భర్త నుంచి దూరం.. సంచలన విషయం చెప్పిన వంటలక్క.. షాక్‌లో ఫ్యాన్స్
కార్తీక దీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది వంటలక్క, దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్. ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ టీవీలో ఓ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో దీప, కార్తీక్, మోనిత పాత్రలకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

బుల్లితెరపై సీరియల్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా తెలుగు సీరియల్స్ కు క్రేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక సీరియల్స్‌లో అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుంటున్న సీరియల్స్‌లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. సాయంత్రం అయితే చాలు ఆడాళ్ళంతా టీవీలకు అతుక్కుపోయి చూసే సీరియల్ ఇది. ఈ సీరియల్ కు మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ప్రసారం అయ్యే ఈ సీరియల్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ లో వంటలక్క తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. నటి ప్రేమి విశ్వనాథ్ వంటలక్క పాత్రలో నటించి మెప్పించింది. ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి.. కానీ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కార్తీక దీపం సీరియల్ మొదటి భాగం మొన్నామద్యే పూర్తయింది. ఇప్పుడు కార్తీక దీపం: ఇది నవ వసంతం అనే పేరుతో కొత్త భాగం మొదలు పెట్టి ప్రేక్షకులను అలరిస్తున్నారు.
కార్తీక దీపం పార్ట్ 2 కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త సీరియల్ కూడా మంచి టిఆర్పీతో దూసుకుపోతోంది. అయితే నటి ప్రేమి విశ్వనాథ్ గురించి చాలా మందికి తెలుసు.. ఆమె తెలుగు నటి కాదు. ఆమె కేరళ రాష్ట్రానికి చెందిన నటి. కానీ తెలుగులో ఒకే ఒక్క సీరియల్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ప్రేమి విశ్వనాథ్. అలాగే ఆమె ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. గతంలోఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త గురించి తెలిపింది.
తెలుగులో అవకాశం రావడంతో భర్తను పిల్లలను వదిలేసి ఇక్కడకు వచ్చేశా.. అలాగే బిజీ షెడ్యూల్ కారణంగా నేను నా భర్త నుంచి దూరంగా ఉండాల్సి వస్తోంది అని అన్నారు. అలాగే తన భర్త కూడా చాలా బిజీగా ఉంటాడని ఆమె అన్నారు. తను కేరళలో ఉన్నప్పుడు.. తన భర్త వేరే రాష్ట్రంలో ఉండేవాడు అని.. తాను ఒక రాష్ట్రంలో.. తన భర్త మరో రాష్ట్రంలో ఉండేవాళ్ళం అని తెలిపింది వంటలక్క. ఇద్దరూ తమ లైఫ్ లో బిజీ బిజీగా ఉండటంతో అస్సలు కలిసుండటం కుదరడం లేదు అని.. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కలవడం కుదురుతోంది అని చెప్పుకొచ్చింది. ప్రేమి విశ్వనాథ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
