Brahmamudi, January 6th episode: విడాకుల రచ్చ.. లాయర్‌తో రాజ్ సంప్రదింపులు.. చూసేసిన కళావతి!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో రాజ్, శ్వేతలు ఆఫీస్‌కి వెళ్తారు. అప్పుడే అక్కడికి లాయర్ కూడా వస్తాడు. శ్వేత చెప్పింది కదా ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు అని రాజ్ అంటుండగానే.. కావ్య వచ్చి డోర్ దగ్గర నిలబడుతుంది. రాజ్.. లాయర్‌తో ఏం మాట్లాడుతున్నాడా అని వింటుంది. మా కేసులో ఇద్దరికీ డివోర్స్ తీసుకోవడం ఇష్టం అని రాజ్ అనగానే.. అది విన్న కళావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చాలా మంది ముందు ఓకే అంటారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ మ్యూచువల్ అండర్ స్టాండ్‌తో మళ్లీ నో అంటారు అని లాయర్ అనగానే..

Brahmamudi, January 6th episode: విడాకుల రచ్చ.. లాయర్‌తో రాజ్ సంప్రదింపులు.. చూసేసిన కళావతి!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Jan 06, 2024 | 11:19 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో రాజ్, శ్వేతలు ఆఫీస్‌కి వెళ్తారు. అప్పుడే అక్కడికి లాయర్ కూడా వస్తాడు. శ్వేత చెప్పింది కదా ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు అని రాజ్ అంటుండగానే.. కావ్య వచ్చి డోర్ దగ్గర నిలబడుతుంది. రాజ్.. లాయర్‌తో ఏం మాట్లాడుతున్నాడా అని వింటుంది. మా కేసులో ఇద్దరికీ డివోర్స్ తీసుకోవడం ఇష్టం అని రాజ్ అనగానే.. అది విన్న కళావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చాలా మంది ముందు ఓకే అంటారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ మ్యూచువల్ అండర్ స్టాండ్‌తో మళ్లీ నో అంటారు అని లాయర్ అనగానే.. నో అలాంటి ఉద్దేశం లేదని రాజ్ చెప్పేస్తాడు. రాజ్ మనం ఏమైనా తప్పు చేస్తున్నామా.. ఒక్కసారి ఆలోచించు అని శ్వేత అంటే.. నువ్వేం భయపడకు నేను ఉన్నాను కదా.. ఏం జరగదని రాజ్ చెప్తాడు. కావ్యకి ఏమీ అర్థం కానట్లు చూస్తుంది. మనం ఏం తప్పు చేయడం లేదు కదా అని శ్వేత అంటే.. దీనికి ఇదే పరిష్కారం అని రాజ్ చెప్తాడు. ఆ మాటలు విన్న కావ్య గుండె ఒక్కసారిగా ఆగినట్లు అనిపిస్తుంది.

Brahmamudi

విడాకులు ఫిక్స్.. తగ్గేదెలా అంటున్న రాజ్.. బాధలో కావ్య:

ఆ తర్వాత ఆఫీస్‌లో శ్వేతతో రాజ్ చాలా చనువుగా ఉంటాడు. శ్వేత బాధపడుతుంటే.. హగ్ చేసుకుని ధైర్యం చెప్తాడు. ఇదంతా సైలెంట్ కావ్య చూస్తుంది. లోలోపలే ఎంతో బాధ పడుతుంది. ఈయన ఏంటి ఇలా చేస్తున్నారు? నాతో విడాకులు తీసుకుందామని ఫిక్స్ అయిపోయారా.. నేను అనవసరంగా ఆయనపై ప్రేమ పెంచుకున్నా.. అని మనసులో అనుకుంటుంది. ఆ బాధతో.. పక్కనే కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో రాజ్.. కావ్యను చూసి షాక్ అవుతాడు. మరి ఆ తర్వాత ఏం జరగనుంది? కావ్య ఎలా రియాక్ట్ అవుతుందో.. నిజంగానే రాజ్‌తో కావ్య విడాకులు తీసుకుంటుందా.. తెలియాలంటే.. ముందు ముందు ఏం జరగనుందో వెయిట్ చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో..

అనామిక పెట్టిన కాఫీ బాగోలేకపోవడంతో.. కావ్య మళ్లీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అది తాగిన అందరూ మెచ్చుకుంటారు. మా వదినను చూసి నేర్చుకో.. తను నేర్పిస్తుంది ఫీల్ అవ్వకు అని కళ్యాణ్ అంటాడు. అప్పుడే శ్వేత ఫోన్ రావడంతో రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కావ్యని అందరూ పొగిడేసరికి అనామిక కుళ్లుకుని.. బయటకు వెళ్లి కూర్చుంటుంది. ఇదే టైమ్ చూసుకుని.. కావ్యపై లేనిపోనివి చెప్పి అనామికను రెచ్చ గొడుతుంది. అందర్నీ కావ్యలా గ్రిప్‌లో పెట్టుకోమని సలహా ఇస్తే.. అలాంటివి నాకు చేత కాదని అనామిక అంటుంది. అలా చేయకుండా నీకే నష్టం అని చెప్తుంది రుద్రాణి.

ఎంత సేపు అయినా లాయర్ రాకపోవడంతో.. రాజ్ చిరాకు పడుతూ ఉంటాడు. అలా చిరాకు పడేవాళ్లంలే నాకు ఇంకా చిరాకు అని శ్వేత అంటుంది. ఈ చిరాకు పోవాలంటే ఏం చేయాలో అని రాజ్ అంటే.. ఐస్ క్రీమ్ తిందాం అని అంటుంది శ్వేత. సరే అని ఇద్దరూ కిందుకు దిగి ఐస్ క్రీమ్ తింటారు. అప్పుడే కావ్య ఆటోలో బయటకు వెళ్తుంది. వీళ్లిద్దర్నీ చూసి షాక్ అవుతుంది. రాజ్‌కి ఫోన్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. రాజ్ అబద్ధం చెప్పడంతో బాధతో వాళ్లిద్దర్నీ చూస్తూ ఉంటుంది.

ఈలోపు లాయర్ రావడం లేటు అవుతుంది అనడంతో.. ఆఫీసుకు వచ్చి కలవమని చెప్తాడు రాజ్. సరిగ్గా అప్పుడే ఆటో డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ.. రాజ్ వాళ్లకు అడ్డుగా వస్తాడు. దీంతో కోపంతో రాజ్ వెళ్లి ఆటోను ఆపి.. డ్రైవర్ కు వార్నింగ్ ఇస్తాడు. పక్కన అమ్మాయి ఉంటే చాలు.. ప్రతివోడూ హీరోలా ఫీల్ అయిపోతూ ఉంటాడని డ్రైవర్ అంటే.. నీ మంచి కోసమేగా చెప్పిందని కావ్య అంటుంది. ఈ సీన్ కట్ చేస్తే.. రుద్రాణిని తగులుకుంటుంది స్వప్న. నన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతానని చెప్పారు కదా.. అదే చేయండి అని అంటుంది. రాహుల్‌కి, రుద్రాణి‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. స్వప్నకు అపర్ణ, ఇందిరా దేవిలు కూడా సపోర్ట్ చేస్తారు. దీంతో రుద్రాణి తల పట్టుకుంటుంది.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు