Bigg Boss 8 Telugu: రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌ను ప్రకటించిన బిగ్ బాస్.. ఎవరో గుర్తు పట్టారా?

|

Oct 04, 2024 | 2:12 PM

మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెడితే ఇప్పటివరకు 4 బయటకు వచ్చేశారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌజ్​లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇదిలా ఉంటే గత కొన్నిరోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం జరుగుతోంది.

Bigg Boss 8 Telugu: రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌ను ప్రకటించిన బిగ్ బాస్.. ఎవరో గుర్తు పట్టారా?
Bigg Boss 8 Telugu
Follow us on

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్​ 8 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ కొత్త సీజన్ ఇప్పుడు ఐదో వారం ఎండింగ్‌లోకి వచ్చేసింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెడితే ఇప్పటివరకు 4 బయటకు వచ్చేశారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌజ్​లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇదిలా ఉంటే గత కొన్నిరోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త కంటెస్టెంట్స్ కాకుండా గతంలో బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన మాజీ కంటెస్టెంట్లనే మళ్లీ తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ముక్కు అవినాశ్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజా, హరి ప్రియ, రోహిణీ.. ఇలా పలువురి ప్రముఖులు వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పై వరుసగా అప్ డేట్ ఇస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

ఇప్పటికే ఫస్ట్​ వైల్డ్​ కార్డ్​ కంటెస్టెంట్​ ఫొటో రిలీజ్​ చేసిన బిగ్ బాస్ నిర్వాహకులు.. తాజాగా రెండో కంటెస్టెంట్​ ఫొటో రిలీజ్​​ చేశారు. అయితే ఇందులో కూడా ముఖం చూపించకుండా ఆడియెన్స్ నే గెస్​ చేయమంటున్నారు. మరి.. ఆ వ్యక్తి ఎవరో మీరు గుర్తుపట్టగలరా? దీనిని చూసిన బిగ్ బాస్ అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన పేర్లను కామెంట్లుగా పెడుతున్నారు. అయితే ఈ ఫొటోను చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 3లో సందడి చేసిన రోహిణీనే అంటున్నారు చాలా మంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ రెండో వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్ ఫొటో ఇదే..

 

మూడో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ బజర్దస్త్ నటి హౌస్ లో ఉన్నన్ని రోజులు బాగానే ఎంటర్ టైన్ చేసింది. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. మరి రోహిణీ ఈసారి ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందో వేచి చూడాలి.

 బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.