Bigg Boss Telugu 9: బిగ్ బాస్‌లోకి ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోల ఎంట్రీ! ఆ కాంట్రవర్సీ బ్యూటీ కూడా ఫిక్స్‌!

బుల్లితెర ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ తెలుగు షోకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ రియాలిటీ షో కొత్త సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పై మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్‌లోకి ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోల ఎంట్రీ! ఆ కాంట్రవర్సీ బ్యూటీ కూడా ఫిక్స్‌!
Bigg Boss Telugu 9

Updated on: Aug 04, 2025 | 9:50 AM

ఫ్రెండిషిప్‌ డేను పురస్కరించుకుని బిగ్ బాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటివరకు జరిగన బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్లోకి సంబంధించిన మధుర క్షణాలను ఇందులో చూపించారు. బిగ్ బాస్ మొదటి సీజన్ హోస్ట్ గా ఎన్టీఆర్( వ్యవహరించినప్పటినుంచి ఇప్పటివరకు కంటెస్టెంట్లతో దిగిన ఫోటోలను వీడియోగా చిత్రీకరించి షేర్ చేశారు. ‘బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ముగిసిపోతాయి. పనులు కూడా పూర్తి అవుతాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడిన స్నేహం మాత్రం ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. ప్రతి ఆటను అధిగమించే బంధానికి చీర్’స్ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కమింగ సూన్ అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అలాగే ఈసారి పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావొచ్చిందని సమాచారం. మరోవైపు ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ప్రతి రోజు ఒక లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు టాలీవుడ్ హీరోలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వారు మరెవరో కాదు రాజ్ తరుణ్, సుమంత్ అశ్విన్. గతంలో యూత్ ఫుల్ అండ్ రొమాంటిక్ సినిమాలు తీసి క్రేజీ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారీ ఇద్దరు నటులు. అయితే ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. రాజ్ తరుణ్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సక్సెస్ పడడం లేదు. మరోవైపు సుమంత్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ ఫ్రెండ్ షిప్ డే వీడియో..

వీరితో పాటు ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోన్న కల్పిక గణేష్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ గా ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొనబోతున్నారు అనేది తెలియాలి అంటే సీజన్ ప్రారంభం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.

Bigg Boss Telugu 9 Contestants

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.