
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షోలోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా ఆరుగురు సామాన్యులు. సోమవారం నుంచి ప్రారంభమైన బిగ్ బాస్ ఆటలో కంటెస్టెంట్స్ తమ ట్యాలెంట్ ను చూపిస్తున్నారు. అందరూ సై అంటే సై అంటున్నారు. ఇక మొదటి వారం తొమ్మిది మంది నామినేషన్స్ లో నిలిచారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అంటూ సోషల్ మీడియా లిస్టులో కనిపించిన చాలా మంది సెలబ్రిటీలు హౌస్ లోకి రాలేకపోయారు. ముఖ్యంగా అలేఖ్య చిట్టి పికిల్స్, దివ్వెల మాధురి ఇలా చాలా మంది హౌస్ లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ మొదటి లిస్టులో వీరు కనిపించలేదు. అయితే వీరంతా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. గత సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కారణంగానే హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ డబుల్ అయ్యింది. రోహిణి, అవినాష్, హరితేజ, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, మెహబూబ్ లు షో మధ్యలో వచ్చి బిగ్ బాస్ ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించారు. వీరిలో గౌతమ్ కృష్ణ ఏకంగా బిగ్ బాస్ సీజన్ 8 రన్నరప్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కచ్చితంగా ఉండనున్నాయి. ఇందులో ఒక ప్రముఖ నటి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ అందాల తార టీవీ సీరియల్స్‌లో, బుల్లితెర కార్యక్రమాల్లో బిజి బిజీగా ఉంటోంది. సీరియల్స్ లో సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను అలరించే ఈ అందాల భామ టీవీ షోస్ లో మాత్రం ఎంతో చలాకీగా ఉంటుంది. పంచ్ డైలాగులు, ప్రాసలతో కడుపుబ్బా నవ్విస్తుంది. వచ్చీ రానీ తెలుగు మాట్లాడుతూ ఫన్ జనరేట్ చేసే ఈ ముద్దుగుమ్మకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ వాగుడు కాయను బిగ్ బాస్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా తీసుకోనున్నారని టాక్. ఇంతకీ తనెవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్.. బుల్లితెర నటి బ్రహ్మముడి ఫేమ్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు వైల్డ్ కార్డ్ ద్వారా త్వరలోనే హౌస్‌లో అడుగుపెడుతుందని టాక్.
ఆ మధ్యన జరిగిన ఓ టీవీషోలోనూ బిగ్ బాస్ ఎంట్రీపై ఆసక్తి చూపించింది దీపిక. తనకు అవకాశం కల్పిస్తే కప్పు కొట్టి చూపిస్తానంటూ సవాల్ విసిరింది. మరి బిగ్ బాస్ నిర్వాహకులు కావ్యకు అవకాశం కల్పిస్తే హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ రెట్టింపు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి