
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు పన్నెండో వారానికి చేరుకుంది. మరో మూడు వారాల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడవచ్చు. ఇక 12 వ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే ఇదొక రణరంగాన్ని తలపించింది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. మాటల తూటాలు పేల్చుకున్నారు. ముఖ్యంగా డిమాన్ పవన్, కల్యాణ్ పడాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కామనర్స్ కోటాలో భాగంగా హౌస్ లోకి వచ్చిన వీరిద్దరు మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. అయితే ఉన్నట్లుండి వీరిద్దరు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోయారు.చివరికి మెడ పట్టి తోసుకునేంత వరకు వచ్చారు. ఇందులో తప్పెవరిదైనా వీరిద్దరూ లిమిట్ దాటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టైటిల్ రేసులో టాప్ లో దూసుకెళుతోన్న కళ్యాణ్ ఈ వ్యవహారంతో నెగెటివిటీని మూటగట్టుకున్నాడన్న కామెంట్స వినిపిస్తాయి. అతను కొన్ని బూతులు మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాగే ఆ గొడవ టైంలో, హౌస్ లోఉన్న కూర్చిలను తన్నడం లాంటివి చేశాడు. దీంతో కళ్యాణ్ కు కూడా సీరియస్ వార్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. రెడ్ కార్డ్ కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు.
కల్యాణ్ తో పాటు డిమాన్ పవన్ కు కూడా రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మ్యాన్ హ్యాండ్లింగ్ విషయంలో డిమాన్ పవన్ కు ఇప్పటికే నాగార్జున నుంచి వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ కల్యాణ్ గొంతు పట్టుకోవడంతో పవన్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. ఇక మరో కంటెస్టెంట్ సంజనకు కూడా రెడ్ కార్డ్ తప్పకపోవచ్చని తెలుస్తోంది. రీతూ చౌదరి విషయంలో ఆమె చేసిన కామెంట్స్ శ్రుతిమించాయాని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వీకెండ్ లో ఈ ముగ్గురికి నాగార్జున బాగానే క్లాస్ తీసుకోనున్నట్లు సమాచారం.
Laughter flying… ideas misfiring… the house explodes into comedy. 🤣💥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/KMqTa4uQ69
— Starmaa (@StarMaa) November 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.