Brahmamudi, October 9th episode: వాటే సీన్.. కావ్యకు భలే సపోర్ట్ చేసిన అపర్ణ.. కావ్య కనిపించడం లేదని టెన్షన్ లో దుగ్గిరాల ఫ్యామిలీ!

|

Oct 09, 2023 | 10:41 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. కావ్యను వెతుకుతూ.. సీతా రామయ్య, ఇందిరా దేవి గదిలోకి వెళ్తాడు రాజ్. కావ్య ఇక్కడ ఉందా? అని వాళ్లను అడుగుతాడు. కావ్య ఇక్కడ ఉండటం ఏంటిరా.. బయట ఉందేమోరా అని సీతారామయ్య అంటాడు. చూశాను తాతయ్య అక్కడ కూడా లేదు. మనం ఇందాక బయట కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా కావ్య అక్కడ లేదు కద బావా అని అంటుంది ఇందిరా దేవి. లేకపోవడం ఏంటి? ఫోన్ చేశావా అని సీతా రామయ్య అడుగుతాడు. హా చేస్తాను అని రాజ్ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. స్విచ్ఛాఫ్ వస్తుందని రాజ్ చెప్పగా.. స్విచ్ఛాఫ్ వస్తుందా అని ఇందిరా దేవి కంగారు..

Brahmamudi, October 9th episode: వాటే సీన్.. కావ్యకు భలే సపోర్ట్ చేసిన అపర్ణ.. కావ్య కనిపించడం లేదని టెన్షన్ లో దుగ్గిరాల ఫ్యామిలీ!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. కావ్యను వెతుకుతూ.. సీతా రామయ్య, ఇందిరా దేవి గదిలోకి వెళ్తాడు రాజ్. కావ్య ఇక్కడ ఉందా? అని వాళ్లను అడుగుతాడు. కావ్య ఇక్కడ ఉండటం ఏంటిరా.. బయట ఉందేమోరా అని సీతారామయ్య అంటాడు. చూశాను తాతయ్య అక్కడ కూడా లేదు. మనం ఇందాక బయట కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా కావ్య అక్కడ లేదు కద బావా అని అంటుంది ఇందిరా దేవి. లేకపోవడం ఏంటి? ఫోన్ చేశావా అని సీతా రామయ్య అడుగుతాడు. హా చేస్తాను అని రాజ్ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. స్విచ్ఛాఫ్ వస్తుందని రాజ్ చెప్పగా.. స్విచ్ఛాఫ్ వస్తుందా అని ఇందిరా దేవి కంగారు పడుతుంది. నాన్మమ్మ నువ్వేమీ కంగారు పడకు.. అమ్మ దగ్గర ఉందేమో వెళ్లి చూసి వస్తానులే అంటాడు రాజ్. బావా.. కావ్యకు, అపర్ణకు పడదు కదా ఆ గదిలో ఎందుకు ఉంటుంది? అని ఇందిరా దేవి అనగా.. నిజమే చిట్టీ.. పద వెళ్లి చూద్దాం అంటాడు సీతా రామయ్య. ఇక రాజ్.. కావ్యకు ఫోన్ చేస్తూనే ఉంటాడు.. కానీ స్విచ్ఛాఫ్ వస్తుంది.

కావ్య కనిపించడం లేదని కంగారులో దుగ్గిరాల ఫ్యామిలీ:

ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారే హాల్ లోకి వస్తారు. ఏంటి రాజ్.. కావ్య ఉందా అని ధాన్య లక్ష్మి వచ్చి అడిగింది? మా దగ్గరకు రాలేదు ఏమైందని అపర్ణ అడుగుతుంది. కావ్య ఎక్కడైనా ఉందా అని.. నా రూమ్ లో లేదు అని రాజ్ అంటాడు. అదేంటి మా రూమ్ లో కూడా లేదని స్వప్న అంటుంది. ఈలోపు ఏమైంది రాజ్ అని సుభాష్ వచ్చి అడగ్గా.. కావ్య ఇంట్లో కనిపించడం లేదని అపర్ణ అంటుంది. అంతా వెతికారా అని సుభాష్ అడుగుతాడు. ఎక్కడా లేకపోవడం ఏంటి? ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని.. సీతా రామయ్య, ఇందిరా దేవి కంగారు పడతాడు.

ఇవి కూడా చదవండి

కావ్య నీకు చెప్పే చేస్తుంది: అపర్ణ

ఒక వేళ నేను ఇందాక అన్న మాటలకు హార్ట్ అయి వెళ్లిపోయిందా.. లేక తాతయ్య కోసం నటిస్తున్నా అని నోరు జారినప్పుడు.. నిజం తెలుసుకుని వెళ్లిపోయిందా అని రాజ్ మనసులో ఆలోచిస్తాడు. మరోవైపు కావ్య ఏమో.. గతాన్ని తలుచుకుని రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ వెళ్తుంది. ఇక ఇంట్లోని వారందరూ రాజ్ వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారని రాజ్ అడగ్గా.. కావ్య ఏం చేసినా.. ఈ ఇంట్లో ఎవరికి చెప్పినా.. చెప్పకపోయినా నీకు మాత్రం చెప్పే వెళ్తుందని అపర్ణ అంటుంది. ఈ సారి మాత్రం నాకేం తెలీదు మమ్మీ అని రాజ్ అంటాడు. మీరిద్దరూ మాటామాటా అనుకున్నారా అని ఇందిరా దేవి అడుగుతుంది.

