బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1 న 14 మంది కంటెస్టెంట్లతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో సక్సెస్ ఫుల్ గా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడు వారాల్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అదే సందర్భంలో ఆరో వారంలో మరో 8 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ సహాయంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక ఎనిమిదో వారంలో నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బుధవారం ( అక్టోబర్ 23) నాటి ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ రానుంది. కాగా తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కొన్ని నిమిషాల క్రితమే రిలీజైది. నామినేషన్స్ ప్రక్రియ దాదాపుగా ముగియడంతో ఇక బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు, గేముల గోల మొదలైంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. కంటెస్టెంట్స్ ను భయ పెట్టేలా, అసలు నిద్రపోకుండా ఓ ముగ్గురు కలిసి ఒక పెద్ద స్కెచ్ వేశారు.
లేటెస్ట్ గా రిలీజైన ప్రోమో ప్రకారం.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న గంగవ్వ అర్ధరాత్రి బిగ్గరగా కేకలు వేస్తూ కనిపించింది. దీంతో అందరూ ఉలిక్కి పడి లేచారు. ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఒక్కసారిగా బయటకు పరిగెత్తారు. అక్కడ గంగవ్వను చూసిన కంటెస్టెంట్స్ గజ గజ వణికిపోయారు. గంగవ్వ దగ్గరకు వెళ్లి ఏమైందో తెలసుకుందామని ప్రయత్నించినా ఆమె అరుపులు, కేకలకు భయపడిపోయారు. ఆ తర్వాత అవినాష్, టేస్టే తేజ గంగవ్వను ధైర్యంతో మెల్లగా గదిలోకి తీసుకెళ్లి తన బెడ్‌పై నిద్రపుచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి గంగవ్వకు దెయ్యం పట్టిందేమో అంటూ చర్చ మొదలెట్టేశారు. ముఖ్యంగా ‘నాకైతే నిద్ర కూడా రావడం లేదు’ అంటూ రోహిణి, హరితేజ తెగ చర్చించుకున్నారు.
అయితే ఆ తర్వాత ఇది పూర్తిగా ఫ్రాంక్ అని తేలిపోయింది. టేస్టీ తేజ, ముక్కు అవినాశ్, గంగవ్వ ముగ్గురు కలిసి మాట్లాడుకునే ఈ స్కారీ ఫ్రాంక్ చేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వీళ్లు ముగ్గురు కలిసి ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. మరి గంగవ్వ స్కేరీ ఫ్రాంక్ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.