Nabeel Afridi: గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి కొత్త కారు కొన్న బిగ్ బాస్ ఫేమ్ నబీల్ .. ధర ఎన్ని లక్షలో తెలుసా? వీడియో

బిగ్ బాస్ రియాల్టీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నబీల్‌ అఫ్రిది ఒకడు. బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ వరంగల్ కుర్రాడు తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఏకంగా సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Nabeel Afridi: గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి కొత్త కారు కొన్న బిగ్ బాస్ ఫేమ్ నబీల్ .. ధర ఎన్ని లక్షలో తెలుసా? వీడియో
Nabeel Afridi

Updated on: Apr 20, 2025 | 5:51 PM

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ నబీల్ అఫ్రిది గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ కు రాక ముందు వరంగల్‌ డైరీస్‌ యూట్యూబ్‌ ఛానల్‌తో బాగా ఫేమస్‌ అయ్యాడీ తెలంగా కుర్రాడు. అలా వచ్చిన గుర్తింపుతో తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. తన ఆట తీరుని చూసి బిగ్ బాస్ టైటిల్ గెలుస్తానుకున్నారు చాలా మంది. ముఖ్యంగా నిఖిల్, గౌతమ్ కృష్ణలకు గట్టి పోటీ ఇచ్చాడీ వరంగల్ అబ్బాయి. అయితే షో ఎండింగ్ లో అనవసరమైన కమ్యూనిటీ కామెంట్స్ తో నెగటివిటీ మూట గట్టుకున్నాడు. చివరకు టైటిల్ కు దూరమయ్యాడు. మొత్తానికి బిగ్ బాస్ తో మరింత ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు నబీల్. తాజాగా ఈ వరంగల్ కుర్రాడు లగ్జరీ కారు కొన్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఆద్యారెడ్డి తో కలిసి వెళ్లి XUV700 AX7 లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. అనంతరం ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేశాడు నబీల్.

‘ఎప్పటికైనా 7 సీటర్ కారు కొనాలనేది నా కల. అందులో భాగంగానే XUV700 AX7 లగ్జరీ కారుని కొన్నాను. దీంతో నా కల సాకారమైంది. కేవలం నోట్‌ప్యాడ్‌తో.. సున్నా సబ్‌స్క్రైబర్‌లు.. సున్నా ఫాలోయర్‌లతో ఒక సాధారణ యూట్యూబర్‌గా నా ప్రయాణం మొదలుపెట్టాను. ఎన్నో కష్టాలు చవి చూశాను. నిద్రలేని రాత్రులు గడిపాను. వాటి శ్రమ ఫలితమే ఇది. నా లైఫ్‌లో ఇది ఒక కారు మాత్రమే కాదు.. ఒక మైలురాయి. నాకు ఇది సాధ్యమైంది.. మీకు కూడా సాధ్యం అవుతుంది. కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకునే దిశగా కష్ట పడండి. అనుకున్నది సాధించండి’ అంటూ తన లాంటి ఔత్సాహికులకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు నబీల్ అఫ్రిది.

ఇవి కూడా చదవండి

కొత్త కారులో నబీల్ అఫ్రీది.. వీడియో..

 

నబీల్ అఫ్రిది షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. దీనిని చూసిన బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వరంగల్ కుర్రాడకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నబీల్ కొన్న ఈ లగ్జరీ కారు మోడల్ మహీంద్రా ఎక్స్ యూవీ 700 ఏఎక్స్ 7 (XUV700 AX7 Luxury). మార్కెట్ లో దీని ధర.. రూ. 26 లక్షలు వరకూ ఉంది. ఇక ఆర్టీవో ఫీజ్ రూ.3.22 లక్షలు, ఇన్సూరెన్స్ 70 వేలు, టీసీఎస్ రూ.25 వేలు.. ఇవన్నీ కలుపుకుంటే.. ఈ కారు ఇంటికి వచ్చేసరికి సుమారు లక్షరాల మూప్పై లక్షలు అవుతుంది. ఇక అదనంగా ఫీచర్స్ ఏమైనా కావాలంటే మరో ఐదు లక్షల వరకూ ఖర్చులుంటాయని తెలుస్తోంది.

సామాజిక సేవా కార్యక్రమాల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.