Bigg Boss Telugu: 11వ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే.. కెప్టెన్సీ పవర్ తో ట్విస్ట్ ఇచ్చిన తనూజ

ఎప్పటిలాగే బిగ్ బాస్ సీజన్ 9 పదకొండో వారం నామినేషన్స్ వాడీ వేడిగా సాగాయి. ఈ సారి గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ సీజన్ లో మొదటిసారిగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లోకి వచ్చాడు. అతనికి బయట ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఈ వారం ఒక క్లారిటీ రానుంది.

Bigg Boss Telugu: 11వ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే.. కెప్టెన్సీ పవర్ తో ట్విస్ట్ ఇచ్చిన తనూజ
Bigg Boss Telugu 9

Updated on: Nov 17, 2025 | 8:16 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 10 వారం పూర్తి చేసుకుని 11 వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి నామినేషన్స్ కూడా హోరా హోరీగా సాగాయి. టాప్ కంటెస్టెంట్ తనూజ కెప్టెన్ కావడం వల్ల ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. అయతే ఈ సీజన్ లో ఇప్పటివరకు నామినేషన్స్ లోక రాని జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మొదటి సారిగా నామినేషన్స్ లోకి వచ్చాడు. అతనితో సహా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నారు. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా కెప్టెన్ తనూజకు సూపర్ పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనేది కెప్టెన్ డిసైడ్ చేస్తుందని తనూజకు సూపర్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా తనూజ ముగ్గురికి తప్పా అందరికీ 2 కార్డ్స్ ఇచ్చింది. ఇమ్మానుయేల్, భరణి, డెమాన్, రీతూలకు రెండేసి నామినేషన్లు ఇవ్వగా.. సంజన, రీతూ, సుమన్ శెట్టిలకు ఒక్కో నామినేషన్ మాత్రమే ఇచ్చింది తనూ. ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతూ తమ తోటి కంటెస్టెంట్స్ ను నామినేట్ చేశారు.

ముందుగా ఇమ్మాన్యుయేల్ రీతూని, భరణిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత డిమాన్ పవన్.. ఎవరూ ఊహించని విధంగా రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. డీమాన్ పవన్ ఇచ్చిన షాక్ తో రీతూ కన్నీరుమున్నీరైపోయింది. భరణి .. ఇమ్మానుయేల్, రీతూను నామినేట్ చేశాడు.రీతూ చౌదరి మాత్రం దివ్య, సంజన లను నామినేట్ చేసింది. ఇక సంజన కళ్యాణ్ ను , దివ్య రీతూను, సుమన్ శెట్టి కల్యాణ్ ను నామినేట్ చేశాడు. ఇలా చివరికి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో నిలిచారు. చివర్లో తనూజ తన కెప్టెన్సీ పవర్ తో రీతూ చౌదరిని సేవ్ చేసింది. దీంతో చివరకు ఇమ్మానుయేల్, పడాల కల్యాణ్, భరణి, సంజన, డిమాన్ పవన్, దివ్య నికితా నామినేషన్స్ లో నిలిచారు. మరి ఈ వారం వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

 

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.