Bigg Boss Telugu 9: అఫీషియల్.. బిగ్‌బాస్‌ 9 గ్రాండ్ లాంఛింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రోమో చూశారా?

బుల్లితెర ప్రేక్షకుల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడనుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంఛింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సీజన్ లో రెండు హౌస్ లతో పాటు చాలా విశేషాలుంటున్నాయి.

Bigg Boss Telugu 9: అఫీషియల్..  బిగ్‌బాస్‌ 9 గ్రాండ్ లాంఛింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రోమో చూశారా?
Bigg Boss Telugu 9

Updated on: Aug 28, 2025 | 5:38 PM

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ షో ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ లాంఛింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే వారం నుంచి బిగ్ బాస్ సందడి షురూ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సెప్టెంబర్‌ 7న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుందని ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈసారి కూడా కింగ్ నాగార్జునే ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు.  కాగా ఈ సారి షోను మరింత స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టాస్కులు, గేమ్స్ ల విషయంలో సరికొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ప్రోమోను కూడా డిఫరెంట్ గా కట్ చేశారు.  9వ సీజన్‌ కావడంతో ప్రోమోలో నవగ్రహాలను చూపించారు. అలాగే ఈసారి రెండు హౌస్‌లు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఒకటి సెలబ్రిటీల కోసం.. మరొకటి కామన్‌ మ్యాన్‌ కోసం అని తెలుస్తోంది. అలాగే బిగ్‌బాస్‌ ను కూడా మారుస్తున్నట్లు చెప్పుకొచ్చారు హోస్ట్ నాగార్జున. అంటే బిగ్‌బాస్‌ వాయిస్‌ మారొచ్చని తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

కాగా ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం కల్పిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే కామన్‌ మ్యాన్‌ కోసం ఎంపిక పోటీలు జరుగుతున్నాయి. అగ్ని పరీక్ష పేరుతో నిర్వహిస్తోన్న ఈ కాంటెస్టెలో ఇప్పటివరకు 15 మంది సెలెక్ట్ అయ్యారు. వీరికి వివిధ రకాల టాస్కులు, గేమ్స్ పెట్టి ఐదుగురిని కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి పంపనున్నట్లు తెలుస్తోంది. అగ్ని పరీక్ష పోటీలకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అలాగే  బిందు మాధవి, నవదీప్‌, అభిజిత్‌ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు రానున్నారో తెలియాలంటే మరో 10 రోజుల దాకా ఆగాల్సిందే.

 

బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంఛ్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.