దీన్ని పెద్ద సమస్యగా భావించాలి: సీతా రామయ్య ఫైర్

మాటకు మాట ఎదురు చెప్పడం కావ్యకు అలవాటేగా అని అపర్ణ పుల్లలు పెడుతుంది. నా మనవరాలు అంత భాద్యత లేని మనిషి కాదు. మనసు వికలం అయితే తప్ప ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లదు అని సీతా రామయ్య అంటాడు. తాతయ్యా కావ్య ఎక్కడ ఉన్నా వెళ్లి నేను తీసుకొస్తా.. మీరు రెస్ట్ తీసుకోండి.. టెన్షన్ పడకండి అని రాజ్ అంటాడు. ఇంట్లో ఒక మనిషి కనిపించకుండా పోతే.. నేను రెస్ట్ తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావ్ రాజ్.. దుగ్గిరాల వారి ఇంటి కోడలు అయ్యాక.. కావ్య మన కుటుంబ సభ్యుల అందరితో కలిసిపోయింది. అందరి గురించి ఆలోచిస్తుంది. అందరికీ అన్నీ సమకూరుస్తుంది. ఎవరి ద్వేషాన్ని అయినా చిరునవ్వుతో సహిస్తుంది. అలాంటి మంచి అమ్మాయి కనబడకుండా పోతే.. ఈ ఇంట్లో ఎవరైనా సరే దీన్ని పెద్ద సమస్యగా భావించి తీరాలని సీతా రామయ్య ఫైర్ అవుతాడు.

కావ్య తిన్నది అరక్క వెళ్లింది: స్వప్న

నాన్న మీరు చెప్పింది నిజమే.. కానీ మీ ఆరోగ్యం బాగోలేదు. టైమ్ కి నిద్రపోవాలని సుభాష్ అంటాడు. అంటే ఏంట్రా మీ నాన్న పడే బాధలో అర్థం లేదంటావా.. ఒక్క పూట నిద్ర పోక పోతే ఏమౌతుంది? అప్పటికే కాటికి కాళ్లు చాచుకున్న మనిషితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారని ఇందిరా దేవి అంటుంది. మొగుడు ఏమీ అనలేదని అంటున్నారు. అత్తగారు ఏమైనా అన్నారేమో అని రుద్రాణి పొగ పెడుతుంది. ఇప్పుడు మాత్రం నాకేం సంబంధం లేదని అంటుంది అపర్ణ. అయితే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇలా చెప్పకుండా వెళ్లడం మీ కోడలికి ఇదేం కొత్త కాదు కదా. అత్తింట్లో అడుగు పెట్టిన మొదటి రోజే.. ఎవరికీ చెప్పకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చిన వీర వనిత నీ కోడలు అని అంటుంది రుద్రాణి. అప్పుడంటే స్వప్న కనిపించలేదని వెళ్లింది? ఇప్పుడు ఇంత అవసరం లేదని అంటుంది రుద్రాణి. అక్క చెప్పకుండా వెళ్లినట్టే.. చెల్లి కూడా చెప్పకుండా వెళ్లింది. వీళ్ల ఫ్యామిలీకి అవసరాలు ఉంటే వెళ్తారా? అవకాశం దొరికితే చాలు వెళ్తారని దెప్పిపొడుస్తుంది రుద్రాణి. ఈలోపు స్వప్న మాట్లాడుతూ.. నన్ను ఎవరో ఎత్తుకుపోతే కనబడకుండా పోయాను. కావ్య లాగా తిన్నది అరక్క ఇంత సీన్ క్రియేట్ చేసి వెళ్లలేదని అంటుంది స్వప్న.

