
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్దమైంది. ఆదివారం( డిసెంబర్ 21) రాత్రి జరిగి ఫైనల్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ విజేత ఎవరో తేలిపోనుంది.గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఇప్పటికే ప్రిపరేషన్స్, షూటింగ్ పనులు పూర్తి అయిపోయాయి. కాగా ఈ సీజన్ విన్నర్ ఎవరనే దానిపై ఎంతటి ఉత్కంఠ నెలకొందో.. ఫినాలేకు వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరనేది కూడా అంతే ఆసక్తిని కలిగిస్తోంది. గత కొన్ని రోజులు ఈ సీజన్ ఫినాలే వచ్చే చీఫ్ గెస్ట్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. గత కొన్ని సీజన్లుగా మెగాస్టార్ చిరంజీవే ఈ రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అయితే గతేడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా వచ్చాడు. దీంతో
ఎప్పటిలాగే ఈ సీజన్‌కి కూడా మెగాస్టార్ చిరంజీవినే గెస్ట్ వస్తారని చాలా మంది అనుకున్నారు. చిరంజీవి తో పాటు బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ల జాబితాలో మరో హీరో కూడా వినిపించింది. అతనే పాన్ ఇండియా హీరో ప్రభాస్. ది రాజా సాబ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా డార్లింగ్ బిగ్ బాస్ షోలో సందడి చేస్తారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ రావడం లేదని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో టాక్ ప్రకారం ఈ సీజన్‌కి చీఫ్ గెస్ట్‌గా చిరు రావడం లేదని టాక్. అలాగే ప్రభాస్ కూడా సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. దీంతో ఈసారి మరో స్టార్ హీరో బిగ్ బాస్ 9 ఫినాలే సందడి చేయబోతున్నారని టాక్. ఆయన మరెవరో కాదు మాస్ మాహారాజ రవితేజ. చిరంజీవి బిజీగా ఉండడంతో బిగ్ బాస్ టీం చివరి నిమిషంలో రవితేజని సంప్రదించారట. దీంతో ఆయన కూడా వస్తానని మాట ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రవితేజ భర్త మహశయులకు విజ్ఞప్తి చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పుడు బిగ్ బాస్ కు వస్తే సినిమా ప్రమోషన్స్ కూడా జరిగినట్లు ఉంటుందని రవి తేజ భావిస్తున్నట్లు టాక్. ఇక బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలేకు రవితేజ చీఫ్ గెస్ట్ అని తెలియడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
Memories rewind, party begins in the house! 🏠❤️✨
Watch #BiggBossTelugu9 Mon–Fri 10:00 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/A36aFq8fOu
— Starmaa (@StarMaa) December 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.