ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాజ్ ని ఓ ఆట ఆడుకుంటుంది కావ్య. నేను నీకు సారీ చెప్పాలా అని రాజ్ అడిగితే.. ఇంకెవరు చెప్తారు. కిన్నెర కింపురుషులు వచ్చి సారీ చెప్తారా.. పెళ్లానికి మొగుడే కదా సారీ చెప్పాలి అని కావ్య అంటుంది. ఏయ్ ఎప్పుడో చేసినదానికి.. ఇప్పుడు సారీ బోర్డు పెట్టి.. పరువు తీసుకుని అందరి ముందు చులకన అయిపోయి ఇంత చేస్తానని ఎలా అనుకున్నావ్? అవును మీరు ఇలా చేస్తారని కళ్లో కూడా అనుకోలేదు. ఎలా చేశారని ఏమీ తెలియనట్టు క్యూట్ గా అడుగుతుంది కావ్య. ఏయ్ ఓవరాక్షన్ చేశావంటే చంపేస్తాను అని రాజ్ అంటే.. ఆ తర్వాత నా సమాధి దగ్గర సారీ బోర్డు పెడతారా అని కావ్య అడుగుతుంది. అబ్బా ఏంటే ఈ డ్రామా అని రాజ్ తల బాదుకుంటాడు.
నా నాటకం ఎలా ఉంటుందో శాంపిల్ చూపించా: కావ్య
నాటకం.. ప్రేమ నాటకం.. నేను నటిస్తే ఎలా ఉంటుందో.. నమూనా ఎలా ఉంటుందో చూపించాను. నిన్నమొన్నటిదాకా కత్తులు ఏమీ లేకుండానే మాటలతో యుద్ధం చేసుకున్నాం. బాణాలు లేకుండానే అస్త్రాలు సంధించుకున్నాం. అత్తారింట్లోకి ఆడ పిల్ల.. అభిమన్యుడిలా అడుగు పెట్టాలి. అక్కడ ఏం సమస్య వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఎటు నుంచి ఎవరు మా పైకి వస్తారో తెలీదు. ప్రతి రోజూ ఒక కురుక్షేత్రం చేస్తూ ఉంటే.. కర్ణుడిలా ఒంటరి పోరాటం చేస్తూ.. కాస్త ఆదమరిచి ఉన్నా.. ఎటు నుంచి ఏ ఆయుధం గుండెల్ని చీలుస్తుందోనని భయంగా ఉంది. ఇక్కడ అడుగు పెట్టిన ఇన్ని రోజుల్లో నా కాపురం కురు క్షేత్రమే అయింది. యుద్ధమే అయింది. ఇంటి కోడలికి ఏ కవచాలూ ఉండవు. సున్నితమైన హృదయమే ఉంటుంది.
సారీ రాసినందుకు రాజ్ కి సారీ చెప్పిన కావ్య:
ఏ మాట పడ్డా గుండెల్ని చీలుస్తాయోమో.. పాతళ జలంలా అట్టడుగునే ఉండాలి. మాట పెదవి దాటి రాకూడదు. అడుగు గడప చాటున ఉన్నా.. నా జీవితాన్ని కథలు కథలుగా రాస్తుందని నా వ్యక్తిత్వాన్ని, నా ఉనికి ఇక్కడే సమాధి చేసుకుంటున్నా. నేను ఏ తప్పూ చేయలేదు. ఒక నిజం దాచాను. కానీ అది మీ దృష్టిలో తప్పు. మీ అమ్మ గారి దృష్టిలో నేరం. నాతో నేను.. నా ఉనికి కోసం నేను యుద్ధం చేసుకోవాలి. ఈ ఇంటి పెద్దకు అనారోగ్యం వచ్చింది. అందరూ ఆయన్ని సంతోషంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. అందుకే మీకు నా మీద ప్రేమ ఉన్నట్టు.. మీతో పాటు నేనూ నటించాల్సి వచ్చింది. మీ ప్రమేయం లేకుండా సారీ రాసినందుకు సారీ చెప్తుంది కావ్య. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోతుంది కావ్య. కావ్య చెప్పిన దానికి రాజ్ కి బుర్ర తిరుగుతుంది.
స్వప్నని ఇరికించేసిన రాహుల్, అరుణ్ లు:
ఈ సీన్ కట్ చేస్తే స్వప్నపై మరో ఎత్తు వేసేందుకు రాహుల్, రుద్రాణిలు ఎదురు చూస్తూ ఉంటారు. డెలివరీ బాయ్ రాలేనందుకు అరుణ్ కి కాల్ చేసి కనుక్కుంటాడు రాహుల్. ఫొటోలు పంపించేశానని అరుణ్ చెప్తాడు. అప్పుడే హాలులో అపర్ణ, ధాన్య లక్ష్మి, ఇందిరా దేవి కూర్చుంటారు. అప్పుడే డెలివరీ బాయ్ వస్తాడు. ధాన్య లక్ష్మి వెళ్లి కొరియర్ తీసుకుంటుంది. ఏంటా కొరియర్ చూడమంటుంది అపర్ణ. ఇది దుగ్గిరాల ఫ్యామిలీకి వచ్చిందని ధాన్య లక్ష్మి చెప్తుంది. సరే ఓపెన్ చేయ్ అని అపర్ణ అంటే.. కుక్కర్ విజిల్ రావడంతో ధాన్య లక్ష్మి కిచెన్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత అపర్ణని సుభాష్ పిలవడంతో గదిలోకి వెళ్తుంది. నెక్ట్స్ ఇందిరా దేవి ఓపెన్ చేస్తుంది. ఆ ఫొటోలు ఓపెన్ చేసి చూసిన ఇందిరా దేవి షాక్ అవుతుంది.
