Brahmamudi, December 26th episode: పద్మావతికి గాజులు వేయమన్న కావ్య.. షాక్ లో విక్కీ.. మురళి ఏం చేస్తాడో!

|

Dec 26, 2023 | 10:04 AM

'మహా సంగ్రామం' ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రాజ్, విక్రమ్ ల మనసు మార్చాలని కావ్య, పద్దూ ట్రై చేస్తూ ఉంటారు. మరో వైపు అరుణ్ గురించి తెగ భయ పడుతూ ఉంటుంది స్వప్న. ఎక్కడ వచ్చి గొడవ చేస్తాడో.. అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు కళ్యాణ్.. అప్పూపై ప్రేమ చూపిస్తుంటే.. అనామిక, తన తల్లిదండ్రులు చిరాకు పడుతూ ఉంటారు. అనామిక పేరెంట్స్ గురించి తెలుసుకున్న అప్పూ కూడా భయం భయంగా ఉంటుంది. స్వప్నని ఇరికించాలని రాహుల్, రుద్రాణిలు, పద్మావతిని దక్కించుకోవాలని మురళి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు..

Brahmamudi, December 26th episode: పద్మావతికి గాజులు వేయమన్న కావ్య.. షాక్ లో విక్కీ.. మురళి ఏం చేస్తాడో!
Brahmamudi
Follow us on

‘మహా సంగ్రామం’ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రాజ్, విక్రమ్ ల మనసు మార్చాలని కావ్య, పద్దూ ట్రై చేస్తూ ఉంటారు. మరో వైపు అరుణ్ గురించి తెగ భయ పడుతూ ఉంటుంది స్వప్న. ఎక్కడ వచ్చి గొడవ చేస్తాడో.. అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు కళ్యాణ్.. అప్పూపై ప్రేమ చూపిస్తుంటే.. అనామిక, తన తల్లిదండ్రులు చిరాకు పడుతూ ఉంటారు. అనామిక పేరెంట్స్ గురించి తెలుసుకున్న అప్పూ కూడా భయం భయంగా ఉంటుంది. స్వప్నని ఇరికించాలని రాహుల్, రుద్రాణిలు, పద్మావతిని దక్కించుకోవాలని మురళి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి.

గాజులు తెప్పించిన ఇందిరా దేవి..

ఇక ఇవాళ్టి ఎపిసోడ్ లో కళ్యాణ్, అనామికల పెళ్లి సందర్భంగా ఇందిరా దేవి గాజులు తెప్పింది. ఎంత పెళ్లి అయితే మాత్రం ఇన్ని గాజులు తెప్పించారేంటి? అత్తయ్యా అని కుచల కుమారి అడుగుతుంది. ఆడపడుచుల సౌభాగ్యం కోరుకునేది అన్నదమ్ములే కదా.. పెళ్లిలో ఆడపడుచులకు.. అన్నదమ్ములు గాజులు వేస్తే చాలా మంచిది. వారు కూడా ఎంతో సంతోషిస్తారని పెద్దావిడ చెబుతుంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు వచ్చి వరుసకు చెల్లి అయిన వాళ్లకు గాజులు తొడుగుతారు.

పద్మావతికి గాజులు వేయమన్న కావ్య.. షాక్ లో మురళి..

అదే విధంగా మురళి కూడా వచ్చి.. అనామికకు కూడా గాజులు వేస్తాడు. ఈ లోపు కావ్య అన్నయ్యా.. అని గట్టిగా పిలుస్తుంది. ఇంత ముఖ్యమైన చెల్లిని మర్చిపోతే ఎలా అన్నయ్యా అని అంటుంది. పద్మావతికి కూడా గాజులు తొడగండి అని అరవింద కూడా అంటుంది. దీంతో మురళి బిగుసుకు పోయి నిల్చుంటాడు. పద్మావతి.. మురళి వైపు కోపంగా చూస్తుంది. ఇలా ఏం జరుగుతుందా అని ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ‘మహా సంగ్రామం’ ఎపిసోడ్.

ఇవి కూడా చదవండి

నిన్నటి ఎపిసోడ్ లో..

ఇక సోమవారం ఎపిసోడ్ లో.. మొత్తానికి అరుణ్ ని పట్టుకుంటారు. ఈలోపు అరుణ్ జారుకోబోతుంటే కనకం వచ్చి కర్రతో ఒక్కటి ఇస్తుంది. దీంతో స్పృహ తప్పి పడిపోతాడు అరుణ్. ఈ సీన్ లన్నీ ఎంతో కామెడీగా ఉంటాయి. ఆ తర్వాత తాగుబోతు సన్నీ కూడా లేడీస్ కి హెల్ప్ చేస్తాడు. మొత్తానికి అరుణ్ ని కట్టి పడేస్తారు. ఆ నెక్ట్స్ మందు కోసం తహతహలాడుతూ వెయిట్ చేస్తూ ఉంటారు సుభాష్ గ్యాంగ్. వాళ్లకు తాగుబోతు సన్నీ హెల్ప్ చేస్తాడు. మొత్తానికి మందు దొరుకుతుంది. ఆ తర్వాత మాక్ టైల్ అని మందు తాగుతారు రాజ్, విక్రమ్ లు. మరోవైపు అరుణ్ కనిపించడం లేదని.. మురళి, రాహుల్, రుద్రాణిలు వెతుకుతూ ఉంటారు.

అలాగే కావ్య, పద్మావతిలపై ఉన్న ప్రేమను బయట పెడతారు. పద్మావతి, కావ్యలు కూడా తన భర్తల ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పూకి మెహిందీ పెట్టడంపై కోపంగా ఉన్న అనామికను బుజ్జగించే పనిలో పడతాడు కళ్యాణ్. ఈలోపు మందు తాగి గదిలోకి వస్తారు రాజ్, విక్రమ్ లు. అలాగే కావ్య, పద్మావతిలు కూడా కోక్ అనుకుని మందు తాగుతారు. దీంతో రాజ్ – కావ్య, విక్రమాదిత్య – పద్మావతిలు కలిసి మంచాలపై చిందులు వేస్తారు. కావ్య తనలోని ఉన్న ప్రేమను రాజ్ కి చెప్తుంది. ఇక మత్తులో మాట్లాడి.. చిందులు వేసి పడుకుంటారు.