Brahmamudi, April 24th episode: శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..

|

Apr 24, 2024 | 10:40 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అదేంటి? ఇంటికి వారసుడు పుడితే అలా చడీ చప్పుడు లేకుండా చేశారు. ఎందుకు ఇంత సీక్రెట్‌గా మెయిన్ టైన్ చేశారు? చప్పండి మేడమ్ మీ మనవడి గురించి ఎందుకంత రహస్యంగా ఉంచారు? బయట ప్రపంచానికి తెలీకుండా ఎందుకు ఉంచారు? అని మీడియా ప్రశ్నిస్తుంది. దీంతో అందరూ అయోమయంలో ఉంటారు. ఈ బిడ్డ నా కూతురికి పుట్టలేదని ఇప్పుడే చెప్పేస్తాను అని కనకం మనసులో అనుకుని..

Brahmamudi, April 24th episode: శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అదేంటి? ఇంటికి వారసుడు పుడితే అలా చడీ చప్పుడు లేకుండా చేశారు. ఎందుకు ఇంత సీక్రెట్‌గా మెయిన్ టైన్ చేశారు? చప్పండి మేడమ్ మీ మనవడి గురించి ఎందుకంత రహస్యంగా ఉంచారు? బయట ప్రపంచానికి తెలీకుండా ఎందుకు ఉంచారు? అని మీడియా ప్రశ్నిస్తుంది. దీంతో అందరూ అయోమయంలో ఉంటారు. ఈ బిడ్డ నా కూతురికి పుట్టలేదని ఇప్పుడే చెప్పేస్తాను అని కనకం మనసులో అనుకుని.. ఆపండి అని కనకం అంటుంది. చూడండి.. మేము కళ్యాణం జరిపించడానికి వచ్చాం. ఆ ముహూర్తం దాటిపోయేలా ఉంది రండి.. అందరూ వెళ్దాం అని కావ్య అంటుంది. ఒక్క నిమిషం మేడమ్ మీరు ఏదో దాచాలని చూస్తున్నారు అదేంటి? అని మీడియా ప్రశ్నిస్తుంది. ఇది మా పర్సనల్ విషయం. అందరికీ చెప్పాల్సిన పని లేదని కావ్య అందర్నీ లోపలికి తీసుకెళ్తుంది. చివరిలో రాహుల్ లోపలికి వెళ్తూ మీడియాకు సైగ చేస్తాడు.

కనకానికి తెలిసిపోయిన నిజం..

ఆ తర్వాత కనకాన్ని పక్కకు తీసుకొచ్చి.. సర్ది చెప్తుంది. రాజ్ చేసిన తప్పును నువ్వెందుకు? దాస్తున్నావ్? ఆయన చేసింది.. నువ్వు చేసిది తప్పే అని కనకం అంటే.. అసలు మేము తప్పే చేయలేదు అమ్మా.. ఆ బిడ్డ ఆయన బిడ్డే కాదని కావ్య అంటే.. ఏంటక్కా నువ్వు అనేది అని అప్పూ అంటుంది. ఆ బిడ్డకు, ఆయనకు అసలు ఏ సంబంధం లేదని కావ్య చెప్తుంది. సంబంధం లేనప్పుడు ఎందుకు ఇంటికి తీసుకొచ్చాడు? అని ప్రశ్నిస్తుంది కనకం. అదే కావ్య తెలుసుకునే పనిలో ఉంది. రాజ్ ఏదో నిజాన్ని దాచాడు అంతే అని పెద్దావిడ చెప్తుంది. అమ్మమ్మ గారూ ఆ విషయం పక్కన పెట్టండి. మీరెందుకు అందరి ముందూ మా చేత కళ్యాణం చేపిస్తామని చెప్పారు. అని కావ్య అడుగుతుంది. నాకూ అదే మంచిది అనిపించింది. ఆ సీతారాముల్లానే మీరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కడవరకూ కలిసి ఉండాలని నా కోరిక అని ఇందిరా దేవి అంటుంది. ఆ తర్వాత కనకం క్షమించమని అడుగుతుంది.

అనామికను ఎరగా వాడిన రుద్రాణి.. సీన్ కట్ చేస్తే..

ఈ సీన్ కట్ చేస్తే.. అనామికను రెచ్చగొట్టేలా ప్లాన్ చేస్తుంది రుద్రాణి. అనామిక దగ్గరకు వెళ్లి.. ఏంటి దణ్ణం పెట్టుకున్నావా? అని అడుగుతుంది. అవును ఆంటీ ఎప్పటి నుంచో సీతా రాముల కళ్యాణం చూడాలి అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అవకాశం దక్కిందని అనామిక అంటుంది. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. అదే కళ్యాణం నువ్వూ, కళ్యాణ్ కలిసి చేస్తే ఎంత గొప్పగా ఉండేదో తెలుసా? అని రుద్రాణి అంటుంది. మా చేతుల మీదుగానా అని అనామిక ఆశ్చర్యపోతుందా? ఇప్పుడు దొరికింది కదా అవకాశం.. ఇంకెందుకు లేట్ వెళ్లు అని రుద్రాణి అంటుంది. మంచి అవకాశమే దక్కింది. ఆ కళ్యాణం మా చేతుల మీదుగా జరిగేలా చూస్తాను అని అనామిక ఆవేశంతో లోపలికి వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

అనామిక రచ్చ.. శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను అన్న కళ్యాణ్..

