బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తెలుగుతోపాట అన్ని భాషలలోనూ ఈ షోకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పుడు తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకుని.. సీజన్ 6 కొనసాగుతుంది. అయితే ఎంతో అట్టహసంగా మొదలైన బిగ్బాస్ సీజన్ 6 పై మొదటి నుంచే పెదవి విరుస్తున్నారు . ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఆట తీరు విసుగు పుట్టిందనడంలో సందేహం లేదు. మొత్తం 21 మందితో బిగ్బాస్ సీజన్ 6 స్టార్ట్ కాగా.. గీతూ, రేవంత్, ఫైమా, బాలాదిత్య, శ్రీహాన్ మినహా.. మిగతా ఇంటిసభ్యులు అసుల ఉన్నట్లు కాడా అనిపించడం లేదు. ఇక నాగార్జున వచ్చే శని, ఆదివారాల తప్ప.. మిగతా అన్ని రోజులు చప్పగా సాగుతుంది. ఎంత సేపు తిండి గోల.. సోది ముచ్చట్లు తప్పితే.. బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ ఆడాలని.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే ఆసక్తి మాత్రం ఓ ఒక్కరిలో కనిపించడం లేదు. ఇక ఇదే విషయాన్ని ఆడియన్స్ ముందు నుంచి నెట్టింట చెప్తూనే ఉన్నారు. ఇక హోస్ట్ నాగ్. వచ్చి ఆట ఆడనివారికి వరుసగా రెండు వారాలు క్లాస్ తీసుకున్న.. ఆట తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ చేసేందుకు కూడా కంటెస్టెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో బిగ్బాస్ టీఆర్సీ మరి దారుణంగా పడిపోయింది. అయితే ఇలా సాగితే చాలా కష్టమని భావించారో.. లేక కంటెస్టెంట్స్ పద్దతి నచ్చలేదో తెలియదు కానీ.. ఎట్టకేలకు బిగ్బాస్ కళ్లు తెరిచాడు. ఇంటి సభ్యులపై తీవ్రంగా సీరియస్ అయ్యాడు.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఇంటి సభ్యులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు బిగ్బాస్. ఆసక్తి లేకపోతే తక్షణమే ఇంటి నుంచి వెళ్లిపోండి అంటూ ఫైర్ అయ్యాడు. బిగ్బాస్ ఏడో వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టి సినిమా పాత్రలను ఇచ్చాడు. ఇందులో బాహుబలిగా రోహిత్, దేవసేనగా మెరీనా.. చిరంజీవిగా రేవంత్, వెంకటేష్ గా ఆదిరెడ్డి, అతిలోక సుందరి శ్రీదేవిగా ఇనయ, పుష్పగా ఆర్జే సూర్య, శ్రీవల్లిగా గీతూ రాయల్, రాములమ్మగా కీర్తి భట్, బాలకృష్ణగా శ్రీహాన్, ప్రభాస్ గా రాజశేఖర్, పవన్ కళ్యాణ్ గా బాలాదిత్య గెటప్స్ వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పాత్రలతో ఎంటర్టైన్ చేయాల్సిన కంటెస్టెంట్స్.. ఆట ఆడకుండా ఎక్కడివారు అక్కడే కూర్చొని తీరిగ్గా ముచ్చట్లు పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో వారందరిని ఇంటి నుంచి బయటకు రమ్మని. వరుసగా నిల్చోమన్నాడు బిగ్బాస్. ఇప్పటివరకు బిగ్బాస్ చరిత్రలో ఇంటి సభ్యులకు ఈ టాస్క్ ఇచ్చిన ఏ సీజన్లో కూడా ఇంత నిరాశజనకంగా జరగలేదు. అందుకు కారణం ఇంటి సభ్యుల నిర్లక్ష్యం, టాస్కుల పట్ల నిర్లక్ష్యం, బిగ్బాస్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం, మీ నిర్లక్ష్యం బిగ్బాస్ నే కాకుండా.. ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. బిగ్బాస్ చరిత్రలో ఎన్నడు లేనంతగా నిరాశపరుస్తున్న కారణంగా ఈవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రద్దు చేయబడింది. ప్రేక్షకుల పట్ల, ఈ షో పట్ల గౌరవం.. ఆసక్తి లేకపోతే వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లండి అంటూ గెట్స్ ఓపెన్ చేశాడు.
దీంతో హౌస్మేట్స్ అంతా షాకయ్యారు. అంతాకలిసి బిగ్బాస్ కు సారి చెప్పారు. ఒకరిద్దరు చేసిన తప్పులకు అందరికి శిక్షపడిందంటూ ఎమోషనల్ అయ్యారు. ఎట్టకేలకు ఇంటి సభ్యులకు బిగ్బాస్ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక బిగ్బాస్ వార్నింగ్ కు కంటెస్టెంట్స్ ఎలా రెస్పాండ్ అయ్యారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
బిగ్బాస్ ప్రోమో..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.