బిగ్బాస్ హౌస్లో ఆకలి కేకలు మొదలయ్యాయి. రేషన్ మొత్తం లాగేసుకుని.. టాస్కులు పెట్టి గెలిచినవాళ్లకే ఫుడ్ అంటూ అసలు ఫిటింగ్ పెట్టాడు బిగ్బాస్. దీంతో మొదటి రౌండ్ లో యష్మీ టీమ్, ఆ తర్వాత నైనిక టీం గెలవడంతో రెండు టీమ్స్ కే రేషన్ ఇచ్చాడు. దీంతో ఓడిపోయిన నిఖిల్ టీమ్ కు ఆకలి కేకలే మిగిలాయి. అయితే ఇప్పటికే రేషన్ గెలుచుకున్న యష్మీ.. తన టీమ్ సభ్యులతో కలిసి నైనిక రేషన్ దొంగిలించడం స్టార్ట్ చేసింది. ముందుగా ప్రేరణతో కలిసి నైనిక టీం గెలుచుకున్న రేషన్ లో కొద్దిగా కొద్దిగా కొట్టేసింది. చివరకు చికెన్ కూడా దొంగిలించింది. ఇక రేషన్ పై సమాన హక్కు ఉందంటూ మణికంఠ వాదించాడు. కానీ ఎవరు నిఖిల్ టీంతో షేర చేసుకోలేదు. దీంతో వాళ్ల దగ్గర ఉన్న జ్యూ్స్ బాటిల్స్ అన్ని కొట్టేద్దాం అంటూ తన చీఫ్ నిఖిల్ కు సలహా ఇచ్చాడు.
ఆ తర్వాత మా చికెన్ యష్మీ టీమ్ కొట్టేసిందంటూ నిఖిల్ తో చెప్పాడు నబీల్. అయితే మీరు కూడా దొంగిలించండి అంటూ నిఖిల్ సలహా ఇవ్వడంతో యష్మీ టీం రేషన్ కొట్టేశాడు నబీల్. ఇక యష్మీ టీం గెలుచుకున్న పల్పీ ఆరెంజ్ విష్ణుప్రియ తాగేందుకు ట్రై చేయగా.. యష్మీ, ప్రేరణ లాక్కోవడానికి ప్రయత్నించారు. ఇక మొదటి రోజు నుంచే ఎమోషనల్, డల్ గా ఉన్న మణికంఠ.. తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం కామెడీ అదరగొట్టాడు.
రేషన్ గెలుచుకున్న నైనిక దగ్గరకెళ్లి ఏమైనా ఇవ్వు ప్లీజ్ అంటూ అడిగాడు. రేయ్ ఏంట్రా ఇది అంటూ నిఖిల్ అడగ్గా.. నీకేం తెలుసురా.. రెండు రోజులు అయ్యింది తిని.. ఆకలేస్తుందని మణికంఠ అన్నాడు. నన్ను తింటున్నావ్ కదరా.. ఐదు కిలోలు తగ్గాను నీవల్ల.. నా రక్తం తాగుతున్నావ్ కదరా అంటూ నిఖిల్ కామెడీ చేశాడు. ఆ తర్వాత కిందపడిపోయి.. నా కళ్లు తిరుగుతున్నాయ్.. ఎవరైనా ముఖాన పల్పీ ఆరెంజ్ జల్లండి ప్లీజ్ అంటూ కామెడీ చేశాడు మణికంఠ. మొత్తానికి రేషన్ గెలుచుకున్న నైనిక, యష్మీ దొంగతనాలు చేస్తూ ఉండిపోగా.. ఆకలితో అల్లాడిపోయారు నిఖిల్, మణికంఠ..
బిగ్బాస్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.