Bigg Boss Season 6: ‘పిట్ట’కథలు చెబుతానంటున్న నాగార్జున.. బాలాదిత్యకు క్లాస్.. వీడియో చూపించి మరీ కడిగేశాడుగా..

|

Sep 24, 2022 | 5:43 PM

. తాజాగా విడుదలైన ప్రోమోలో మరోసారి హౌస్‏మేట్స్‏కు ఆట తీరు గురించి చెప్పేందుకు రెడీ అయ్యారు నాగ్. ఈసారి ముఖ్యంగా బాలాదిత్యను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.

Bigg Boss Season 6: పిట్టకథలు చెబుతానంటున్న నాగార్జున.. బాలాదిత్యకు క్లాస్.. వీడియో చూపించి మరీ కడిగేశాడుగా..
Bigg Boss
Follow us on

బిగ్ బాస్ మూడో వారం వీకెండ్ వచ్చేసింది. ఈ షోలోకి వచ్చిన కంటెస్టెంట్స్ పూర్తిగా కేవలం డబ్బు, ఫేమ్ కోసం మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది. గత సీజన్ల కంటే దారుణంగా ఈ సీజన్ రేటింగ్ వస్తుంది. దీంతో తిన్నామా.. చిల్ అవుతున్నామా అన్నట్టు కాకుండా గేమ్ ఆడాలంటూ గతవారం గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున (Bigg Boss Season 6). ఇప్పటివరకు ఆట మొదలు పెట్టని వారందరిని సోఫా వెనక నిలబెట్టి మరీ కడిగేశారు. దీంతో మూడో వారం పలువురి ఆట తీరులో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇక అదే విషయాన్ని ఈ వారం నాగార్జున సైతం చెప్పేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో మరోసారి హౌస్‏మేట్స్‏కు ఆట తీరు గురించి చెప్పేందుకు రెడీ అయ్యారు నాగ్. ఈసారి ముఖ్యంగా బాలాదిత్యను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే కొందరికి పిట్ట కథలు చెప్పాలంటూ శ్రీహాన్, ఇనయ సుల్తానా గొడవ గురించి కూడా మాట్లాడబోతున్నట్లు హింట్ ఇచ్చేశారు.

గత వారం సరిగ్గా ఆడని తొమ్మిది మంది సోఫా వెనకాల నిల్చున్నారని.. అందులో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారని.. మిగతా ఏడుగురు సోఫా వెనక నిల్చోమని చెప్పారు నాగ్. ఆ తర్వాత శ్రీహాన్, శ్రీసత్య గేమ్ సరిగ్గా ఆడారని. వారిని ముందుకు వచ్చి కూర్చోవాలని అన్నారు. అంతేకాకుండా.. వారిద్దరికి చప్పట్లు కూడా కొట్టించారు. అనంతరం బాలాదిత్యపై ఫైర్ అయ్యారు. అడవిలో ఆట టాస్కులో అంతా గేమ్ ఆడుతుంటే.. బాలాదిత్య సోఫాపై తీరిగ్గా కూర్చున్న వీడియో చూపిస్తూ క్లాస్ తీసుకున్నారు. నామినేషన్లలో బాలాదిత్య చెప్పిన మాటను గుర్తుచేస్తూ.. ఆడియన్స్ ఓపెనియన్ అడిగారు. అలాగే ముందున్న వాళ్ల గురించి చాలా పిట్టకథలు చెప్పాలంటూ పిట్ట గొడవ ఉంటుందని హింట్ ఇచ్చేశారు నాగార్జున. ఇక ఈవారం వీకెండ్‏లో మరోసారి హౌస్‏మేట్స్ పై చాలా సీరియస్ కాబోతున్నట్లుగా ప్రోమోను బట్టి తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.