Nagarjuna: 100వ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న నాగ్.. దర్శకుడు ఎవరో తెలుసా.?
కెరీర్‌లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌లో నటించి, మెప్పించిన నాగార్జున ఈ తరం యువతను సైతం అట్రాక్ట్ చేస్తున్నాడు. మన్మధుడు 2, బంగార్రాజు, ఘోస్ట్, వైల్డ్ డాగ్ వంటి మూవీస్‌తో ఇప్పటికే తనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదన్నట్లు దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం 'నా సామి రంగ' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపు చిత్ర నిర్మాణం చివరి దశలో ఉండగా, ఈ చిత్రాన్ని వచ్చే...
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొనసాగుతోన్న హీరోల్లో 100 సినిమాలు పూర్తి చేసిన వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. దాదాపు బాలకృష్ణ, చిరంజీవి తప్ప మరే ప్రస్తుత నటుడు 100కిపైగా సినిమాలు చేసింది లేదు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో కింగ్ నాగార్జున కూడా చేరనున్నారు. ఈతరం ప్రేక్షకులను సైతం అలరించేలా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు నాగార్జున.
కెరీర్‌లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌లో నటించి, మెప్పించిన నాగార్జున ఈ తరం యువతను సైతం అట్రాక్ట్ చేస్తున్నాడు. మన్మధుడు 2, బంగార్రాజు, ఘోస్ట్, వైల్డ్ డాగ్ వంటి మూవీస్‌తో ఇప్పటికే తనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదన్నట్లు దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం ‘నా సామి రంగ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపు చిత్ర నిర్మాణం చివరి దశలో ఉండగా, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే నాగ్ తన తర్వాతి చిత్రాన్ని మొదలు పెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
కెరీర్‌లో 100వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను నాగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ విషయమై మీడియాతో మాట్లాడిన నాగార్జున.. తన 100వ సినిమా బాధ్యతను నలుగురు దర్శకులకు అప్పజెప్పినట్లు వెల్లడించారు. వారు చెప్పిన కథల ఆధారంగా ఈ తరం ట్రెండ్‌కు ఏది సెట్ అయితే అది చేస్తానని ఓ ప్రెస్‌మీట్‌లో నాగార్జున తెలిపారు. అయితే తాజాగా నాగ్ తన 100 చిత్రంపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. తన కెరీర్‌లో ఒక మైలు రైయిగా నిలిచిపోవాలనుకుంటున్న 100 చిత్ర బాధ్యతలను నాగ్.. తమిళ దర్శకుడికి అప్పజెప్పాలని నిర్ణయించినట్లు సమాచారం.
తమిళ దర్శకుడు నవీన్ చెప్పిన కథ బాగా నచ్చడంతో నాగ్ ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. తాజాగా దర్శకుడు నవీన్‌తో నాగార్జున దిగిన ఓ ఫొటో ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. ప్రస్తుతం నవీన్.. అగ్ని సరుగల్ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అదే విధంగా ఇటు నాగార్జున కూడా నా సామి రంగ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తికాగానే వీరి కాంబోలో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే నాగ్ ప్రస్తుతం నటిస్తున్న ‘నా సామి రంగ’ చిత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లానింగ్ చేస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2024 సంక్రాంతి నాటికి విడుదల చేయాలనేది చిత్ర యూనిట్ టార్గెట్‌గా కనిపిస్తోంది. కేవలం 60 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..