Bigg Boss Telugu 9: మొదటి నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే.. ఆ కంటెస్టెంట్‌ను బయటకు పంపిద్దామని డిసైడ్ అయ్యారా?

బిగ్ బాస్ సీజన్ 9 మొదటి నామినేషన్స్ మొదలయ్యాయి. తొలి వారంలోనే ఏకంగా 9 మంది నామినేట్ అయ్యారు. అయితే హౌస్ మేట్స్ అందరూ ఒక కంటెస్టెంట్ నే టార్గెట్ చేసి నామినేట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. మరి మొదటి వారం తనే ఎలిమినేట్ అవుతారా?

Bigg Boss Telugu 9: మొదటి నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే.. ఆ కంటెస్టెంట్‌ను బయటకు పంపిద్దామని డిసైడ్ అయ్యారా?
Bigg Boss Telugu 9

Updated on: Sep 09, 2025 | 8:19 PM

బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం (సెప్టెంబర్ 07) గ్రాండ్ గా ప్రారంభమైంది. ఎప్పటి లాగే మొదటి రోజే హౌస్ లోని చాలా మంది కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి . ఇక అసలు సిసలు నామినేషన్ల పర్వం వచ్చే సరికి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు కంటెస్టెంట్స్. రకరకాల కారణాలు చెబుతూ తమ తోటి హౌస్ మేట్స్ ను నామినేట్ చేర్చారు. అలా బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం లో ఏకంగా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. సాధారణంగా గత సీజన్లలో ఒక్కొక్కరు ఇద్దరిని చొప్పున నామినేట్ చేసేవాళ్లు. అయితే ఈ సారి రూల్స్ మారాయి. బిగ్‌బాస్ చెప్పిన ప్రతిసారి సామాన్యులంతా కలిసి ఒకరిని నామినేట్ చేయాలి. అలానే సెలబ్రిటీలు కూడా తమలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఫుల్ క్లారిటీగా చెప్పాడు. దీంతో హౌసులో అందరికీ ఎదురు సమాధానం చెబుతున్న సంజన గల్రానీని నామినేట్ చేశారు.

నామినేషన్లకు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల రాము రాథోడ్.. శ్రష్ఠి వర్మని, భరణి.. సంజనని, హరీశ్.. సుమన్ శెట్టిని ఇలా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అయితే లిస్టులో ఒక్కరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో భరణి సేవ్ అయ్యాడు. ఆయన ప్లేసులో సామాన్యుల నుంచి డీమన్ పవన్ నామినేషన్లలో నిలిచాడు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ మొదటి వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు. మరి వీళ్లలో మొదటి వారం ఎవరు బయటకెళ్లి పోతారనేది చూడాలి. కాగా మొదటి వారం నామినేషన్స్ లో  ఎనిమిది మంది సెలబ్రటీలే ఉండడం గమనార్హం.

బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.