ఎంటర్టైన్మెంట్ తక్కువ.. కోట్లాటలు ఎక్కువ అన్నట్లుగా ఉంది ఈసారి బిగ్బాస్ సీజన్ 8. టాస్కులు ఆడండి బాబూ అంటే కొట్టుకున్నంత పని చేశారు. హౌస్ లో జరుగుతున్న ఓవర్ స్మార్ట్ గేమ్ కాస్తా వయెలన్స్ అయిపోయింది. గతంలో బిగ్బాస్ సీజన్ 4లో జరిగిన ఛార్జింగ్ టాస్కునే మళ్లీ పెట్టారు. అప్పట్లో ఫన్నీగా సాగిన ఈ టాస్కు.. ఇప్పుడు మాత్రం ఓవర్ వయెలన్స్ కు దారితీసింది. నిఖిల్, గౌతమ్ ఇద్దరూ కొట్టుకోవడానికే రెడీ అయ్యారు. ఇద్దరి మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఇంతకీ గురువారం (అక్టోబర్ 17) ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఓజీ క్లాన్ ఎంతకీ ఛార్జ్ ఇవ్వకపోవడంతో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేసేద్దామని ప్లాన్ చేసింది రాయల్ క్లాన్. దీంతో మణికంఠను పట్టుకుని లాగేశారు. దీంతో నిఖిల్ తోపాటు ఓజీ క్లాన్ మొత్తం అడ్డుపడింది. అందరూ మణికంఠ కోసం పోరాడుతుండగా.. తెలివిగా యష్మిని లోపలికి లాగేశాడు అవినాష్. దీంతో వెంటనే టేస్టీ తేజ డోర్ క్లోజ్ చేశాడు. యష్మిని బయటకు తీసుకువచ్చేందుకు ఓజీ క్లాన్ చేయగా.. ఛార్జ్ పెట్టుకోవడానికి ట్రై చేశాడు అవినాష్. దీంతో యష్మి తెలివిగా కేబుల్ తెంపేసి ఊడిపోయిందని చెప్పడంతో ఆమెను వదిలేశారు.
సైరన్ కు సైరన్ కు మధ్యలో ఛార్జింగ్ పాట్ ను పగలగొట్టినందుకు ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ నుంచి ఒక సభ్యుడిని కంటెండర్ షిప్ నుంచి తప్పించాలని బిగ్బాస్ చెప్పడంతో రాయల్ క్లాన్ ఎగిరి గంతేసింది. మరోవైపు పాట్ పగలగొట్టలేదంటూ ఓజీ క్లాన్ ఆరోపించింది. తర్వాత మణికంఠ వాష్ రూమ్ వెళ్లగా అతడి వెనకాలే వెళ్లిపోయింది విష్ణుప్రియ.దీంతో రాయల్ క్లాన్ సభ్యులు లోపలికి వెళ్పిపోయారు. పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాం కాబట్టి రెండు పాయింట్స్ ఛార్జింగ్ ఇస్తామని డీల్ చేశాడు నిఖిల్. ఇంతలోనే మణికంఠ నుంచి బలవంతంగా ఛార్జ్ తీసుకోవడానికి ట్రై చేశారు రాయల్ క్లాన్. దీంతో వాష్ రూం బయట ఉన్న తేజను పక్కకు లాగేశాడు నిఖిల్. అప్పుడే నిఖిల్ ను వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు గౌతమ్. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. గౌతమ్ ను పక్కకు లాగేశాడు నబీల్.
ఈ గొడవలోకి మెహబూబ్ రాకుండా పృథ్వీ ఆపేశాడు. దీంతో పృథ్వీని టాస్కు నుంచి తొలగిస్తున్నట్లు చెప్పాడు అవినాష్. నిఖిల్, గౌతమ్ మధ్య తోపులాట జరిగింది. గౌతమ్ చేతులతో గుద్దుతున్నాడంటూ నబీల్ ఆరోపించగా.. నేను తోయలేదంటూ గొడవ చేశాడు గౌతమ్. దీంతో కోపంలో గౌతమ్ మెడ పట్టుకొని పక్కనే ఉన్న సోఫాపైకి విసిరేశాడు. కొడితే నేనూ కొడతా అంటూ నిఖిల్ అరవడంతో నేను కొట్టలే.. కావాలని కొట్టలేదు అంటూ గౌతమ్ వాయిస్ రెయిజ్ చేశాడు గౌతమ్. ఎక్కువ తక్కువ మాట్లాడకు అంటూ గార్డెన్ ఏరియాలో కొట్టుకున్నంత పనిచేసారు గౌతమ్, నిఖిల్. బయట ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ మధ్య గొడవ జరుగుతుంటే మెల్లిగా ఫుడ్ పట్టుకొచ్చేశాడు పృథ్వీ. కాసేపటికి ఈ గొడవ తగ్గిపోవడంతో లైటర్ కావాలంటూ హరితేజను అడిగాడు పృథ్వీ. నిఖిల్ కూడా లైటర్ కావాలని అడగడంతో ఛార్జింగ్ ఇస్తారా అంటూ హరితేజ డీలింగ్ చేసింది. మొత్తానికి హౌస్ లో మాత్రం కొట్టుకున్నంత పనిచేశారు హౌస్మేట్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.