Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే జరిగేది అప్పుడే.. ఎన్ని రోజుల్లో ముగియనుందంటే..

|

Dec 02, 2024 | 3:10 PM

బిగ్‏బాస్ సీజన్ 8 ఇప్పుడు బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతుంది. మొత్తం 14 మందితో స్టార్ట్ అయిన ఈ షో..ఇప్పుడు ఫైనల్ కు చేరింది. ఈవారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం హౌస్ నుంచి టేస్టీ తేజ బయటకు రాగా.. ఆదివారం పృథ్వీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే జరిగేది అప్పుడే.. ఎన్ని రోజుల్లో ముగియనుందంటే..
Bigg Boss 8 Telugu
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 8.. మొత్తం ఇన్ఫినిటీ అంటూ ముందు నుంచి హైప్ పెంచేశారు హోస్ట్ నాగార్జున. అలాగే ఈ సీజన్ ఫ్రైజ్ మనీ ముందే ఫిక్స్ చేయకుండా కంటెస్టెంట్స్ ఆట.. ప్రవర్తన పై ఆధారపడేలా చేశారు. టాస్కులలో గెలిచిన ప్రతిసారి ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది వచ్చింది. ప్రస్తుతం ఈ సీజన్ ప్రైజ్ మనీ రూ.54 లక్షల 30 వేలకు చేరింది. అయితే ఈ మూడు వారాల్లో ప్రైజ్ మనీ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. దీంతో ఇప్పుడు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎప్పుడు జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం నెట్టింట వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్‏బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 15న ప్రసారం కానుందని టాక్. అంటే మరో పద్నాలుగు రోజుల్లో ఈ సీజన్ ముగియనుందని తెలుస్తోంది. ఇక ఈ సారి గ్రాండ్ ఫినాలేను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. స్టార్ హీరోయిన్లతో ఆటపాటలే కాకుండా విజేతకు ట్రోఫీ అందించేందుకు కొత్తగా గెస్టును కూడా పిలుస్తున్నారట. గత సీజన్ లో ఎవరు గెస్టుగా రాలేదు. నాగార్జున మాత్రమే విజేతకు ట్రోఫీ అందించారు. కానీ ఈసారి సీజన్ 8 కోసం స్టార్ హీరోను అతిథిగా పిలవలనుకుంటున్నారట.

ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అయినా ఇప్పటికీ హౌస్ లో ఏడుగురు హౌస్మేట్స్ ఉన్నారు. దీంతో వచ్చే వారం కూడా డబుల్ ఎలిమినేషన్ జరగనుందని సమాచారం. అయితే ఈసారి ఎవరెవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది తెలియాల్సి ఉంది. గత వారం మాదిరిగానే వీకెండ్ ఎలిమినేషన్ కాకుండా ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని.. ఆ తర్వాత ఆదివారం మరొకరిని బయటకు పంపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అవినాష్ టాప్ 5లో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మిగిలిన స్థానాల్లో గౌతమ్, నబీల్, నిఖిల్ ఉండనున్నారు. ఇక ఇప్పుడున్న ముగ్గురు అమ్మాయిలు విష్ణు, ప్రేరణ, రోహిణి.. ఈ ముగ్గురిలో ఎవరు టాప్ 5కి వెళ్తారనేది తెలియాల్సి ఉంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.