అరుణ్ ఎవరు అని స్వప్నని అడిగిన ఇందిరా దేవి:
ఎవరు ఇతను ఇంత చనువుగా స్వప్నతో ఫొటోలు దిగాడు. అసలు ఎవరు పంపించారు? ఏ ఉద్దేశంతో పంపించారని ఇందిరా దేవి మనసులో అనుకుంటుంది. దీంతో స్వప్న రూమ్ కి వెళ్లి అడుగుతుంది ఇందిరా దేవి. పెద్దావిడను చూసిన స్వప్న.. ఎందుకు మీరు పైదాకా వచ్చారు. కావ్యతో కబురు పంపించి ఉంటే నేనే వచ్చేదాన్ని కదా అని స్వప్న అంటే.. ఇది నలుగురిలో అడిగే విషయం కాదు.. నాలుగు గోడల మధ్య అడిగే విషయం అని అంటుంది. ఆ తర్వాత ఫొటోలు చూపించి.. ఇతను ఎవరు? అని అడుగుతుంది ఇందిరా దేవి. ఆ ఫొటో చూసిన స్వప్న షాక్ అవుతుంది. ఇతను ఎవరు? నీకు తెలుసా? అని అడుగుతుంది పెద్దావిడ. ఎవరు అసలు ఈ అబ్బాయి? నాకు ఎందుకు చూపిస్తున్నారు? అని స్వప్న అడుగుతుంది. దీంతో అయోమయంలో పడుతుంది ఇందిరా దేవి. ఇదంతా చూస్తున్న రాహుల్, రుద్రాణిలు కంగారు పడుతూ ఉంటారు. తాతయ్య ఆరోగ్యం బాగోలేక గొడవ చేయడం ఇష్టం లేక అలా సైలెంట్ గా వెళ్లి పోయిందేమో. ఏదైనా ఇది కూడా ఒక మంచికే. మా అమ్మకి ఇంకొంచం అనుమానం వచ్చేలా చేస్తే సరి పోతుందని రుద్రాణి అంటుంది.
అప్పూ ప్రేమ విషయం కనకానికి తెలిసిపోయింది:
ఆ తర్వాత అరుణ్ కి కాల్ చేస్తుంది స్వప్న. అసలు ఈ ఫొటోలు ఎవరు పంపించారు? వాడే పంపించి ఉంటాడని? స్వప్న ఆలోచిస్తుంది. ఈలోపు కనకం అప్పూ బెడ్ సర్దుతుంది. అప్పుడే కళ్యాణ్ ఫొటో కనిపిస్తుంది. అది చూసి కనకం షాక్ అవుతుంది. అప్పూ అని కోపంగా పిలుస్తుంది కనకం. అప్పూని పట్టుకుని చెడామడా కొట్టేస్తుంది కనకం. మధ్యలో కనకాన్ని వాళ్ల అక్క ఆపుతుంది. ఇంకా నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొనాలే.. ఇంకా ఎంత ముందు దోషిలా నిలబడాలి. ఎంత మందితో మాటలు పడాలి? చెప్పూ అని బాధ పడుతుంది కనకం. చూడు.. ఇది ఆ కళ్యాణ్ బాబుని ప్రేమిస్తుంది తెలుసా అని చెప్తుంది. నాకు ముందే తెలుసని కనకం వాళ్ల అక్క చెబుతుంది.
ఇప్పటికే వాళ్లతో మాటలు పడుతున్నా.. ఇప్పుడు ఇది కూడా తయారైంది:
ఇది విన్న కనకం షాక్ అవుతుంది. నీకు ముందే తెలుసా.. నాకు ఎందుకు చెప్పలేదు. ఈ నిజం తెలిసి కూడా దాన్ని అలానే వదిలేస్తామా.. ఏం చేస్తామే అది కూడా ఆడపిల్లే కదా.. దానికి కూడా ఒక మనసు ఉంటుంది కదా.. ఇప్పటికే నన్న వాళ్లు పురుగును చూసినట్టు చూస్తున్నారు. వాళ్లు అసలు నన్ను బతకనిస్తారా అని కనకం బోరున విలపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఏం జరుగుతుందో.. పెద్దది చేసే తప్పులకు.. చిన్నది ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలిసి కూడా ఇది ఆ ఇంటి అబ్బాయిని ఎలా ప్రేమిస్తుంది అక్కా? అని అప్పూపై చేయి చేసుకుంటుంది కనకం. అప్పుడే కనకం అని గట్టిగా అరుస్తాడు కృష్ణ మూర్తి. ఏంటే ఏమైంది ఎందుకు కొడుతున్నావ్ అని కృష్ణ మూర్తి అడిగితే.. కనకం ఏమీ లేదని చెప్పి వెళ్లి పోతుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.