Bigg Boss Agnipariksha: బిగ్‏బాస్ అగ్నిపరీక్షలో సిద్ధిపేట మోడల్‏కు షాక్.. ముగ్గురు జడ్జిలు మూడు రకాలు బాబోయ్..

బిగ్‏బాస్ రియాల్టీ షో త్వరలోనే స్టార్ట్ కానుంది. అయితే ఈసారి సీజన్ 9 కాస్త భిన్నంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కామన్ మ్యాన్ ఎంట్రీ పేరుతో జనాల నుంచి అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇక 40 మందిని సెలక్ట్ చేసి.. అందులో సరైన కంటెస్టెంట్లను సెలక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష పేరుతో మరో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.

Bigg Boss Agnipariksha: బిగ్‏బాస్ అగ్నిపరీక్షలో సిద్ధిపేట మోడల్‏కు షాక్.. ముగ్గురు జడ్జిలు మూడు రకాలు బాబోయ్..
Bigg Boss Agnipariksha

Updated on: Aug 24, 2025 | 1:52 PM

బిగ్‏బాస్ సీజన్ 9 త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులకు అసలైన పరీక్ష పెడుతున్నారు. ఈ షోలో అభిజిత్, బిందుమాధవి, నవదీప్ ముగ్గురు జడ్జిలుగా ఉండగా.. శ్రీముఖి హోస్టింగ్ చేస్తుంది. ఇప్పటికే బిగ్‏బాస్ అగ్నిపరీక్షలో చిరాకు తెప్పించిన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. కొందరిని హోల్డ్ లో పెట్టగా.. మరికొందరిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. మూడో ఎపిసోడ్ లో మొదటగా ఆర్మీ జవాన్ వచ్చారు. విజయనగరంకు చెందిన జవాన్ పేరు కళ్యాణ పడాల. అసలు పేరు పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఏం చేస్తున్నావని అడగ్గా.. మూడేళ్లుగా సైనికుడిగా దేశానికి సేవ చేస్తున్నానని.. కానీ తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఒకవేళ బిగ్‏బాస్ గెలిచి ఆఫర్స్ వస్తే ఆర్మీకి రిజైన్ చేస్తానని అన్నాడు. షో నుంచి ఎలిమినేట్ అయితే తిరిగి ఆర్మీకి వెళ్లిపోతానని అన్నాడు. అతడి క్లారిటీ నచ్చినప్పటికీ.. నేరుగా టాప్ 15కు పంపించకుండా హోల్డ్ లో పెట్టారు.

ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

సింగర్, డ్యాన్సర్ అంటూ స్టేజీపైకి వచ్చాడు షకీం. కానీ స్టేజ్ పై సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయాడు. కానీ అతడికి జడ్జి నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి నెక్ట్స్ రౌండ్ కు పంపించాడు. ఇక సిద్దిపేట మోడల్ స్టేజీపైకి రాగానే అతడి మాట తీరు జడ్జిలకు నచ్చలేదు. దీంతో నువ్వు ఇప్పటికే సెలబ్రెటీవి అంటూ అతడిని పంపించేశారు. ఇక ఇన్ ఫ్లుయెన్సర్ అనూష రత్నం తన స్టోరీ చెప్పి కన్నీళ్లు పెట్టించింది. నామినేషన్స్ చేయడంలో తడబడినప్పటికీ ఆమెను టాప్ 15లోకి పంపించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ, డాక్టర్ నిఖితను హోల్డ్ లో పెట్టారు. రివ్యూయర్ ఉత్తర ప్రశాంత్, ఖమ్మం టెడ్డీ బేర్ సహా చాలా మందిని రిజెక్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..

ఇక 19 ఏళ్ల అమ్మాయి శ్రేయను టాప్ 15లోకి పంపించారు. అదే వయసు ఉన్న అబ్బాయి జనిత్ ను ఎలిమినేట్ చేశారు. తండ్రి చనిపోయినప్పటికీ అన్నీ తానై తన తల్లి చూసుకుందని.. కానీ ఒక ప్రమాదంలో ఆమెకు 80 శాతం గాయాలయ్యాయని అన్నాడు. తాను ఎంటర్ ప్రెన్యూర్ కావాలనుకుంటున్నానని చెప్పాడు. ఇప్పటివరకు టాప్ 15లో ఆరుగురిని మాత్రమే సెలక్ట్ చేశారు. 16 మందిని హోల్డ్ లో పెట్టారు. వీరికి మరిన్ని టాస్కులు పెట్టి ఎంపిక చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..