Bigg Boss Telugu 5 : రవికి అసలు విషయం చెప్పిన నటరాజ్ మాస్టర్.. ఈ సారి విశ్వతో వార్‌కు దిగనున్న రవి..

బిగ్ బాస్ సీజన్ 5 రసావత్తరంగా సాగుతుంది. ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే..

Bigg Boss Telugu 5 : రవికి అసలు విషయం చెప్పిన నటరాజ్ మాస్టర్.. ఈ సారి విశ్వతో వార్‌కు  దిగనున్న రవి..
Ravi

Edited By: Ravi Kiran

Updated on: Sep 28, 2021 | 7:01 PM

Bigg Boss Telugu 5 : బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.. గత సీజన్స్‌తో పోల్చుకుంటే ఈ సీజన్‌లో కాస్త మసాలా ఎక్కువైందనే చెప్పాలి.. గొడవలు, అల్లర్లు, ఏడుపులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నామినేషన్స్ అనగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాక్ రచ్చ చేస్తున్నారు. ఇక సోమవారం నాటి ఎపిసోడ్‌లో లోబో, నటరాజ్ మాస్టర్, ప్రియా, సిరి, కాజల్, సన్నీ, రవి, ఆనీ మాస్టర్ నామినేషన్ లో ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఆనీ మాస్టర్, లోబో , నటరాజ్ మాస్టర్ ఉన్నారు. వీరిలో ఎవరైనా ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు చిత్రయూనిట్.

రవి లోబో, నటరాజ్ మాస్టర్ మాట్లాడుకుంటూ రవి పై పంచుకు వేశారు.. నటరాజ్ మాస్టర్ రవిని చూస్తూ.. పికాక్ ఎగిరిపోయింది అనగానే లోబో ఎవరు లహరినా.. అంటూ నవ్వేశాడు.. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ‘మాస్టర్ గుంటనక్క ఎవరో మీకు తెలుసుకదా.. ప్రతి సారి నాగార్జున గారు వచ్చినప్పుడు గుంట నక్క అనగానే అందరు నావైపే చూస్తున్నారు.. ఎలా అనిపిస్తుందో తెలుసా.. సిగ్గేస్తుంది. అంటూ తన ఆవేదన వెళ్లబుచ్చుకున్నాడు. దానికి నటరాజ్ మాస్టర్ ఒక ఊసరవెల్లి నా దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పింది’.. అనగానే రవి విశ్వ దగ్గరకు వెళ్లి నిలదీశాడు గుంటనక్క అన్న పేరు నాకు కరెక్ట్ వర్డ్ అని నువ్ అన్నవట అంటూ ప్రశ్నించాడు.. ఇదంతో ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు నటరాజ్ మాస్టర్-విశ్వ-రవి మధ్య వివాదం జరిగేలా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: డేంజర్‏ జోన్‏లో ఆ ముగ్గురు.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా ?

Allu Arjun: బన్నీ సినిమాకు మరుసారి బ్రేక్ పడిందా..? కారణం అదేనా..?

Pushpaka Vimanam: ముచ్చటగా మూడో సినిమాతో రాబోతున్న దేవరకొండ బ్రదర్.. ‘పుష్పక విమానం’ రిలీజ్ ఎప్పుడంటే..