Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..

బుల్లితెర అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఫుల్ లిస్ట్ ఇదే అంటూ కొందరు కంటెస్టెంట్స్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. సినీతారలతోపాటు సీరియల్ సెలబ్రెటీలు, సోషల్ మీడియా స్టార్స్ సైతం రాబోతున్నారు. తాజాగా బిగ్‏బాస్ ఫుల్ లిస్ట్ ఇదే అంటూ కొందరు తారల పేర్లు నెట్టింట వైరలవుతున్నాయి.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..
Bigg Boss 9 Telugu

Updated on: Sep 03, 2025 | 7:19 PM

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో ఇప్పటివరకు 8 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు త్వరలోనే సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. దీంతో ఈ సీజన్ గురించి కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఆసక్తికర బజ్ నెలకొంది. ఈసారి హౌస్ లోకి సినీతారలు, సీరియల్ సెలబ్రెటీలు, సోషళ్ మీడియాలో ఫేమస్ అయిన వారిని తీసుకురాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈసారి షోను సరికొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్ కు కంటెస్టెంట్లను హౌస్ లోకి నేరుగా పంపించేవాళ్లు. ఇక కామన్ మ్యాన్ సైతం నేరుగానే హౌస్ లోకి వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు షో ప్రారంభానికి ముందే కొందరు కామన్ మ్యాన్ కేటగిరిలో సెలక్ట్ చేసి.. వారికి అగ్నిపరీక్ష పెట్టారు. ఇందులో పాల్గొని గెలిచిన ఐదు లేదా ఆరుగురిని హౌస్ లోకి పంపనున్నట్లు తెలిపారు. వీరితోపాటు మరికొంత మంది సెలబ్రెటీలను పంపించనున్నారు. తాజాగా బిగ్‏బాస్ కంటెస్టెంట్ ఫుల్ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విడిపోయి.. వేరు వేరు హౌస్ లో ఉండనున్నారట. మొత్తం 15 మంది కంటే ఎక్కువే హౌస్ లోకి వెళ్లనున్నారని.. అందులో సగం ఒక హౌస్ లో ఉంటే.. మరో సగం వేరే హౌస్ లో ఉంటారు. ఆట తీరుని బట్టి కంటెస్టెంట్ ఏ ఇంట్లో ఉండాలో డిసైడ్ చేస్తారట. వీరికి పెట్టే టాస్కులు సైతం కాస్త కొత్తగా ఉండనున్నాయని సమాచారం. ఈసారి మైండ్ గేమ్ తోపాటు ఫిజికల్ టాస్కులు సైతం ఎక్కువే ఉండనున్నాయట. అయితే ఈసారి ప్రేక్షకులకు సుపరిచితమైన సెలబ్రెటీలు ఎంట్రీ ఇవ్వనున్నారట.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఫుల్ లిస్ట్ ఇదే..
సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతుంది. అందులో ఇటీవల కొన్ని రోజులుగా రాను బొంబాయికి రాను ఫోక్ సాంగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సాంగ్ సింగర్ , డ్యాన్సర్ రాము రాథోడ్ ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన బుజ్జిగాడు చిత్రంలో త్రిష చెల్లిగా నటించిన హీరోయిన్ సంజన గల్రానీ సైతం ఎంట్రీ ఇవ్వనుందట. కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్థ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, యంగ్ హీరో హర్షి్త్ రెడ్డి, కమెడియన్ సుమన్ శెట్టి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష, ముద్ద మందారం ఫేమ్ తనూజ, సీరియల్ నటుడు భరణి (స్రవంతి సీరియల్ ఫేమ్) ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ పేర్లు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా కామనర్స్ గా శ్రీజ, పవన్ కళ్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీష్ వెళ్లే అవకాశం ఉంది. అయితే వీరందరిలో ఎవరెవరూ హౌస్ లోకి వెళ్లనున్నారో తెలియాలంటే సెప్టెంబర్ 7వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి :  Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..