బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ షో ప్రారంభమై ఆరు వారాలు గడిచాయి. ఏడో వారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. కొత్త సీజన్ ప్రారంభంలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరిలో ఆరుగురు ఎలిమినేట్ కాగా, మరో 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. మొత్తానికి పాత కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. కాగా ఈ సీజన్‌లో హౌస్ లోకి అడుగు పెట్టిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో స్టార్ యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. ఇంకా నిజం చెప్పాలంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాక ముందు బిగ్ బాస్ హౌస్ లో బాగా తెలిసిన ఫేస్ ఎవరిదైనా ఉందంటే అది విష్ణుప్రియనే. దీంతో సీజన్ ప్రారంభం నుంచే ఈ స్టార్ యాంకర్ కు బిగ్ బాస్ ఆడియెన్స్ మద్దతు బాగా లభిస్తోంది. అదుకు తగ్గట్టుగానే హౌస్ లో అదరగొడుతోంది విష్ణు ప్రియ. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంటోంది. అలాగే అవసరమైనప్పుడు మాటకు మాట చెబుతూ కూడా ఆకట్టుకుంటోంది. ఇక బిగ్ బాస్ ఓటింగ్ లోనూ విష్ణు ప్రియ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. నామినేట్ అయిన ప్రతివారం విష్ణుప్రియనే ఓటింగ్ లో టాప్ గా నిలుస్తోంది. అంటే ఆమెకు బయట నుంచి కూడా బాగానే మద్దతు లభిస్తోంది.
ఇదిలా ఉంటే విష్ణుప్రియకు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇందులో ఆమె స్కూల్ పిల్లలకు విద్య సామగ్రా పంపిణీ చేస్తూ కనిపించింది. అలాగే చిన్న పిల్లలతో సరదాగా ఆటలాడుకుంటూ, ముచ్చట్లు చెప్పింది. ఒక ప్రముఖ ఎన్‌జీవో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ అల్లరి పిల్లగా కనిపించే విష్ణుప్రియలో ఇంత హెల్పింగ్ నేచర్ ఉందా? బ్యూటిఫుల్ వీడియో అంటూ స్టార్ యాంకర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి