బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నంత మాత్రాన ఎవరి తలరాతలేమీ మారవు. జస్ట్ నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. కొన్ని రోజుల పాటు జనాల నోళ్లల్లో నానుతారు. బిగ్ బాస్‌తో ఇబ్బడిముబ్బడిగా సినిమా అవకాశాలొస్తాయని, స్టార్లుగా వెలుగొందవచ్చన్నది కేవలం ఊహాజనితం మాత్రమే. ఇప్పటివరకు బిగ్ బాస్ టైటిల్స్ గెలిచిన వారిని ఒక్కసారి గమనిస్తే నిజమేనని ఒప్పుకోక మానరు. అలా ఏడో సీజన్‌లో కూడా మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. బుల్లితెర సెలబ్రిటీలు, సినిమా నటులను కాదని కామన్ మ్యాన్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. అయితే ఎప్పటిలాగే ఏడో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌లో చాలామందికి సినిమా అవకాశాలు వస్తున్నాయన్న వార్తలు గుప్పమంటున్నాయి. అందులో ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పేరు బాగా వినిపిస్తోంది. బిగ్ బాస్ చరిత్రలోఎన్నడూ లేనంతగా ఈసారి విజేత పల్లవి ప్రశాంత్ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు చాలా కారణాలున్నాయి. గ్రాండ్ ఫినాలే అనంతరం జరిగిన అల్లర్లు, అరెస్టులు, రిమాండ్స్.. ఇలా పల్లవి ప్రశాంత్ పేరు ఇప్పటికీ వినిపిస్తోంది. అదే సమయంలో రైతు బిడ్డ కూడా సినిమాల్లోకి వస్తున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాట బిడ్డ భోలే షావలి కూడా రైతు బిడ్డ సినిమా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా బిగ్ బాస్ పెద్దన్న శివాజీ కూడా పల్లవి ప్రశాంత్ సినిమా కెరీర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పల్లవి ప్రశాంత్‌కు చక్కగా యాక్టింగ్ నేర్పించే వాళ్లు ఉంటే అతని స్థాయి కచ్చితంగా పెరిగిపోతుందన్నాడు. అలాగే ప్రిన్స్ యావర్‌లోనూ హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు శివాజీ.
పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌ల ట్యాలెంట్, యాక్టింగ్ స్కిల్స్ నాకు బాగా తెలుసు. వారికి మంచి అవకాశాలొస్తే స్టార్ హీరోలుగా ఎదుగుతారు. నావద్ద సినిమా తీసే కెపాసిటీ లేదు కానీ ఉంటే మాత్రం వాళ్లతో కచ్చితంగా ఓ సినిమా చేసేవాడిని. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ కు కొంచెం యాక్టింగ్ నేర్పిస్తే నెక్ట్స్ లెవెల్‌కు వెళతాడు. నాకు తెలిసిన నిర్మాతలు, దర్శకులకు చెప్పైనా సరే ప్రశాంత్, ప్రిన్స్‌లకు సినిమా అవకాశాలు వచ్చేలా చేస్తాను. ఇది నేను స్వతహాగా తీసుకున్న నిర్ణయం కానీ అంతే కానీ ప్రిన్స్, ప్రశాంత్‌లేమీ అడగలేదు. ఏదో ఫేమ్ కోసం నేను ఇది చేయడం లేదు. నా ఫ్రెండ్స్‌లో కూడా ఇలాంటి ట్యాలెంట్ ఉంటే దగ్గరుండి ఎంకరేజ్ చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు శివాజీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.