Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో మరో బిగ్ ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఎలిమినేష‌న్.. బయటకు వెళ్లేది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండి ఫినాలే రేసులో ఊహించని ట్విస్ట్.. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. గురువారం లేదా శుక్రవారం ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నాడని తెలుస్తోంది. మరి ఆ కంటెస్టెంట్ ఎవరబ్బా?

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో మరో బిగ్ ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఎలిమినేష‌న్.. బయటకు వెళ్లేది ఎవరంటే?
Bigg Boss Telugu 9

Updated on: Dec 11, 2025 | 6:34 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హీరోగా సాగుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకు చేరువ అయ్యింది. మరికొన్ని రోజుల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. గ్రాండ్ ఫినాలే వీక్ కావంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ టాస్కుల్లో చెమటోడ్చుతున్నారు. కాగా ప్రస్తుతం హౌస్ లో ఏడు కంటెస్టెంట్స్ ఉన్నారు.తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజనా గల్రానీ, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, భరణి ఉన్నారు. ఈ నేపథ్యంలో టాప్-5 కంటెస్టెంట్స్ తో బిగ్ బాస గ్రాండ్ ఫినాలే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఒకవేళ టాప్-5 ని తీసుకుంటే ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లాలి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కోసం మిడ్ వీక్ ఎలిమినేషన్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి పడాల కల్యాణ్ మినహా మినహా మిగతా ఆరు మంది నామినేష‌న్స్‌లో ఉన్నారు.

ఎప్పటిలాగే ఓటింగ్ లో తనూజ టాప్ లో దూసుకెళుతోంది. టైటిల్ రేసులో ఉండి నామినేషన్స్ లో ఉండడంతో ఆమెకు భారీగా ఓట్లు పోలీవుతున్నాయి. ఇక రెండో ప్లేస్ లో భరణి ఉండగా, మూడో ప్లేసులో డిమాన్ పవన్ కొనసాగుతున్నాడు. ఇక నాలుగో స్థానంలో భరణి ఉండగా, ఐదో ప్లేసులో సంజనా కొనసాగుతోంది. ఇక చివరి స్థానంలో సుమన్ శెట్టి ఉన్నాడు. అంటే ప్రస్తుతం బయటకు వెళ్లే వారిలో సంజన, సుమన్ శెట్టి ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయిజ ఆడియన్స్ ఓటింగ్ పరంగా చూస్తే సుమన్ శెట్టి బయటకు వెళ్లే అవకాశం ఎక్కువ. సంజనకు ఓట్లు బాగానే వస్తున్నా టాస్క్‌లలో ఆమె పెద్దగా ప్రభావం చూపించట్లేదు. గురువారమే (డిసెంబర్ 10) మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగనున్నట్లు సమచారం. మరికొన్ని గంటల్లో దీనిపై ఓ క్లారిటీ రానుంది. అలాగే బిగ్ బాస్ ఫైనల్ టాప్ 5 ఎవరనేది తెలిసిపోనుంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేపై ఆది రెడ్డి రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.