ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో కారులో స్వప్న కోసం రాజ్, కావ్యలు వెళ్తూంటారు. స్వప్నకి ఏమైందో అని కావ్య కంగారు పడుతుంది. ఏమీ కాదు నువ్వేం కంగారు పడకు అంటాడు రాజ్. మరో వైపు వీర లెవల్ యాక్టింగ్ ఇరగ దీస్తాడు రాహుల్. ఇంజెక్షన్ వేసుకోను.. పాపం స్వప్న ఎంత బాధ పడుతుందో.. ఎలా ఉందో.. అంటూ కంగారు పడుతున్నట్టు నటిస్తాడు. ఈ లోపు సుభాష్ గొడవ చేసింది చాలు.. నీకోసమే కదా ఇంజెక్షన్ వేసుకోమంటున్నారు అని అంటాడు. కళ్లు తెరిస్తే నాకు స్వప్ననే కనిపిస్తుంది మావయ్య అని అంటాడు రాహుల్. అది కాదు నాన్న.. నీకోసమే కదా ఇంజెక్షన్ వేసుకో అని రుద్రాణి చెప్తుంది. ఎందుకు వేసుకోవాలి మమ్మీ.. నాకు స్వప్నని ఎత్తుకెళ్లి పోయిన సంఘటనే గుర్తుకు వస్తుంది. నన్ను నమ్మి వచ్చిన భార్యను గాలికి వదిలేసి నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. పాపం స్వప్న ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో.. అని రాహుల్ అంటాడు. కావ్య, రాజ్ లు స్వప్నను వెతకడానికి వెళ్లారు. పోలీసులు కూడా స్వప్న కోసం సెర్చ్ చేస్తున్నారు. స్వప్న తప్పకుండా దొరుకుతుందని చెప్తాడు సుభాష్. రాహుల్ సైగ చేయడంతో డాక్టర్.. సుభాష్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు.
మైఖేల్ ని ముప్పతిప్పలు పెట్టిస్తోన్న కననం.. బెండకాయతో పెళ్లి:
ఇక మైఖేల్ ని ముప్ప తిప్పలు పెట్టిస్తుంది కనకం. ఆ పూజా.. ఈ పూజా అని చెప్తూ భయంకరంగా మంత్రలు చదువుతూ ఉంటుంది. దీంతో మైఖేల్ ఒసేయ్ ముసలి.. అంత భయంకరంగా చదువుతున్నావేంటి.. కాస్త నవ్వుతూ చదవచ్చు కదా అని అంటాడు. దీంతో వెటకారంగా నవ్వుతూ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటుంది కనకం. ఆ తర్వాత మైఖేల్ వయసు అడుగుతుంది. నీ ముదిరిపోయిన వయసుకు.. ఈ పిల్ల కావాల్సి వచ్చిందా.. సరేలే నీకు బెండకాయతో ముందు పెళ్లి చేయాలి అని అంటుంది. బెండకాయతో పెళ్లేంటే ముసలి.. అని షాక్ అవుతాడు మైఖేల్. ఏదో చెప్పి కవర్ చేస్తుంది కనకం. దీంతో బెండకాయలు తీసుకు రావడానికి రౌడీలను పంపిస్తాడు మైఖేల్. కాదే ముసలి ఈ బెండకాయలతో పెళ్లి ఏంటి? అని అడుగుతాడు మైఖేల్. ఓరేయ్ పిచ్చోడా.. ఇలాంటి దోషాలు ఉంటే.. అప్పుడప్పుడు కుక్కలు, నక్కలకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇప్పటికిప్పుడు కుక్క లేదా నక్కని తీసుకు రాలేవు కదా.. అందుకే బెంకాయలు తెమ్మాన్న అని అంటుంది కనకం. ఆ తర్వాత బెండకాయకి తాళి కట్టిస్తుంది కనకం.
