Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ టాప్-5 కంటెస్టెంట్స్ వీరేనట! కప్పు కొట్టేది ఎవరో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది దశకు వచ్చింది. దీంతో టాప్- కంటెస్టెంట్స్ ఎవరు? టైటిల్ విజేత ఎవరన్న దానిపై సోషల్ మీడియాల ఆసక్తికర చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ రివ్యూయర్లు కూడా ఈ విషయాలపై వరుసగావీడియోలు చేస్తున్నారు.

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ టాప్-5 కంటెస్టెంట్స్ వీరేనట! కప్పు కొట్టేది ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 9

Updated on: Nov 11, 2025 | 8:37 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైంది. సెలబ్రిటీలు, కామనర్స్ అంటూ మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. మధ్యలో మరో ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ లోకి వచ్చారు. అలాగే ఈ తొమ్మిది వారాల్లో దాదాపు 11 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. భరణి లాంటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇమ్మాన్యూయెల్‌, తనూజ, కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, రీతూ చౌదరీ, సుమన్‌ శెట్టి, గౌరవ్‌, నిఖిల్‌, దివ్య నికితా, భరణి, సంజనా ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ షో పదో వారంలోకి అడుగు పెట్టింది. అంటే ఈ రియాలిటీ షో దాదాపు తుది దశకు చేరుకున్నట్లే. మహా అంటే ఈ షో సుమారు 5 లేక 6 వారాలు కొనసాగనుంది. దీంతో ఈ సారి టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరు? టైటిల్ ఎవరు గెలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా తొమ్మిదో వారంలో ఎలిమినేట్ అయిన శ్రీనివాస సాయి కూడా హౌస్‌మేట్స్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ట్రోఫీ రేస్‌లో బలమైన పోటీదారులుగా తనూజ, ఇమ్మాన్యుయేల్‌ను పేర్కొన్నాడు. అలాగే డీమాన్ పవన్, సుమన్ శెట్టి కూడా గట్టి పోటీదారులేనన్నాడు.

ఇక ప్రేక్షకుల ఓటింగ్, టాస్కుల్లో ప్రదర్శనలను బట్టి చూస్తే తనూజ, సంజన, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్ లు కచ్చితంగా టాప్ 5లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అలాగే సుమన్ శెట్టి, రీతూ చౌదరి టాప్-5లో ఉంటారని కూడా కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే టైటిల్ రేసు మాత్రం తనూజ, ఇమ్మాన్యుయేల్ మధ్యనే ఉంటుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. ఎలిమినేషన్లు, సీక్రెట్ టాస్కులతో టాప్- 5 లిస్ట్ లోనూ మార్పులు చోటు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

టైటిల్ రేసులో తనూజ, ఇమ్మాన్యుయేల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.