Bigg Boss 9 Telugu : ఇదే వద్దు.. ఇష్టమొచ్చినట్లు పోట్రే చేయకు.. తనూజ ఓవరాక్టింగ్.. ఇచ్చిపడేసిన కళ్యాణ్..

బిగ్‌బాస్ సీజన్ 9.. పదవ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం హౌస్ లో బీహీ రాజ్యం పేరుతో టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రాజు కాగా..రీతూ, దివ్య రాణులుగా నియమించారు బిగ్‌బాస్ . అలాగే సంజన, డీమాన్ పవన్, నిఖిల్, తనూజ కమాండర్స్ కాగా.. మిగిలిన కంటెస్టెంట్ రాజ్యంలోని ప్రజలు.

Bigg Boss 9 Telugu : ఇదే వద్దు.. ఇష్టమొచ్చినట్లు పోట్రే చేయకు.. తనూజ ఓవరాక్టింగ్.. ఇచ్చిపడేసిన కళ్యాణ్..
Bigg Boss 9 Telugu (10)

Updated on: Nov 11, 2025 | 8:46 PM

బిగ్‌బాస్ హౌస్ లో ఇప్పుడు కెప్టెన్సీ టాస్కులు జరుగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ కెప్టెన్ గా ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.ఈ వారం బీబీ రాజ్యంగా మారిపోయింది. కళ్యాణ్ కింగ్. దివ్య, రీతూ ఇద్దరూ మహారాణులు. అయితే తనూజ, నిఖిల్, డీమాన్, సంజన నలుగురిని కమాండర్లుగా సెలక్ట్ చేయగా.. మిగిలినవారిని రాజ్యంలోని ప్రజలను సెలక్ట్ చేశారు. వీరి మధ్య బిగ్‌బాస్ టాస్కులు పెడుతున్నాడు. టాస్కులు లేని సమయంలో తమకు నచ్చిన వాళ్లతో సేవలు చేయించుకుంటున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో భరణితో హెడ్ మసాజ్ చేయించుకుంది దివ్య. ఇక దివ్యకు భరణికి మధ్యలో సుమన్ శెట్టి నిల్చువాలని ఆర్డర్ వేయడంతో..మరో శిక్ష వేయండి మహారాణి అంటూ కామెడీ చేశాడు భరణి. ఆ తర్వాత ఆసలైన టాస్కు చూపించారు.

కమాండర్ తన స్థానం నిలబెట్టుకోవడానికి బిల్డ్ ఇట్ టూ విన్ ఇట్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో సుమన్ శెట్టి, సంజన ఇద్దరూ పోటీ పడ్డారు. ఇందులో తమకు కేటాయించిన బాక్సులను ఒక్కొట్టిగా సెట్ చేయాలి. ఈ టాస్కులో సుమన్ శెట్టి హైట్ తక్కువ కావడంతో సంజనకు ప్లస్ అయ్యింది. అయినప్పటికీ సంజకు ఈక్వెల్ గా టవర్ నిర్మించాడు. ఇద్దరిలో విన్నర్ ఎవరనేది తేల్చడం సంచాలక్ కళ్యాణ్ కు పెద్ద టాస్క్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

అయితే ఇద్దరి టవర్స్ ఈక్వెల్ గా ఉన్నాయి.. కానీ టవర్ ఫర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి అంటూ సంజనను విన్ చేయబోయాడు. కానీ అప్పుడే మధ్యలోకి వచ్చిన తనూజ… టవర్ ఫర్ఫెక్ట్ గా ఉండాలని ముందే చెప్పలేదంటూ గొడవ చేసింది. దీంతో కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. నీకు సగం సగం అర్థమైతే సగం సగం చెప్పకు.. ఇష్టమొచ్చినట్లుగా పోట్రే చేస్తే వినడానికి ఎవరూ రెడీగా లేరు అంటూ ఇచ్చిపడేశాడు. దీంతో ఎవడూ పోట్రే చేయలేదు అంటూ తనూజ వాదించడంతో మరోసారి కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. తనూజ ఆగు.. అదే వద్దు అంటూ అడ్డుపడ్డాడు. చివరు తనూజను డెసిషన్ చెప్పమనడంతో తడబడుతూ సుమన్ శెట్టి పేరు చెప్పింది. దీంతో సరే కూర్చో అంటూ కళ్యాణ్ కౌంటరిచ్చాడు.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?