కావ్య, రాజ్ ల కోసం కనకం, స్వప్నల ఎదురు చూపు:
మరోవైపు రాజ్, కావ్యలు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటుంది కనకం. కరెక్ట్ గా వాళ్లు వచ్చే సమయానికి తాళి కట్టమని అంటుంది. మైఖేల్ తాళి కట్టేలోపు ఆపు అంటుంది కనకం. కంగారు పడకే ముసలి ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరు అని అంటాడు మైఖేల్. ఆపుతార్రా.. అదిగో నా కూతురు, అల్లుడు వచ్చారు అని చూపిస్తుంది. రాజ్, కావ్యలను చూసి షాక్ అవుతాడు మైఖేల్. కావ్యని చూసి వెంటనే స్వప్న.. పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అక్కా నేకేం కాలేదు కాదా అని కావ్య అడుగుతుంది. నాకేం కాలేదు.. రాహుల్ ఎలా ఉన్నాడు అని స్వప్న అడుగుతుంది. రాహుల్ బాగానే ఉన్నాడు నువ్వేం కంగారు పడకు అని చెప్తుంది కావ్య.
నిన్ను ఏం చేయమంటావ్ రా.. మైఖేల్ ని ప్రశ్నించిన రాజ్:
రేయ్ లాస్ట్ టైమ్ అయితే క్షమించమన్నావ్.. ఇప్పుడు నిన్ను ఏం చేయాలో చెప్పారా అని కూల్ గా.. మైఖేల్ ని అడుగుతాడు రాజ్. సర్ కొట్టకుండా వేరే ఏమన్నా ఆప్షన్ ఉంటే చెప్పండి సర్. అసలే నాకు కీళ్ల నొప్పులు.. లాఠీ పడదు సర్ అంటాడు మైఖేల్. అప్పుడే పోలీసులు కూడా ఎంట్రీ ఇస్తారు. ఓరేయ్ పదా అని అంటాడు పోలీసులు. ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసా సర్.. అయినా ఎలా వచ్చారు సర్ అని రాజ్ ని అడుగుతాడు మైఖేల్. కనకం కళ్ల జోడు తీసి ఇలా అని అంటుంది. మైఖేల్ షాక్ అవుతాడు. అంటే నువ్వు కనకేశ్వరి కాదా అని మైఖేల్ అంటాడు. కాదురా ముళ్ల పంది.. నేను స్వప్నకి తల్లినిరా.. అని అంటుంది కనకం. అంటే ఆ వీడియో కాల్.. అని మైఖేల్ అనగా.. ఇదిగో నా అల్లుడికి, కూతురికి చేశానురా అని కనకం అంటుంది. సర్ ఒక్కసారి అయితే వెదవా అని అంటారు. రెండో సారి కూడా అయితే ఏం అంటారు సర్ అని మైఖేల్.. రాజ్ ని అడుగుతాడు. మైఖేల్ అంటారు అని రాజ్ సమాధాని ఇస్తాడు.
వీడి వెనుక ఎవరో ఉన్నారు.. కావ్య అనుమానం:
ఇక కావ్య వీడి వాలంక చూస్తుంటే.. వీడి వెనకు ఎవరో ఉండి ఇదంతా చేయించారనిపిస్తుంది అని అనుమానిస్తుంది కనకం. నువ్వు ఊరుకోవమ్మా.. నా వెనుక ఎవరుంటారు అని కవర్ చేస్తాడు మైఖేల్. అది మేం చూసుకుంటాం మేడమ్ అని పోలీసులు అంటారు. బాబూ అప్పుడు విగ్రహాలు కాపాడి.. మమ్మల్ని రోడ్డున పడకుండా కాపాడావ్.. ఇప్పుడు నా కూతుర్ని కాపాడి మా ప్రాణాలే నిలబెట్టావ్ బాబూ.. అంటూ కనకం బాధ పడుతుంది. అయ్యో అలా అనకండి.. ఇప్పుడు స్వప్న మీ ఇంటి బిడ్డ కాదు.. మా ఇంటి బిడ్డ.. మీ కంటే ఎక్కువ బాధ్యత మాకే ఉంది అని చెప్తాడు రాజ్. ఇక అక్కడి నుంచి అందరూ బయలు దేరి ఇంటికి వెళ్తారు. ఈలోపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాహుల్ ఇంటికి వచ్చి.. మరో డ్రామా మొదలు పెడతాడు. స్వప్న మీద ఎంతో ప్రేమ ఉందని చెప్తూ బాధ పడుతున్నట్టు నటిస్తాడు. మరోవైపు రుద్రాణి కూడా రాహుల్ ని ఓదార్చుతున్నట్టు నటిస్తూ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. రాహుల్ తాగకుండా నా స్వప్నని ఎత్తుకెళ్లిపోయారు.. ఎంత కష్టం పడుతుందో అంటూ నటిస్తాడు. ఇంట్లోని వారందరూ రాహుల్ పై ఎటాక్ మొదలు పెడతారు. రుద్రాణి కూడా రివర్స్ కౌంటర్స్ వేస్తుంది.
