ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాత్రి పూట బాల్కానీలో కూర్చుని కావ్య, భాస్కర్ అలియాస్ బావ ముచ్చట్లు పెడుతూ ఉంటారు. అది చూసి రాజ్ కుళ్లుకుంటూ ఉంటాడు. మెల్లగా వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటాడు. నాకు ఎంత అన్యాయం చేశావ్ బుజ్జీ.. నువ్వు ముసుగు వేసుకుని పెళ్లి చేసుకుని ఉండకపోతే.. నేను నిన్ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయే వాడిని అని చెబుతూ ఉంటాడు. ఏం చేస్తాం బావా.. పెళ్లి జరిగినా ఏం ప్రయోజనం అని అంటూ ఉంటుంది కావ్య. ఈలోపు రాజ్ వాళ్ల ముందు కింద పడి పోతాడు. ఏమీ పర్వాలేదు అండీ.. మేము మాట్లాడుకునేది మీరు కూడా వినొచ్చు అని కావ్య కావాలనే సెటైర్ వేస్తుంది. ఇక్కడేం చేస్తున్నారు మీరిద్దరూ అని రాజ్ అడుగుతాడు. ఏదో విడిపోయిన పక్షులం, స్నేహితులం, నావలం అని ఏదేదో చెబుతుంది కావ్య. ఏహే ఆపూ అని రాజ్ అరుస్తాడు. ఏంటి అన్నయ్యా అలా మాట్లాడుతున్నావ్ అని భాస్కర్ అంటే.. ఏహే నువ్వు ముందు అన్నయ్యా అని పిలవడం ఆపు అని అంటాడు రాజ్. సర్లే వెళ్లి పడుకుందాం రా బావా అని కావ్య అంటే.. రాజ్ మండి పడిపోతూ ఉంటాడు.
ఇక తెల్లారుతుంది.. అప్పూ ఉదయాన్నే లేచి ఎక్ర్ సైజ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అలిసిపోయి పక్కకు కూర్చుంటుంది. అప్పుడే బాబాయ్ వచ్చి.. ఏంటి అలిసి పోయావా అని అడుగుతాడు. అవును.. అని అప్పూ అంటూ.. ఏంటీ ఈ మాత్రం దానికేనా అని బాబయ్ అంటాడు. గట్టు మీద నుంచి కబుర్లు చెప్పడం కాదు.. గ్రౌండ్‌లో పరిగెడితే తెలుస్తుందని చెప్తుంది అప్పూ. ఇవన్నీ దాటి వచ్చాను కాబట్టే చెప్తున్నా.. నువ్వు అలిసి పోతే పోలీస్ అవ్వలేవు.. నేను కూడా పోలీస్‌నే అని బాబాయ్ చెప్పగానే.. అప్పూ నవ్వుతుంది. ఈ పొట్టతోనే దొంగల్ని పట్టుకున్నారా అని ఎగతాళి చేస్తుంది. ఇప్పుడు కాదు.. ఒకప్పుడు అని బాబాయ్ చెప్తాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి నమస్తే సర్ అని చెప్తాడు. ఏంటి రామూ బాగున్నావా అని బాబయ్ అడిగితే.. మీరు ఎస్‌ఐగా ఉన్నంత వరకూ బాగానే ఉన్నాను సర్.. ఆ తర్వాత నైట్ డ్యూటీలు ఎక్కువ అయిపోయాయి అని కానిస్టేబుల్ చెప్తాడు. అది విని అప్పూ షాక్ అయి.. సారీ నమ్మలేదు బాబాయ్ అని అంటుంది. ఇక నుంచి మీ దగ్గరే నేను ట్రైనింగ్ తీసుకుంటా అని అప్పూ చెప్తుంది.
