ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాజ్.. శ్వేతతో నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. రాజ్ కి తనకి ఏంటి సంబంధం? రాజ్ ఆ అమ్మాయిని ఇష్ట పడుతున్నాడా.. ఈ మధ్య కాలంలో కావ్య అడిగినదంతా చేస్తున్నాడని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రాజ్ ఫోన్ పెట్టేస్తాడు. సరిగ్గా అప్పుడే అపర్ణ వచ్చి ఎదురుగా నిల్చుంటుంది. సీరియస్ గా నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా.. అని అడుగుతుంది. దేని గురించి మమ్మీ మాట్లాడుతున్నావో అర్థం కాకే అడుగుతున్నా.. నేను ఏదో తప్పు చేస్తున్నట్టు అడుగుతున్నావ్ ఏంటి? అని రాజ్ అంటే.. తప్పు చేశావు కాబట్టే అడుగుతున్నా.. కావ్య విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావ్? నువ్వు చెప్పిన దానికి.. చేస్తున్న దానికి సంబంధం లేదని అపర్ణ అడుగుతుంది. నేను అప్పుడూ ఇప్పుడూ ఒకే మాట మీద ఉన్నా.. కళావతి నా జీవితంలో ఉండదుని తెగేసి చెప్తాడు రాజ్.
మరి ఎందుకు తనని వెనకేసుకు వస్తున్నావ్? గుడిలో, పెళ్లి కార్డు కాలిన విషయంలో ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తున్నావ్? అని అపర్ణ అడిగితే.. కళావతి తప్పు చేయలేదు కాబట్టే సపోర్ట్ చేశాను. అంత మాత్రాన తన మీద ప్రేమ ఉన్నట్టు కాదు కదా.. అని రాజ్ అంటాడు. కానీ మాకు అలా అనిపించ లేదు. భార్య కాబట్టి వెనకేసుకొచ్చావని అనిపిస్తుంది. మాకే అలా అనిపించిందంటే.. ఆ కావ్యకి అనిపించదా.. అది నిజమని అనుకుని నీ మీద ఆశలు పెట్టుకోదా? అని అపర్ణ అడిగితే.. లేదు మమ్మీ అలా అస్సలు జరగదు. నాకు ఎప్పటికీ కళావతి మీద ప్రేమ కలగదని రాజ్ అంటే.. కారణం అయితే నువ్వే కదా.. నీ హద్దుల్లో నువ్వు ఉండు. నీ మనసులో ఎలా అనిపిస్తుందో.. బయటకు కూడా అలానే నడుచుకోమంటున్నా అని అపర్ణ అంటుంది. అలా చేస్తే తాతయ్యకు మేము సఖ్యంగా లేమని.. ఆయన మనసు బాధ పడదా.. తాతయ్య ఆరోగ్యం భాగయ్యేంత వరకూ తనతో ఉంటాను. ఆ తర్వాత తను వెళ్లి పోతుంది. వెళ్లిపోయేలా నేను చేస్తానని అక్కడి నుంచి రాజ్ వెళ్లి పోతాడు. అంటే నా అనుమానం నిజమే. రాజ్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. కావ్యని వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది నిజమే అయితే.. నా కొడుకు సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదని అంటుంది అపర్ణ.
ఆ తర్వాత నువ్వూ నేను సీరియల్ లోని పద్మావతి, విక్రమాదిత్య కనిపిస్తారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తూంటాడు విక్రమ్. తనకి సపోర్ట్ చేస్తుంది పద్మావతి. ఇంతలో ఫారన్ నుంచి క్లయింట్స్ వస్తారు. నెక్ట్స్ కళ్యాణ్ కి ఒక తాయత్తు తీసుకొచ్చి కడుతుంది కావ్య. ఇదేంటి? వదినా అని కళ్యాణ్ అడుగుతాడు. ఈలోపు పై నుంచి కనకం కిందకు వస్తుంది. మీ మీద ఏ చెడు దృష్టీ పడకూడదని కడుతున్నా అని కావ్య అంటే.. నేను ఉండగానే ఆ మొక్క మాడి పోయిందని కావ్య చెప్తే.. ఆ మొక్క తీసేసి బయట పడేశారు కదా వదినా అని కళ్యాణ్ అంటాడు. అది విన్న కనకం షాక్ అవుతుంది. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలంటే ఆ దేవుడి దయ కూడా ఉండాలి అని అంటుంది కావ్య.
మీ తర్వాత నన్నూ.. నా కవి హృదయాన్ని అర్థం చేసుకుని నన్ను నన్నుగా ఇష్ట పడి.. నా జీవితంలోకి వెతుక్కుంటూ వచ్చిన మనిషి అనామిక. నన్ను అర్థం చేసుకుని.. నాతో పాటు జీవితం పంచుకోవడానికి వచ్చింది. కానీ ఎప్పుడు పంతులు గారు మాంగల్య దోషం ఉందన్నారో.. నా గుండె ఆగి పోయింది. కానీ అదృష్టం కొద్దీ అడ్డంకులు అన్నీ తొలిగిపోయాయి. ఒక వేళ ఈ పెళ్లి ఆగిపోయి ఉంటే.. జీవితాంతం ఒంటరిగా ఉండేవాడిని అని కళ్యాణ్ అంటాడు. ఇక కావ్య, కళ్యాణ్ ల మాటలు విన్న కనకం.. కళ్యాణ్ కూడా అనామికను ఇష్ట పడుతున్నాడని తెలిశాక కూడా ఈ పెళ్లి ఆపడం కరెక్ట్ కాదు అని మనసులో అనుకుంటుంది.
విక్కీని పద్మావతిని విడదీసేందుకు విక్కీ బావ కుట్ర..
