Bigg Boss 8 Telugu: సోనియా ఎలిమినేట్.. మళ్లీ ఆమె కోసం అతడే బలి.. ?

| Edited By: Ram Naramaneni

Sep 29, 2024 | 10:03 PM

ఇటు అడియన్స్ కూడా సోనియా ప్రవర్తనపై మండిపడుతున్నారు. సోనియాను ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సోనియా ఉంటే నిఖిల్ ఆట దెబ్బతింటుందని భావించిన అతడి ఫ్యాన్స్ సోనియాకు కాకుండా మిగతా కంటెస్టెంట్లకు ఓటింగ్ వేయడంతో ఈసారి సోనియాకు అతి తక్కువ ఓటింగ్ వచ్చింది.

Bigg Boss 8 Telugu: సోనియా ఎలిమినేట్.. మళ్లీ ఆమె కోసం అతడే బలి.. ?
Sonia Akula
Follow us on

గత సీజన్లతో పోలిస్తే ఈసారి అత్యధిక నెగిటివిటీ సంపాందించుకుంది సోనియా ఆకుల. బిగ్‏బాస్ షో స్టార్ అయ్యి నెల రోజులు పూర్తి కాకుండానే ఎక్కువగా వ్యతిరేకత తెచ్చుకుంది సోనియా. మొదటి వారంలో హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది సోనియా. పాయింట్ టూ పాయింట్ వాయిస్ రేయిజ్ చేసి మాట్లాడడంతో అందరూ ఆమెను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. ఆమె టాకింగ్ పవర్ చూసి అంతా షాకయ్యారు. దీంతో టాప్ 5లో సోనియా పక్కా అనుకున్నారు. కానీ వారం తిరక్కుండానే సోనియాపై నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది. విష్ణు ప్రియ జోక్ చేస్తే అడల్ట్ రేటెడ్ కామెడీ అంటూ పెద్ద రచ్చ చేసిన సోనియా.. ఆ తర్వాత తోటి కంటెస్టెంట్ల పట్ల తాను ఎలా మాట్లాడుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోతుంది. అలాగే అటు నిఖిల్, ఇటు పృథ్వీలతో అన్నా, తమ్ముడు, పెద్దోడు, చిన్నోడు అంటూ ఓ గ్రూప్ నడుస్తోంది. వీరి ముగ్గురి పై అటు హౌస్ లోనే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇటు అడియన్స్ కూడా సోనియా ప్రవర్తనపై మండిపడుతున్నారు. సోనియాను ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సోనియా ఉంటే నిఖిల్ ఆట దెబ్బతింటుందని భావించిన అతడి ఫ్యాన్స్ సోనియాకు కాకుండా మిగతా కంటెస్టెంట్లకు ఓటింగ్ వేయడంతో ఈసారి సోనియాకు అతి తక్కువ ఓటింగ్ వచ్చింది.

మొదటి నుంచి నామినేషన్స్ లో రాకుండా ఉన్న సోనియా.. నాలుగో వారం నామినేషన్స్ కు వచ్చింది. ఈవారం నెట్టింట ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే సోనియాకు అంతగా ఓట్లు వచ్చినట్లు కనిపించడం లేదు. నాలుగో వారం నబీల్ 36 శాతం ఓటింగ్ తో రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఇక ఆ తర్వాత హౌస్ మొత్తం టార్గెట్ చేయడంతో అడియన్స్ మణికంఠకు సపోర్ట్ చేశారు. దీంతో సెకండ్ పొజిషన్ లో మణి ఉన్నాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆల్రెడీ నబీల్ సేఫ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు మిగత కంటెస్టెంట్స్ సేవ్ కాగా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియనుంది. నాలుగో వారం ఓటింగ్ లో నబీల్ 36 శాతంతో ఫస్ట్ పొజిషన్ లో ఉండగా.. సెకండ్ మణికంఠ, మూడవ స్థానంలో ప్రేరణ.. నాల్గవ స్థానంలో ఆదిత్య ఓం ఉన్నారు. ఇక చివరగా డేంజర్ జోన్ లో పృథ్వీ, సోనియా ఉన్నారు.

అయితే నిఖిల్ ఫ్యాన్స్ సోనియాకు కాకుండా పృథ్వీకి, ఆదిత్య ఓంకు ఓటింగ్ వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అందరి కంటే తక్కువ ఓటింగ్ తో సోనియా చివరి స్థానంలో ఉండిపోయింది. సోషల్ మీడియాలో నమోదైన పోలింగ్ బట్టి చూస్తే ఈరోజు హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ కావడం ఖాయం. కానీ బిగ్‏బాస్ చేసే మ్యాజిక్ లో భాగంగా ఆమెను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూంకు పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని.. సోనియాతోపాటు ఆదిత్య ఓం కూడా ఎలిమినేట్ కానున్నాడని తెలిస్తే. ఒకవేళ సీక్రెట్ రూం ఉపయోగిస్తే మాత్రం సోనియాను ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూం పంపిస్తారని.. ఆమెను సేవ్ చేయడానికి ఆదిత్య ఓంను బయటకు పంపించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు బిగ్‏బాస్ అడియన్స్. ఓటింగ్ ప్రకారం మాత్రం సోనియా ఎలిమినేట్ కావాలి.. కానీ బిగ్‏బాస్ లెక్కల ప్రకారం ఆమెను సేవ్ చేసి సోనియా స్థానంలో మణికంఠ లేదా ఆదిత్య ఓం బయటకు పంపనున్నారని తెలుస్తోంది. బిగ్‏బాస్ ఎలిమినేషన్ పై మరికొన్ని గంట్లలో తెలియనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.