రాజ్ లేచి కావ్యను వెతుక్కుంటూ ఉంటాడు. ఈలోపు కావ్య.. కాఫీ పట్టుకు వస్తుంది. ఏంటి నాకేనా కాఫీ తీసుకోబోతాడు రాజ్.. ఇది మీకు కాదండి.. మా బావకు అని చెప్తుంది కావ్య. ఏంటి నాకు ఇవ్వకుండా మీ బావకు ఇవ్వడం ఏంటి? నాకన్నా మీ బావే ఎక్కువ అయిపోయాడా అని రాజ్ జెలసీ ఫీల్ అవుతాడు. మీకు.. మా బావకు పోలిక ఏంటి? ఏంటండీ.. మేమిద్దరం కలిసి చదువుకున్నాం.. ఆడుకున్నాం.. మాకు ఎన్నోమధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరంటే ఈ మధ్యే కదా వచ్చింది. పైగా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. ఇక మెమిరీస్ గురించి అంటే.. మన మధ్య గొడవలు తప్ప ఇంకేం లేవని అంటుంది. కాబట్టి మా బావకు ఇచ్చేసి.. ఆ తర్వాత మీకు ఇస్తాను అని కావ్య అంటుంది.
నెక్ట్స్ శైలజకు కాల్ అనామికకు కాల్ చేస్తుంది. ఆ ఇంటి పెత్తనం నీ ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది. ఏంటి వచ్చేది.. వచ్చినట్టు వచ్చే తిరిగి ఆ కావ్య చేతికి వెళ్లిపోయిందని అనామిక అంటుంది. మీ డాడీ బిజినెస్‌లో ఫెయిల్ అయిపోనట్లు.. నువ్వు మీ అత్తారింట్లో ఫెయిల్ అయిపోతున్నావేంటే అని శైలజ అంటే.. అంత ఈజీగా తీసేయకు మమ్మీ.. మీ అల్లుడిని ఆఫీస్‌కి పంపిస్తున్నా అని చెబుతుంది. ఎలా ఒప్పుకున్నాడే అని శైలజ అడిగితే.. ముందు వెళ్లనని మొండికేశాడు.. కానీ ఫస్ట్ జరగాలంటే నేను చెప్పినట్టు జరగాలని చెప్పాను. అప్పుడే రుద్రాణి బయటకు వస్తుంది. అనామిక మాట్లాడేది విని.. షాక్ అవుతుంది. అప్పటి నుంచి మా దారికి వచ్చాడు చెప్పినట్టు చేస్తున్నాడు. ఆఫీస్‌కి వెళ్లినంత మాత్రాన అల్లుడు గారు చేసేది ఏంముంటుందే.. పవర్ మొత్తం ఆ రాజ్ చేతిలోనే ఉంటుంది కదా అని శైలజ అంటే.. అదే మారుస్తాను. మెల్లగా రాజ్‌ని తప్పిస్తూ కళ్యాణ్‌ని డెసిషన్ మేకర్‌ని చేస్తాను. కంపెనీ తన గుప్పెట్లోకి వచ్చేలా చేస్తాను. అప్పుడు నా మొగుడు కింగ్ అవుతాడు. అప్పుడు ఈ ఇల్లు మొత్తం నా కంట్రోల్‌లో ఉంటుందని అనామిక అంటుంది. ప్లాన్ అదిరిపోయింది అనామిక. కానీ కళ్యాణ్‌ని తప్పించి.. రాహుల్‌ని కూర్చోబెడతాను. అప్పుడు కింగ్ నా కొడుకు.. కింగ్ మేకర్ నేను అవుతానని రుద్రాణి అంటుంది.
ఆ తర్వాత రాజ్ హాలులో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు. అప్పుడే కాఫీ తీసుకొస్తుంది. ఓహో మీ కాఫీ మీరే పెట్టుకున్నారా అని కావ్య అడుగుతుంది. టెంపరరీ పెళ్లాం ఇవ్వకుంటే.. పర్మినెంట్ అమ్మ ఉంది కదా అని రాజ్ చెప్తాడు. ఆ అవునులెండి.. నేను వెళ్లిపోయాక మీ పనులు ఆవిడ తప్ప ఇంకెరు చేస్తారులే. పాపం అత్తయ్యా అని అంటుంది కావ్య. ఎందుకో అంత జాలి అని రాజ్ అంటే.. కొడుకు ఎద్దులా పెరిగినాల.. బండెడు చాకిరీ తప్పలేదు కదా అని కావ్య అంటుంది. నువ్వు పోతే ఇంకెవరూ రారనుకున్నావా.. నీ స్థానంలో మరో మంచి అమ్మాయి వస్తుంది అని రాజ్ అంటాడు. మరి ఇంత మంచి న్యూస్ ఇలా చెప్తారేంటి? ఉండండి ఇంట్లో వాళ్లందర్నీ పిలుస్తాను అని అరుస్తుంది కావ్య. దీంతో రాజ్ నోరు మూస్తాడు.
