Bigg Boss 9 Telugu: కావాలని కాంట్రావర్సీ చేశారు.. కళ్యాణ్ ఎప్పటికీ సైనికుడే.. మరో వీడియో షేర్ చేసిన జవాన్..

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కళ్యాణ్ పడాల పేరు తెగ మారుమోగుతున్న సంగతి తెలిసిందే. అతడి గురించి పలు కాంట్రవర్సీలు నెట్టింట హల్చల్ చేస్తున్నారు. అతడు ఆర్మీని జవాన్ కాదని.. సీఆర్పీఎఫ్ అంటూ అని.. ఆర్మీలో ఇన్నాళ్లు లీవ్స్ ఇవ్వరంటూ ఓ జవాన్ వీడియో చేశారు. అయితే కళ్యాణ్ కు మద్దతుగా మరో జవాన్ వీడియో బయటకు వదిలిన సంగతి తెలిసిందే.

Bigg Boss 9 Telugu: కావాలని కాంట్రావర్సీ చేశారు.. కళ్యాణ్ ఎప్పటికీ సైనికుడే.. మరో వీడియో షేర్ చేసిన జవాన్..
Bigg Boss (3)

Updated on: Dec 11, 2025 | 3:55 PM

బిగ్ బాస్ సీజన్ 9లో టైటిల్ రేసులో ముందున్న పేరు తనూజ. ఆమెతోపాటు అడుగు దూరంలో ఉన్నాడు కళ్యాణ్ పడాల. కామన్ మెన్ కేటగిరిలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్.. ఇప్పుడు టైటిల్ ఫేవరెట్ అయిపోయాడు. ఓవైపు అతడి ఆట తీరు, ప్రవర్తనకు ఫాలోయింగ్ పెరుగుతుండగా.. ఎలాగైనా అతడిని బ్యాడ్ చేయాలని మరికొంతమంది యాంటీ ఫ్యాన్స్ ట్రై చేస్తున్నారు. ఇక ఇటీవల ఓ బీఎస్ఎఫ్ జవాన్ సుందర్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అందులో అతడు చేసిన కామెంట్స్ కు తమకు అనుగుణంగా మార్చేసి ఆ వీడియోను తెగ షేర్ చేశారు. అందులో కళ్యాణ్ అసలు ఆర్మీయే కాదని.. అతడు సీఆర్పీఎఫ్ అంటూ అతడు చెప్పుకొచ్చారు. అలాగే ఆర్మీలో కంటిన్యూగా 89 రోజులు లేకపోతే విధుల్లో నుంచి డిస్మిస్ చేస్తారంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆ వీడియోను షేర్ చేస్తూ కళ్యాణ్ ను ఆర్మీ నుంచి తీసేసారంటూ ప్రచారం చేశారు. దీంతో అతడికి మద్దతు ఇస్తూ మరో జవాన్ వీడియో షేర్ చేశారు. కళ్యాణ్ ఆర్మీ అని.. అతడు తనతోనే వర్క్ చేశాడంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో తన మాటలపై క్లారిటీ ఇస్తూ మరో వీడియో షేర్ చేశారు జవాన్ సుందర్. “కళ్యాణ్ పడాల ఇండియన్ ఆర్మీ కాదు.. సీఆర్పీఎఫ్ అని ఒక వార్త ట్రెండ్ అవుతుంది. ఆర్మీ అయినా సీఆర్పీఎఫ్ అయినా డిఫెన్స్ కు సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ అయినా చేసేది దేశ సేవే. 89 రోజుల తర్వాత డిఫెన్స్ నుంచి డిస్మిస్ చేస్తారా లేదా అనే కళ్యాణ్ బయటకు వస్తే తెలుస్తుంది. అదే విషయం గురించి ఒక క్లారిటీ మాత్రమే ఇచ్చాను. అంతేకానీ కళ్యాణ్ ను బ్యాడ్ చేయాలని కాదు. అలాంటి ఉద్దేశం నాకు లేదు. నేను చెప్పిన వీడియోను అర్థం చేసుకోకుండా కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ కళ్యాణ్ ను బ్యాడ్ చేయాలనుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఒకసారి సైనికుడు అయితే ఎప్పటికీ అతడు సైనికుడే. హౌస్ లో కళ్యాణ్ ఎక్కడా కూడా సైనికుడిలా ఉండట్లేదు. అతడు జెన్యూన్ పర్సన్ లాగే ఉంటున్నాడు. అతడు చాలా మంచి వ్యక్తి. గెలిపించండి. కళ్యాణ్ ఎదుగుతుంటే చూడలేవా అని కామెంట్ చేశారు. అతడికి 5వేల ఫాలోవర్స్ ఉన్న సమయంలోనే ఒక సైనికుడు తన కల నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాడని వీడియో చేశాను. అది లక్షకు వెళ్లింది. అతడిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా సపోర్ట్ అతడికే ” అంటూ ఆ వీడియో చెప్పుకొచ్చాడు. దీంతో కళ్యాణ్ పై యాంటీ ఫ్యాన్స్ కావాలనే బురద జల్లుతున్నారని అభిమానులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..