రుద్రాణికి, స్వప్నకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన రాజ్, అపర్ణలు:

ఈ మాటలకు రాజ్ కోపంగా రియాక్ట్ అవుతూ.. వావ్ సూపర్ బాగా చెప్పావ్ స్వప్న.. నువ్వు కనబడకుండా పోతే నీ కోసం ఎంత తల్లడిల్లిపోయిందో నాకు తెలుసు. ఈ ఇంటి గడపలో కాలు పెట్టినప్పుడు.. నిన్ను వెతకడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి వచ్చింది. ఆ సంగతి మీ అత్తకు తెలుసు. ఆ తర్వాత నీ పెళ్లిలో మైఖైల్ ఎత్తుకెళ్లినప్పుడు ప్రాణాలకు తెగించి.. నిన్న వెతకడానికి వెళ్లి ఆ సంగతి నాకు తెలుసు. తిన్నది అరక్క అన్నావ్ కదా అది మాత్రం కరెక్ట్ కాదు.. కళావతి ఎప్పుడు ఏం చేసినా నీ మంచి కోసమే చేసింది.. ఆ సంగతి అదుగో అక్కడ మొద్దులా నిలబడ్డ నీ మొగుడికి తెలుసు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు రాజ్. ఆ తర్వాత రుద్రాణికి ఇచ్చి పడేస్తుంది అపర్ణ. కొంచెం ఇంగితంతో మాట్లాడు రుద్రాణి.. కావ్య గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకూ లేదు.. నీ కోడలికీ లేదు. సొంత అక్క అయి ఉండి స్వప్న అలా మాట్లాడటం.. ఎంత వరకు కరెక్ట్ అనుకుంటున్నావ్? కావ్య నాకు నచ్చినా.. నచ్చకపోయినా నీ కొడుకు, కోడలి విషయంలో మంచే చేసింది. నీ లాగా నీ కోడలి లాగా కావ్య బాధ్యత లేకుండా ప్రవర్తించదు.

రుద్రాణిపై ఎటాక్ చేసిన కుటుంబ సభ్యులు:

అయినా రుద్రాణి తగ్గకుండా అపర్ణపై కామెంట్స్ చేస్తుంది. దీంతో ఆపు రుద్రాణి.. ఒక మనిషి కనిపించకుండా పోతే మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని సుభాష్ అంటాడు. ఇక ఒకరి తర్వాత ఒకరు రుద్రాణిపై అందరూ విరుచుకు పడతారు. అప్పుడు నువ్వు కావ్యను బయటకు గెంటేస్తే.. నేనే బాధ్యత తీసుకుని ఇంట్లోకి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు నేను కూడా ఏం జరిగిందో ఊహించలేక అయోమయంలో ఉన్నాను అని సుభాష్ అంటాడు. నాకూ అలానే ఉంది డాడీ అని రాజ్ అంటాడు. పోలీ పోలీసులకు కంప్లైంట్ ఇద్దామా అని ప్రకాష్ అంటాడు. వద్దు ప్రకాష్.. ఇది మన దుగ్గిరాల వంశంకు సంబంధించిన సమస్య.. ఇప్పటికే చాలా సార్లు మన ఇంటి పరువు పోయింది. ఇప్పుడు ఇంటి కోడలు కనిపించకుండా పోయిందని తెలిస్తే.. అందరి దృష్టి మన మీదనే పడుతుందని అపర్ణ అంటాడు. ఇక సీతా రామయ్య.. ఈ తర్జన భర్జనలేనా.. లేక నా మనవరాలిని వెతికే పని ఉందా లేదా? అని సీతా రామయ్య అంటాడు.

కనకం, కృష్ణ మూర్తిలకు తెలిసిపోయిన నిజం:

ఇక రాజ్, కళ్యాణ్, రాహుల్, సుభాష్, ప్రకాష్ అందరూ కలిసి కావ్యని వెతకడానికి వెళ్తారు. ఈలోపు స్వప్న నిద్ర వస్తుందని వెళ్తుంది. దీంతో ఇందిరా దేవి.. రేపటి నుంచి స్వప్న కడుపుకు అన్నం పెట్టండి.. అడ్డమైన గడ్డీ పెట్టకండని అంటుంది. కడుపుకు అన్నం తినే మనిషిలా మాట్లాడమంటున్నారు మా అత్తగారు. మీ అత్తగారికి ఇటువంటి విషయాలు బాగా తెలుస్తాయి వెళ్లి అడుగు. మావయ్య గారూ వెతకడానికి మీ మనవడు వెళ్లాడు.. తప్పకుండా కావ్యను తీసుకునే వస్తాడు.. మీరు నిశ్చితంగా ఉండండి అని అంటుంది అపర్ణ. ఈ లోపు కనకం, కృష్ణ మూర్తిలకు ఫోన్ చేసి అడుగుతాడు రాజ్. ఈ తర్వాత.. అసలే రోజులు బాగోలేవు. ఇంత రాత్రి చెప్పకుండా ఎక్కడికి వెళ్లింది ఈ కళావతి అని కంగారు పడుతూ ఉంటాడు రాజ్. దీంతో కనకం, కృష్ణ మూర్తి అక్కడేదో జరిగింది అయ్యా.. మన దగ్గర దాస్తున్నారు అంటూ భయ పడతారు. ఆ తర్వాత కళ్యాణ్ కి కాల్ చేసి అడుగుతారు. దీంతో కళ్యాణ్ నిజం చెప్తాడు. ఇక కావ్య ఏమో.. నడుస్తూ దగ్గరలో ఉన్న శివాలయంకు వెళ్తుంది.