స్వప్నని ఇంటికి తీసుకొచ్చిన కావ్య – రాజ్ లు, షాక్ లో రాహుల్ – రుద్రాణి:
ఈలోపు రాజ్, కావ్యలు స్వప్నని తీసుకుని ఇంటి వస్తారు. దీంతో రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదేంటి రాహుల్ ఇప్పటివరకూ స్పప్న కనిపించలేదని బాధ పడ్డావ్.. ఇప్పేడంటి స్వప్నని చూసి అలా కొయ్యముక్కలా నుంచున్నావ్ అని ధాన్యలక్ష్మి అంటుంది. ధాన్య లక్ష్మి మాటలకు తేరుకుని.. స్వప్నా.. స్వప్నా అంటూ దగ్గరకి వెళ్తాడు. స్వప్న కూడా రాహుల్ నువ్వు ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది. స్వప్న నేను నిన్ను మళ్లీ చూస్తానని అనుకోలేదు.. నీకేం కాలేదు కదా అని అంటాడు. నిన్ను ఎత్తుకెళ్లిపోయారన్న బాధ ముందు ఈ గాయం చాలా చిన్నది స్వప్న అని అంటాడు. స్వప్న రావడంతో రుద్రాణి మండి పడుతుంది.
వాడే తీసుకెళ్లాడు:
అసలేం జరిగింది రాజ్ అని సీతారామయ్య అడగ్గా.. తెలిసింది తాతయ్యా.. అప్పుడు స్వప్న పెళ్లిలో వెయిటర్ గా వచ్చి స్వప్నని ఎత్తుకెళ్లిన వాడే.. ఇప్పుడు కూడా ఎత్తుకెళ్లాడు అని రాజ్ చెప్తాడు. వాడే మళ్లీ ఎత్తుకెళ్లాడా? ఎందుకు అని సుభాష్ అడుగుతాడు. పెళ్లి చేసుకోవడానికి అని చెప్పగా.. ఇంట్లోని వారందరూ షాక్ అవుతారు. ఈలోపు రాహుల్.. లోలోప రగిలిపోతూ ఉంటాడు. సమయానికి వీళ్ల అమ్మకి ఆ విషయం తెలిసి.. మాకు చెప్పగానే స్వప్నని కాపాడటానికి వెళ్లాం.. లేకపోతే అండమాన్ కి తీసుకెళ్లి పోవాలి అనుకున్నాడని రాజ్ చెప్తాడు. రాజ్ అలాంటి వాడిని వదలకూడదు.. ఎక్కడున్నాడు వాడు చెప్పు రాజ్ ఇప్పుడే వెళ్లి వాడి అంతు తేలుస్తా అని రాహుల్ ఆవేశంగా అంటాడు. అంత అవసరం లేదులే రాహుల్.. వాడిని పోలీసులకు పట్టించామని కావ్య చెప్తుంది. ఇక ఈ రోజుతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.