Brahmamudi, January 4th episode: అదే సీన్ రిపీట్.. కావ్య కొంప కొల్లేరుకానుందా..!

కళ్యాణ్, అనామిక పెళ్లి తర్వాత దుగ్గిరాల ఇంట్లో ఏదో ఒక రచ్చ కొనసాగుతూనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా కావ్యని, కృష్ణమూర్తి ఫ్యామిలీని అవమానిస్తూనే ఉంటున్నారు. ఇంట్లో వాళ్లందరూ కావ్యపై ఎటాక్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ధాన్య లక్ష్మి.. సూటి పోటి మాటలతో కావ్యపై సైటర్లు వేస్తుంది. దీంతో కావ్య బాధ పడుతుంది. మరోవైపు అపర్ణ కూడా కావ్య ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు రుద్రాణి.. అనామిక, కావ్యల మధ్య ఎలా చిచ్చు..

Brahmamudi, January 4th episode: అదే సీన్ రిపీట్.. కావ్య కొంప కొల్లేరుకానుందా..!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Jan 05, 2024 | 10:26 AM

కళ్యాణ్, అనామిక పెళ్లి తర్వాత దుగ్గిరాల ఇంట్లో ఏదో ఒక రచ్చ కొనసాగుతూనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా కావ్యని, కృష్ణమూర్తి ఫ్యామిలీని అవమానిస్తూనే ఉంటున్నారు. ఇంట్లో వాళ్లందరూ కావ్యపై ఎటాక్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ధాన్య లక్ష్మి.. సూటి పోటి మాటలతో కావ్యపై సైటర్లు వేస్తుంది. దీంతో కావ్య బాధ పడుతుంది. మరోవైపు అపర్ణ కూడా కావ్య ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు రుద్రాణి.. అనామిక, కావ్యల మధ్య ఎలా చిచ్చు పెట్టాలా అని వెయిట్ చేస్తుంది. అలాగే అనామిక కూడా కావ్యపై కన్నింగ్ ప్లాన్స్ రెడీ చేస్తుంది.

రాజ్, శ్వేతలను చూసేసిన కావ్య..

ఇక ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌కి కాల్ చేసిన శ్వేత అర్జెంట్‌గా కలవాలని అంటుంది. దీంతో రాజ్ ఆఫీస్‌కి వెళ్లాలి అని అబద్ధం చెప్పి హడావిడిగా బయలు దేరతాడు. ఇదంతా కావ్య గమనిస్తాడు. ఏంటండీ అంత హడావిడిగా బయలు దేరుతున్నారు అని అడుగుతుంది. ఆఫీసులో ఏదో మీటింగ్ ఉంది. అర్జెంట్‌గా వెళ్లాలి అని చెప్పి వెళ్లిపోతాడు. బయట ఓ ఐస్ క్రీమ్ బండి దగ్గర శ్వేత, రాజ్‌లు కలిసి.. మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కావ్య ఏదో పని మీద బయటకు వెళ్తుంది. సరిగ్గా అప్పుడే రాజ్, శ్వేతలు ఐస్ క్రీమ్ తింటూ, కబుర్లు చెప్పుకుంటూ క్లోజ్‌గా ఉండటం కావ్య చూసేస్తుంది. వాళ్లిద్దర్నీ చూసిన కావ్య షాక్ అవుతుంది.

చిరాకుగా ఫోన్ పెట్టేసిన రాజ్..

ఆఫీస్‌కు అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ పక్కన ఆ అమ్మాయి ఎవరు? మా ఆయనతో చనువుగా ఉందేంటి అని కంగారు పడుతుంది. వెంటనే రాజ్‌కి కాల్ చేస్తుంది కావ్య. ఫోన్ రావడంతో రాజ్ కంగారు పడతాడు. భయంగా ఫోన్ ఎత్తి హలో అంటాడు. ఎక్కడ ఉన్నారు? అని కావ్య అడుగుతుంది. ఇదేమీ తెలియని రాజ్.. ఆఫీస్‌లోనే ఉన్నాను. ఏంటి అని అడుగుతాడు. అయితే ఆఫీస్‌లోనే ఉన్నాను అంటారా.. అని కావ్య అడిగితే.. ఆఫీస్‌లోనే ఉన్నాను అని చెప్తాడు. మరి ఏంటి ఆ సౌండ్స్ అని కావ్య అడిగితే.. అద్దం పైకి ఎత్తి మాట్లాడుతున్నా అని చిరాకుగా ఫోన్ పెట్టేస్తాడు రాజ్.