దేవుడికి బట్టలు సమర్పిస్తుండగా.. అనామిక వచ్చి.. బావగారికి ఈ కళ్యాణం జరిపించే అర్హత ఉందా? అమ్మమ్మగారూ.. ఇంటికి పెద్ద కొడుకు అయినంత మాత్రాన అర్హత ఉన్నట్టేనా? అని అడుగుతుంది. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. అంతే కానీ మా అన్నయ్య అర్హత గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కళ్యాణ్ అంటాడు. శ్రీరాముడు అంటేనే ఏక పత్నీ వ్రతుడు. అలాంటి ఆదర్శ పురుషుడికి కళ్యాణం జరిపించాలంటే.. జరిపించే వాళ్లు కూడా అలాగే ఉండాలి కదా అని అంటుంది అనామిక. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా.. మనం తర్వాత మాట్లాడదాం అని కళ్యాణ్ అంటాడు. తర్వాత ఏమీ మాట్లాడటానికి ఉండదు. వడపప్పు, పానకం తీసుకోవడం తప్ప. బావగారు ఇంకో అమ్మాయితో బిడ్డను కన్నారు కదా.. వారి చేతుల మీదుగా కళ్యాణం ఎలా జరిపిస్తారు? అని అనామిక అంటుంది. అనామికకు తోడుగా ధాన్య లక్ష్మి కూడా సై అంటుంది. ఈ కళ్యాణం జరిపించే అర్హత నాకూ నీకు మాత్రమే ఉంది. కాబట్టి మనమే పీటల మీద కూర్చోవాలి అని అంటుంది. దీంతో అనామికకు గట్టి వార్నింగ్ ఇస్తుంది స్వప్న.

అనామికకు ఇచ్చి పడేసిన ఇందిరా దేవి, కనకంలు..

ఇక ఆపండి అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఇలాంటివన్నీ ఇంటి దగ్గర చూసుకోకుండా.. గాడిదలు కాసారా? ఇక్కడికి వచ్చి పంచాయితీ పెట్టారు? అని అపర్ణ అంటుంది. ఇంటి దగ్గర ఈ విషయం గురించి మాట్లాడలేదు కదా అత్తయ్యా.. ఇక్కడికి వచ్చాక తెలిసింది. అందుకే మాట్లాడుకోవాల్సి వచ్చిందని అనామిక అంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడాల్సింది. పెద్దవాళ్లు అనే మర్యాద లేకుండా అందరితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావ్. ఏం తెలుసు నీకు? మా అల్లుడి ఇంకో భార్యను చూశావా? లేక పోతే నువ్వే దగ్గరుండి పెళ్లి చేశావా? ఫొటోలు ఏవి? సాక్ష్యాలు ఏవి తీసుకురా. అసలు ఏం జరిగిందో.. ఇక్కడున్న ఎవరికైనా తెలుసా? నువ్వెంత? నీ లెక్క ఎంత? ఉంటే ఉండు.. పోతే పో.. ఏం చేసుకుంటో చేసుకో వెళ్లు అని కనకం వార్నింగ్ ఇస్తుంది. రాజ్, కావ్యలు మీరు బట్టలు పెట్టండి అని ఇందిరా దేవి అంటే.. అమ్మమ్మగారూ.. అని అనామిక అంటుంది. ఇంకొక్క మాట మాట్లాడితే లాగి పెట్టి ఒక్కటి ఇస్తాను. కళ్యాణానికి ఎవరెవరు అడ్డు పడతారో వాళ్లను తిరిగి ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని పెద్దావిడ అంటుంది. ఆ తర్వాత కళ్యాణం ప్రశాంతంగా పూర్తి అవుతుంది.

రుద్రాణికి ఇచ్చి పడేసిన కనకం..

ఆ తర్వాత మీడియా వాళ్లకు కాల్ చేసి.. రాజ్ బిడ్డ గురించి అడగమని, వదిలి పెట్టొద్దని రాహుల్ అడుగుతాడు. మీడియా అమ్మాయి ఫోన్‌లో మాట్లాడేది అంతా అప్పూ వినేస్తుంది. వెంటనే కళ్యాణ్‌కు చెప్పడానికి వెళ్తుంది. ఆ తర్వాత కనకం దగ్గరకు వచ్చి.. రుద్రాణి కావాలనే పుల్లలు పెట్టాలని చూస్తుంది. కానీ అక్కడ కనకం కదా.. అసలు ఏమీ లెక్క చేయదు. వెంటనే రుద్రాణికి రివర్స్ వార్నింగ్ ఇచ్చి పడేస్తుంది కనకం. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.