దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. తమ కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులతో ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ తన ప్రియుడితో కలిసి హోలీ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. పై ఫొటోలు అవే.. మరి అందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్- 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్, ఆమె ప్రియుడు శివ్ కుమార్. శుక్రవారం (మార్చి 14) హోలీ సందర్భంగా వీరిద్దరు అదిరిపోయే ఫొటో షూట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీటిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
కాగా ప్రియాంక జైన్, శివ్ కుమార్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్యన తిరుమల పర్యటనలో ఒక ప్రాంక్ వీడియో చేసి అందరి చేత చీవాట్లు తిన్నారీ లవ్లీ కపుల్. అలిపిరి నడక మార్గంలో చిరుతపులి కనిపించింటూ ఒక వీడియో తీసి శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు.
ఆ తర్వాత ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలోనూ ఫొటో షూట్ నిర్వహించి మళ్లీ ట్రోలింగ్ బారిన పడ్డారు. ‘దేవుడి దగ్గర కూడా ఫోటో షూట్స్, రీల్స్ అవసరమా? మీరు వెళ్లింది భక్తి కోసమా లేక ఇన్ స్టా స్టోరీల కోసమా? భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పూజలని ఫొటోలు కోసం, వ్లాగ్స్ కోసం చేస్తారా? అంటూ నెటిజన్లు ప్రియాంక, శివ్ కుమార్ లపై మండి పడ్డారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ముందు కెళుతున్నారీ ప్రేమ పక్షులు. సోషల్ మీడియాలో తరచూ తమ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.