టెంపరరీ పెళ్లాం మీద చేతులు వేయకూడదని తెలీదా అని కావ్య అంటే.. వేయాలని కూడా లేదని రాజ్ అంటాడు. పోనీ పర్మినెంట్ చేయండి.. చాలా ఉంటాయ్ అని కావ్య అంటుంది. ఛీఛీ.. నా లైఫ్ నా ఇష్టం. టైమ్ చూసుకుని అందరికీ నేనే నిజం చెబుతాను అని రాజ్ అంటే.. మీ లైఫ్‌తో నా లైఫ్ కూడా ముడి పడి ఉందని కావ్య అంటుంది. చెప్తాలే నన్ను ప్రశాంతంగా ఎక్సర్ సైజ్ చేసుకోనివ్వు అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్, కావ్యలు బయటకు వస్తారు. చూశారా మా బావకు ఎన్ని విషయాలు తెలుసో.. జీనియస్ అని అంటుంది కావ్య. ఎంత ఇచ్చాడు.. మీ బావగాడిని పొగడటానికి అని రాజ్ అంటాడు. మిమ్మల్ని కూడా పొగుడుతున్నా.. మీరేం ఇస్తున్నారు విడాకులు తప్పా అని కావ్య అంటుంది. ఏయ్ అరవకు అందరూ వింటారు అని రాజ్ అంటాడు. కానీ బావ వింటేనే.. భయం. మా అమ్మా నాన్నల దగ్గరకు వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు అని కావ్య అంటాడు. పోనీ మీ బావతో చెప్పేశావా అని రాజ్ అంటే.. లేదు చెప్తాను అని కావ్య అంటుంది. నేనే చెప్తాను నువ్వు కంగారు పడకు అని అంటాడు రాజ్.
రేయ్ ఏం చేస్తున్నావ్‌రా.. అని అరుచుకుంటూ వెళ్తాడు రాజ్. బామ్మగారికి స్పాండిలైటిస్ ఉందంట సెట్ చేస్తున్నా అన్నియ్యా అని భాస్కర్ అంటాడు. ఏంటి తగ్గేది.. మా నాన్నమ్మ మెడ విరిచేసేలా ఉన్నాడు. ఉండు నేను చేస్తాను అని.. గట్టిగా పెద్దావిడ మెడను తిప్పేస్తాడు. ఆ నొప్పిరా.. ఆగు నేను వెళ్లి ఆస్పత్రికి వెళ్తానులే అంటుంది. ఆ తర్వాత భాస్కర్.. ఆసనాల గురించి అడుగుతాడు. ఆ అన్నీ నాకు తెలుసా అని చెప్తాడు రాజ్. సరే పద్మాసనం వేస్తాను అని అంటాడు. సరిగ్గా అప్పుడే.. వేసి ఒక్కసారిగా బిగుసుకుపోతాడు రాజ్. అది చూసి బాగుందని భాస్కర్ ఫొటోలు తీసుకుంటాడు. ఆ తర్వాత చాలు అంటూ రాజ్ అంటాడు. కానీ బావ వినడు.. ఇంతలో కావ్య చాలులే బావ అని అంటుంది. హమ్మయ్యా బతికించింది అని రాజ్ లేచి ఇంట్లోకి వెళ్లిపోతాడు. అందంతా చూసి పెద్దావిడ, పెద్దాయన నవ్వుతారు. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.