అప్పుడే ఒకతను వచ్చి.. విక్రమాదిత్య బావకి కాల్ చేసి.. ఫార్నర్స్ తో మీట్ అయి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం టైఅప్ అవ్వబోతున్నారు. ఇప్పుడు దాన్ని ప్రజెంట్ చేస్తుంది పద్మావతి గారే.. ఇది ఒకే అయితే.. పద్మావతిని మెచ్చుకోవడమే కాదు.. ప్రేమని కూడా చూపుతాడు. అదే జరిగితే వాళ్లిద్దర్నీ ఎవ్వరూ విడదీయలేరని అతను చెప్తే.. విక్రమాదిత్య బావ అడ్డంకిగా ఉంటాడు.
మరోవైపు దుగ్గిరాల ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. పసుపు దంచడం మొదలు పెడతారు. పెళ్లికి ఎవరెవర్ని పిలవాలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే విక్రమాదిత్యకు వీడియో కాల్ చేస్తాడు రాజ్. అందరూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. కళ్యాణ్ పెళ్లికి పిలవడానికి ఫోన్ చేస్తారు. ఆ తర్వాత ఫోన్ లో పద్మావతితో కూడా మాట్లాడతారు. సరిగ్గా అప్పుడే మోడల్స్ ఫోన్ పని చేయడం లేదని పీఏ వచ్చి పద్మావతికి చెప్తుంది. దీంతో టెన్షన్ పడుతుంది పద్మావతి. అప్పుడే విక్రమాదిత్య వచ్చి.. ఏమైందని అడుగుతాడు. మోడల్స్ ఇంకా రాలేదు. వాళ్ల ఫోన్స్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని చెప్తుంది. దీంతో విక్రమ్.. పద్మావతిపై అరుస్తాడు. అప్పుడే పద్మావతికి ఓ ఐడియా వస్తుంది. వాళ్లిద్దరే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు గెటప్ లో రెడీ అవుతారు.
మరోవైపు రాహుల్.. రుద్రాణిపై సీరియస్ అవుతాడు. కళ్యాణ్, అనామికల పెళ్లి ఆపేస్తానని అన్నావ్.. ఏం చేస్తున్నావ్ అని తిడుతూ ఉంటాడు. దీంతో రుద్రాణి ఒక ఐడియా వచ్చిందని చెప్తుంది. స్వప్న చేత ఈ పెళ్లి ఆపించాలి అని రుద్రాణి చెప్తే.. స్వప్న ఎందుకు ఈ పెళ్లి ఆపుతుందని రాహుల్ అడుగుతాడు. స్వప్న ఆగక పోవచ్చు.. కానీ స్వప్న వల్ల పెళ్లి ఆగిపోతే.. వెంటనే ఆ అరుణ్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అంటుంది. అరుణ్ పెళ్లి మండటంలోకి వచ్చి స్వప్న కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే అని చెప్తే.. గొడవ అవుతుంది. ఆ చిన్న గొడవని పెద్ద గాలి వానగా మార్చి.. ఆ స్వప్న వల్లే పెళ్లి ఆగిపోయేలా చేస్తాను.
ఈలోపు అప్పూ.. కళ్యాణ్ ఫొటో చూస్తూ బాధ పడుతుంది. ఇదంతా బంటీ కిటికీలో నుంచి చూస్తాడు. సరిగ్గా అప్పుడే కృష్ణ మూర్తి అప్పూని పిలుస్తాడు. ఎల్లుండి కళ్యాణ్ పెళ్లి రిసార్ట్ లో జరుగుతుందట. మనందరం రావాలని పెద్దాయన చెప్పారట అని కృష్ణ మూర్తి అంటే.. నువ్వు వెళ్లు నాన్న.. నేను రాను అని చెప్తుంది. నేనేం చేసుకోనులే నాన్న.. అని చెప్తుంది. నీకు ఆరోగ్యం బాగోలేదని తెలిస్తేనే ఇంటికి వచ్చి హడావిడి చేశాడు. నువ్వు పెళ్లి రాలేదని తెలిస్తే ఊరుకుంటాడా. పెళ్లి ఆపైనా సరే నువ్వు వచ్చేంత వరకూ ఎదురు చూస్తాడని.. అప్పూకి నచ్చజెప్తాడు కృష్ణ మూర్తి. సరే అని చెప్తుంది అప్పూ. ఈలోపు బంటీ.. నీ ప్రేమ విషయం కళ్యాణ్ కి చెప్పేస్తాను అని అంటాడు. దీంతో సీరియస్ అయిన అప్పూ.. పనోడివి పనోడిలా ఉండు అని అంటుంది. దీంతో బంటీ ఫీల్ అయి.. నేను పనోడిని అయినా.. నువ్వు మాత్రం నాకు అక్కే అని అంటాడు. అదికాదురా ఇప్పుడున్న పరిస్థితి వేరు. నువ్వు మాత్రం ఈ పెళ్లికి రాకు అని చెప్తుంది అప్పూ.
ఇక క్లయింట్స్ ఏం చెబుతారా అని పద్మావతి, విక్రమాదిత్య వెయిట్ చేస్తారు. ఈలోపు క్లయింట్స్ వచ్చి.. మీకు త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుంది. ఇంకొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్పి వెళ్లి పోతారు. దీంతో విక్రమాదిత్య టెన్షన్ పడుతూ ఉంటారు. పద్మావతి.. విక్కీకి నచ్చజెప్తుంది. విక్కీ ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా అని సంతోష పడతాడు విక్కీ బావ. మీరు అనుకున్నవి జరగలేదని అక్కడున్న ఎంప్లాయి వచ్చి.. వాళ్లిద్దరూ కలిసి ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేశారని చెప్తాడు. దీంతో విక్కీ బావ కోపంతో రగిలి పోతూ ఉంటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.