Brahmamudi, October 2nd episode: సంతోషంతో రాజ్ ని కౌగిలించుకున్న కావ్య.. నిజం తెలిస్తే ఎలా తీసుకుంటుందో అని కంగారులో రాజ్!!

|

Oct 02, 2023 | 11:44 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్నని కిడ్నాప్ చేయించిన వాడిని చెడా మడా తిట్టేస్తూంటారు దుగ్గిరాల ఫ్యామిలీ. దీంతో రుద్రాణికి మంటెత్తుకొచ్చి.. ఆపండి అంటూ అరుస్తుంది. ఆ వెధవలను తిడితే నీకెందుకే బాధ.. అని అంటాడు ప్రకాష్. అన్నయ్యా.. నువ్వు ఎలాంటి వారినైనా తిట్టు నాకెలాంటి బాధ లేదు. కానీ పాపం స్వప్న అక్కడ ఎంత ఇబ్బంది పడిందో ఏంటో.. ముందు తనకు తినడానికి పెట్టాలి కదా అని రుద్రాణి కవర్ చేస్తుంది. పోనీలే ఎన్ని గొడవలు జరిగినా.. ఎవ్వరికీ ఏమీ కాకుండా బయట పడ్డాం. అన్ని విగ్నాలను తొలగించిన వినాయకుడిని మొక్కుకుంటూ. రేపు అందరం వినాయక చవితిని..

Brahmamudi, October 2nd episode: సంతోషంతో రాజ్ ని కౌగిలించుకున్న కావ్య.. నిజం తెలిస్తే ఎలా తీసుకుంటుందో అని కంగారులో రాజ్!!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్నని కిడ్నాప్ చేయించిన వాడిని చెడా మడా తిట్టేస్తూంటారు దుగ్గిరాల ఫ్యామిలీ. దీంతో రుద్రాణికి మంటెత్తుకొచ్చి.. ఆపండి అంటూ అరుస్తుంది. ఆ వెధవలను తిడితే నీకెందుకే బాధ.. అని అంటాడు ప్రకాష్. అన్నయ్యా.. నువ్వు ఎలాంటి వారినైనా తిట్టు నాకెలాంటి బాధ లేదు. కానీ పాపం స్వప్న అక్కడ ఎంత ఇబ్బంది పడిందో ఏంటో.. ముందు తనకు తినడానికి పెట్టాలి కదా అని రుద్రాణి కవర్ చేస్తుంది. పోనీలే ఎన్ని గొడవలు జరిగినా.. ఎవ్వరికీ ఏమీ కాకుండా బయట పడ్డాం. అన్ని విగ్నాలను తొలగించిన వినాయకుడిని మొక్కుకుంటూ. రేపు అందరం వినాయక చవితిని ఆనందంగా జరుపుకుందాం అంటూ ఇందిరా దేవి అంటుంది.

అందేంటి స్వప్న కడుపు అంత పెరిగింది:

ఇక నెక్ట్స్ స్వప్నని తీసుకుని రాహుల్ పైకి వెళ్తుంది. అప్పుడే ధాన్య లక్ష్మి.. అదేంటి స్వప్న కడుపు అంత పెరిగిపోయింది.. అని అడగ్గానే స్వప్న, కావ్యలు షాక్ అవుతుంది. అదేంటి ఆంటీ అలా అడుగుతున్నారు. నాలుగో నెల అంటే ఆ మాత్రం పెరగదా ఏంటి? అని స్వప్న సమాధానం ఇస్తుంది. లెక్క కరెక్టే కానీ ఈ వారంలోనే చాలా పెరిగిదేంటా అని అనుమానంగా అడుగుతుంది. అంటే ఇన్ని రోజులూ నేను ఇంట్లో ఉండడం వల్ల మీకు కడుపు పెరిగినట్టు అనిపించలేదు. ఇప్పుడు వారం కనిపించలేదు కదా.. అందుకే గుర్తు పడుతున్నారు. అయినా నా మీద మీకు శ్రద్ద ఎందుకు ఉంటుందిలే. ఎప్పుడూ కావ్య భజనే కదా.. అని స్వప్న పైకి వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

రాహుల్ ని చెంప దెబ్బ కొట్టిన రుద్రాణి:

ఆ నెక్ట్స్ రాహుల్ ని చెంప దెబ్బ కొడుతుంది రుద్రాణి. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేతక రాదు అంటూ ఫైర్ అవుతుంది. కొట్టినందుకు బాధ పడుతున్నావా.. నీ కంటే నేను పదింతలు బాధ పడుతున్నా.. నిన్ను అందలం ఎక్కించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అది జరగనందుకు అంటూ రాహుల్ ని తిడుతుంది. ఈ సారి నేను డైరెక్ట్ గా ఏదో ఒకటి చేస్తాను అని రాహుల్ అంటాడు. నువ్వు చేస్తూ ఉంటే ఆ కావ్య చూస్తూ ఉండదు. అది ఇంకా జాగ్రత్త పడుతుంది. మన ఇంకెంత జాగ్రత్త పడి.. టైమ్ చూసి దెబ్బ కొట్టాలి. ఎలాగైనా ఆ స్వప్నని వదిలించుకోవాలి అని ప్లాన్ వేస్తారు రాహుల్, రుద్రాణిలు.

మైఖేల్ వెనుక ఎవరో ఉన్నారంటున్న కావ్య:

ఈ సీన్ కట్ చేస్తే.. మైఖేల్ వెనుక ఎవరో ఉన్నారని అనుమానిస్తూ ఉంటుంది కావ్య. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావ్.. ఆల్రెడీ వాడిని పోలీసులకు అప్పగించాం కదా అని రాజ్ అంటాడు. పోలీసులకు అప్పజెప్పడమే కాదు.. వాడి వెనుక ఎవరున్నారో కూడా మనం తెలుసుకోవాలి. ఈలోపు కాంట్రాక్టర్ శ్రీను వస్తాడు. కావ్యకు చెక్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తాడు శ్రీను. వాటి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చండి.. రండి కాఫీ తాగుదురు అంటుంది కావ్య. వద్ద మీలాంటి గొప్పవాళ్ల పెద్దలకు దూరంగా ఉండటమే మంచిదమ్మ.. అని చెప్తూ చెక్ ఇచ్చేసి వెళ్తాడు కాంట్రాక్టర్ శ్రీను. అది తీసుకున్న కావ్య.. చెక్ ని చూస్తూ ఉండిపోతుంది. హ్యాపీనా అని అంటాడు రాజ్.. కావ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అదేంటి అలా బాధ పడుతున్నావ్ అని అనగా.. వెంటనే కావ్య.. రాజ్ ని కౌగిలించుకుంటుంది. ఈ చెక్ ను మీరే తీసుకుని.. మా అమ్మావాళ్లు ఇవ్వాలని అని అంటుంది. రాజ్ వద్దని చెప్పినా.. లేదు మీరు ఆరోజు హెల్ప్ చేయకపోయి ఉంటే.. ఈరోజు ఈ చెక్ వచ్చేది కాదని అంటూ.. మార్వాడీకి ఫోన్ చేయడానికి వెళ్తుంది కావ్య. ఆ తర్వాత రాజ్ మనసులో మాట్లాడుకుంటూ.. కళావతి ఇదంతా తన మీద ప్రేమతో చేస్తున్నాను అనుకుంటుంది. కానీ తాతయ్య కోసం అని తెలిస్తే.. ఎలా తీసుకుంటుందో ఏంటో.. అని అనుంటాడు.

అనామిక, కళ్యాణ్ ల పెళ్లి ముచ్చట:

ఆ తర్వాత అనామిక, కళ్యాణ్ లు కలిసి కారులో షికార్లు చేస్తూ ఉంటారు. ఇంట్లో మన సంగతి ఎప్పుడు చెప్తారు అని అనామిక అడగ్గా.. కాస్త సమయం పడుతుంది అని కళ్యాణ్ అంటాడు. అమ్మో మీతో పెట్టుకుంటే 60 ఏళ్ల షష్ఠి పూర్తి వచ్చేస్తుంది కానీ.. రేపు వినాయక చవితి కదా మా అమ్మా నాన్నలను మీ ఇంటికి తీసుకొస్తా అని అంటుంది. ఏంటి డైరెక్ట్ గా తీసుకొస్తారా.. ముందు ఇంట్లో వాళ్లకు చెప్పాలి అని అంటాడు కళ్యాణ్. ఆ అవసరం లేదు పెద్దవాళ్లను ఎదురెదురుగా వాళ్లే మాట్లాడుకుంటారు అని అనామిక అనగా.. సరే మీ అంటాడు కళ్యాణ్.

కనకంకు అప్పూ వార్నింగ్:

ఇంత జరుగుతుందటే నాకు ఒక్క ముక్కైనా చెప్పాలి కదా అమ్మా అని కనకం మీద అరుస్తుంది అప్పు. స్వప్నని ఎత్తుకెళ్లిపోయారన్న తెలిశాక ఏం చేయాలో అర్థం కాలేదే అందుకే వెళ్లాను అని కనకం అంటుంది. సమయానికి బావా, అక్క వచ్చారు కాబట్టి సరిపోయింది అని అప్పు అంటుంది. ఇక కనకం ఇప్పుడు నీకు అర్థమైందా.. నువ్వు గొడవలకు వెళ్లినప్పుడల్లా మాకు ఎలా ఉంటుందో అని కనకం అంటుంది. అటు తిరిగి.. ఇటు తిరిగి నన్ను అంటావేంటి? ఇంకోసారి ఇలాంటి జరిగితే ముందు నాతో చెప్పు అంటూ వెళ్లిపోతుంది అప్పు. అనామిక వాళ్లు రేపు మా ఇంటికి వస్తున్నారని అప్పుూకి చెప్దామని కళ్యాణ్ కాల్ చేస్తాడు. కానీ అప్పు ముందు కాల్ లిఫ్ట్ చేయదు. కళ్యాణ్ మళ్లీ చేయగా.. నేను పనిలో ఉన్నా అని చెప్తుంది. అది కాదు నేను చెప్పేది వినవా.. అనేలోపు కాల్ కట్ చేస్తుంది అప్పు.

ఇక కనకానికి కాల్ చేసి శ్రీను గారు వచ్చి చెక్ ఇచ్చారని చెప్తుంది కావ్య. దీంతో సంతోష పడుతుంది కనకం. పండగకి ఇంటికి రమ్మంటుంది కావ్య. వామ్మో నేను రాను అని అంటుంది కనకం. సరే అయితే మా అత్త గారి చేతే కాల్ చేయిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నెక్ట్స్ అందరూ భోజనం చేయిస్తూంటారు. ఇక అపర్ణని నేరుగా మా అమ్మవాళ్ల ఇంటికి వెళ్తాను అని కావ్య అడగ్గా.. అపర్ణ ఒప్పుకోదు. మా అమ్మ ఇక్కడికి రాదు.. మీరేమో వెళ్లనివ్వరు ఎలా.. అని అంటుంది. ఈలోపు రుద్రాణి చిన్న చిన్న పుల్లలు పెడుతూ ఉంటుంది. దానికి ధాన్య లక్ష్మి సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఇలా ఈరోజుతో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.