ఇవి కూడా చదవండి

కావ్య నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

దీంతో కావ్య బాధగా కాల్ కట్ చేస్తుంది. రాజ్, శ్వేతలను అలానే చూస్తుంది. ఈయన ఏంటి నాకు అబద్ధం చెబుతున్నారు. ఆ అమ్మాయి ఎవరు? అని ఆలోచనలో పడుతుంది కావ్య. మరి వీరిద్దర్నీ చూసిన కావ్య.. రాజ్‌ని నిలదీస్తుందా.. శ్వేత ఎవరు అని రాజ్‌ని అడుగుతుందా? లేక రాజ్ ఏదో రహస్యం దాస్తున్నాడని.. గమనిస్తూ ఉంటుందా.. ఏం జరుగుతుందో.. సీరియల్‌లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాలి.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో…

కళ్యాణ్ చెప్పిన డేర్‌ ప్రకారం.. కావ్యకి ఐలవ్యూ చెప్పి ముద్దు పెడతాడు రాజ్. దీంతో కావ్య షాక్ అవుతుంది. ఇదంతా చూస్తున్న అపర్ణ కుళ్లుకుంటూ.. లోలోపలే ఆవేశ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ పడుకుంటారు. రాత్రి నిద్ర మధ్యలో లేచిన కళ్యాణ్.. అనామికను లేపి బయటకు తీసుకెళ్తాడు. వాళ్లిద్దరి పైన దుప్పటి ముసుగు వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లను గమనించిన ఇంట్లోని వాళ్లు బయట కూర్చుంటారు.

ఈ లోపు కళ్యాణ్.. ఇంట్లో వాళ్ల గురించి అనామికకు చెప్తూ ఏదో ఒకటి అంటాడు. ఇది వింటున్న ఇంట్లోని వాళ్లు తిట్టుకుంటారు. సరిగ్గా అనామికకు కళ్యాణ్ ముద్దు పెడుతున్న సమయంలో రుద్రాణి.. రేయ్ ఇంకెంత సేపురా.. త్వరగా పెడితే మేము వెళ్లి పడుకుంటాం అని రుద్రాణి అంటుంది. దీంతో కొత్త జంట అవాక్కై దుప్పతి తీసి.. బిత్తర పోతారు. నెక్ట్స్ అందరూ పడుకుని లేస్తారు.

ఉదయం కిచెన్‌లో అందరికీ టీ పెడుతుంది అనామిక. అప్పుడే వచ్చిన కావ్య.. అయ్యో నీకెందుకు శ్రమ నేను పెడతానులే అనామిక అంటుంది. కానీ వినిపించుకోని పొగరబోతు.. కావ్యపై అనవసరంగా నోరు పారేసుకుంటుంది. అయినా కావ్య పట్టించుకోదు. అప్పుడే వచ్చిన రుద్రాణి, ధాన్య లక్ష్మిలు మురిసిపోతారు. కావాలనే కావ్య పుట్టింటిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది రుద్రాణి. నెక్ట్స్ అనామిక కాఫీ లాంటి టీ పెడుతుంది. అది తాగిన అందరూ బిత్తరపోతారు. కళ్యాణ్ వచ్చి అసలు విషయం చెప్తాడు. దీంతో అనామిక కూడా తాగి.. ఛీ ఛీ ఇలా ఉందేంటి అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య వెళ్లి మళ్లీ కాఫీ పెడుతుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!