Adipurush Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ఇందులో టాలీవుడ్ నటీనటులతోపాటు.. బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా… బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి మొదటి నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో హిందీ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తల పై సిద్ధార్థ్ శుక్లా క్లారిటీ ఇచ్చాడు. ఆదిపురుష్ సినిమా కోసం తనను ఇప్పటివరకు ఎవరు సంప్రదించలేదని… సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని తేల్చి చెప్పారు. ఈ సినిమాలోని ఏ పాత్ర కోసం తనను ఎవరు అడగలేదని.. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే.. తానే స్వయంగా చెప్తాను అని.. ప్రస్తుతం వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు సిద్ధార్థ్. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా… కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది.
Coronavirus: కోవిడ్ సోకిన వారు నిరంతరం ఆ రెండు జాగ్రత్తలు పాటిస్తే చాలు మరణం నుంచి రక్షణ పొందవచ్చు..