఉందని సుభాష్ అంటాడు. ఇవాళ మీ పెళ్లి రోజు డాడ్.. గ్రాండ్‌గా చేద్దామని రాజ్ అంటాడు. సరే అని సుభాష్ అంటాడు. ఆ తర్వాత ధనుంజయ అనే వ్యక్తి పంతుల గారితో కనకం ఇంటికి వస్తాడు. మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పారు కదా.. అందుకే ఇతన్ని తీసుకొచ్చానని పేరయ్య అంటాడు. మంచి సంబంధం అన్నాం కదా.. ఇలాంటి వాడిని తీసుకొచ్చారేంటి? అని కనకం అంటే.. ఏం నాకేం తక్కువ అని ధనుంజయ అంటాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నావు. రెండో పెళ్లాన్ని చంపి జైలుకు వెళ్లావు కదా అని కనకం అంటుంది.
సారా వ్యాపారంలో బాగా సంపాదించాను కదా అని ధనుంజయ అంటాడు. ఎందుకు తల మీద పెట్టుకోవడానికా? అని కనకం అంటుంది. మీకు డబ్బుకన్న వాళ్లు ఉంటే చాలు కదా.. అయినా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. మీ అమ్మాయి లాడ్జ్‌లో దొరికి పోయింది అంట కదా.. అయినా అవేమీ పట్టించు కోకుండా నేను పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఒక తిరుగు బోతుకు నాలాంటి తిరుగుబోతే కరెక్ట్ అని ధనుంజయ అంటే.. కనకం చెంప పగల కొడుతుంది. నీతో నా కూతురికి ఏంట్రా పోలిక.. నా కూతురు నిప్పు.. ముందు నువ్వు బయటకు వెళ్లు.. అని చొక్కా పట్టుకుని పంపించేస్తుంది. అదంతా అప్పూ బయటకు వచ్చి వింటుంది. నేను మనసులో ఏమీ పెట్టుకోను. మనసు మారితే కబురు పెట్టమని ఆ ధనుంజయ అంటాడు. ఆ తర్వాత పెళ్లిళ్ల పేరయ్యపై కనకం, కృష్ణ మూర్తిలు ఫైర్ అవుతారు. ఇదంతా విన్న అప్పూ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. అది చూసి కనకం బాధ పడుతుంది.
మరో వైపు కళ్యాణ్ బాధ పడుతూ ఉంటాడు. అది చూసిన ప్రకాశం నీ వల్లే అని ధాన్య లక్ష్మిని అంటాడు. ఇంత జరిగినా కూడా అప్పూ గురించే ఆలోచిస్తే ఎలా అని ధాన్య లక్ష్మి అంటుంది. ఇక కళ్యాణ్ దగ్గరకు వెళ్లి రాత్రి కొంచెం ఆవేశంగా మాట్లాడాను నాన్న.. ఏమీ అనుకోకు అని ధాన్య లక్ష్మి అంటే.. తల్లివి కదా అందుకే అర్థం చేసుకుని వెళ్లిపోయానని కళ్యాణ్ అంటాడు. అది కాదురా.. వయసు వచ్చిన కొడుకు ఇలా ఉంటే మాకు చూడటానికి చాలా బాధగా ఉంటుంది. నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయి.. మేము నీకు సపోర్ట్ చేస్తామని ధాన్య లక్ష్మి, ప్రకాశం అంటారు. ఇక ఇంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.