అమర్ నెత్తిన పాలు పోసిన బిగ్ బాస్.. ఈసారి దుమ్మురేపటం పక్కా

ఇక అమర్ ఫ్రెండ్ అంబటి అర్జున్ సైతం.. అమర్‌ను నామినేట్ చేయడం ఇక్కడ హైలెట్ పాయింట్. ఎవరైనా ఏదైనా చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. చించేస్తా పొడిచేస్తా అంటున్నావ్ కానీ ఇంప్రూవ్‌మెంట్ లేదంటూ అర్జున్ అమర్‌ని నామినేట్ చేశాడు. అటు శోభ, ప్రియాంక కలిసి అశ్వినిని టార్గెట్ చేసినట్లు తాజా ప్రొమో ద్వారా అర్థమవుతుంది.

అమర్ నెత్తిన పాలు పోసిన బిగ్ బాస్.. ఈసారి దుమ్మురేపటం పక్కా
Amardeep
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 09, 2023 | 4:11 PM

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రొమో వచ్చేసిందడోయ్…  కొత్తగా ఎంటరయిన కంటెస్టెంట్స్ ఎవరివైపు ఉంటారు..? సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్‌లో ఎవరి పంచన చేరతారు అనే విషయంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. ఆటను మంచి రసవత్తరంగా మార్చాడు బిగ్ బాస్. నేడు మండే కావడంతో నామినేషన్స్ మంచి హీట్‌గా జరిగాయి. ఎపిసోడ్ ప్రొమోను తాజాగా రిలీజ్ చేశారు. హౌస్‌లో ఎప్పట్నుంచో ఉంటున్నవారిని ఆటగాళ్లుగా.. కొత్తగా వచ్చినవాళ్లని పోటుగాళ్లకి పేర్కొన్నాడు బిగ్ బాస్. తాజాగా  ఆటగాళ్లు నామినేషన్స్ చేసే టైమ్ వచ్చిందని వెల్లడించాడు. ఆటగాళ్లలో నుంచి ఒకర్ని.. పోటుగాళ్ల నుంచి ఒకర్ని.. ఆటగాళ్లు నామినేట్ చేయాలని సూచించాడు. తొలుత శివాజీని పిలిచాడు. అయితే శివాజీ అమర్ వైపు చూడటంతో.. అందరూ స్మైల్ ఇస్తారు. ఎప్పుడూ బానే ఉంటాడని.. ఏదైనా తేడా వచ్చినప్పుడే అతనిలో కొత్త వ్యక్తి పుడతాడంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ఆ తర్వాత తేజ తనను నామినేట్ చేసిన నయని పావనిని తిరిగి నామినేట్ చేశాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తాజా ప్రొమో ద్వారా అర్థమవుతుంది.  ఇదే క్రమంలో అమర్ సైతం తనను నామినేట్ చేసిన పూజా మూర్తిపై అస్త్రాన్ని ఎక్కుపెట్టాడు.

ఇక అమర్ ఫ్రెండ్ అంబటి అర్జున్ సైతం.. అమర్‌ను నామినేట్ చేయడం ఇక్కడ హైలెట్ పాయింట్. ఎవరైనా ఏదైనా చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. చించేస్తా పొడిచేస్తా అంటున్నావ్ కానీ ఇంప్రూవ్‌మెంట్ లేదంటూ అర్జున్ అమర్‌ని నామినేట్ చేశాడు. అటు శోభ, ప్రియాంక కలిసి అశ్వినిని టార్గెట్ చేసినట్లు తాజా ప్రొమో ద్వారా అర్థమవుతుంది. మొత్తం మీద వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చిన తర్వాత గేమ్ పూర్తిగా మారిపోయింది.

ఆ ప్రొమోపై మీరూ ఓ లుక్కేయండి… 

అమర్‌కు ప్లస్ అయ్యే అవకాశం

కాగా అమర్‌కి సింపతీ కలిసివచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడు నక్క తోక తొక్కినట్లే అని చెప్పాలి. అమర్ గేమ్ బాలేదని ఇప్పటికే హోస్ట్ నాగ్ పదే, పదే చెప్తున్న విషయం తెలిసిందే. ప్రతివారం అతడిని ఓ రకంగా ఏకి పారేస్తున్నారు. అది పక్కనపెడితే ఇప్పుడు కొత్తగా వచ్చిన అమర్ ఫ్రెండ్స్ అర్జున్, నయని పావని సైతం అతడిని కనీసం ఫ్రెండ్‌లా ట్రీట్ చేయడం లేదు. అర్జున్ అయితే ఏకంగా నామినేట్ కూడా చేశాడు. దీంతో అతడిలో కసి పెరిగి బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో.. అమర్‌కు సింపతీ వర్కువుట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్క గేమ్ సరిగ్గా ఆడినా కూడా ఆవురావుమంటూ ఎదురుచూస్తున్న అమర్ ఫ్యాన్స్.. అతడిని ఆకాశానికి ఎత్తేస్తారు. గేమ్ మార్చాడన్న నేమ్ వస్తుంది. అమర్.. టాప్ 5 లో ఉండేందుకు ప్రజంట్ అయితే మంచి అవకాశం లభించింది అనుకోవాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!